Elders Life |
ముసలి తనం ఎంత దుర్బరం ?
' జన్మ ధు:ఖం, జరా ధు:ఖం
జాయా ధు:ఖం పునః పునః
సంసార సాగరం ధు:ఖం
తస్మాత్ జాగృత జాగృత: '
అని చెప్పనే చెప్పారు కదా మన వాళ్ళు. కానీ వృద్ధాప్యాన్ని ఒక మధురానుభూతిగా కూడా మార్చుకోవచ్చు. వృద్ధాప్యం లో ఈ క్రింది సూత్రాలు పాటించండి.
- ఆర్థిక భద్రత కలిగివుండేలా చూసుకోండి
- బీమా చేయించుకోండి
- పెన్షన్ వస్తే మంచిది. లేదంటే పెన్షన్ ప్లాన్స్ లో చేరండి
- పిల్లలతో (ఉంటే) సత్సంబంధాలు కలిగి ఉండండి. లేకుంటే దిగులు వద్ధు. బంధువులు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండండి
- ఒంటరితనాన్ని ఏకాంతంగా మలుచుకోండి
- యోగా, ధ్యానం లాంటివి చేయండి. చిన్న, చిన్న ఆసనాలు వేయండి
- మంచి పుస్తకాలు చదవండి
- ఎంత తినగలరో, అంతే తినండి
- క్షేత్రయాత్రలు, తీర్థ యాత్రలు చేయండి
- గతం గురించి ఆలోచించకండి.
- ఆరోగ్య స్పృహ మంచిదే కానీ, అతిగా ఆరోగ్యం గురించి ఆందోళన చెందకండి
- వృద్దాప్యం ఎవరికైనా తప్పదు అనే విషయాన్ని గ్రహించండి.
ఎంత వయస్సు మీద పడ్డా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాన్ని నమ్మండి అన్నిటికంటే ముఖ్యంగా "Age is only number" అనే విషయాన్ని బలంగా నమ్మండి మనో పరిపక్వత ఉంటే వృద్ధాప్యం ఒక వరం.