కృష్ణార్జున |
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -17
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః |
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ||
యః - ఎవ్వడు; తు - కాని; ఆత్మరతిః - ఆత్మలోనే ఆనందం పొందుతూ; ఏవ - నిక్కముగా; స్యాత్ - ఉంటాడో; ఆత్మతృప్తః - అత్మవికాసము కలవాడు; చ - మరియు; మానవః - మనిషి ఆత్మని తనలో; ఏవ - కేవలము; చ - మరియు; సన్తుష్టః - పూర్ణసంతుష్టుడు; తస్య - అతనికి; కార్యం - కర్మ; న విద్యతే - ఉండదు.
కాని ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందము పొందుతూ, పూర్ణసంతుష్టుడై కేవలము. ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు.
భాష్యము : పూర్తిగా కృష్ణభక్తిభావనాయుతుడు అయినవాడు, కృష్ణభక్తిభావనలో తన కర్మలచే పూర్తిగా సంతుష్టుడైనవాడు అయిన వ్యక్తికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. అతడు కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు. అయినందున హృదయంలో ఉన్నట్టి సమస్త పాపాలు తక్షణమే తొలగిపోతాయి. అటువంటి ప్రభావము వేలకొలది యజ్ఞాలు చేసినవుడే సాధ్యమయ్యేటటువంటిది. చేతనము ఆ రకంగా శుద్ధిపడడము ద్వారా మనిషి భగవంతునితో తనకు ఉన్నట్టి నిత్యసంబంధము గురించి పూర్తిగా నిశ్చయం పొందుతాడు. ఆ విధంగా అతని కర్మ భగవదను గ్రహంతో వెల్లడి అవుతుంది. అందుకే వేదాదేశాలకు అతడు ఇక ఏమాత్రము బద్దుడు కాడు. అటువంటి కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు లౌకికకార్యాలలో ఏమాత్రము ఇష్టము. చూవడు; మదిర్య మగువ, ఇతర మోహకలాపాలలో ఎంతమాత్రము ఆనందము పొందడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -18
నైవ తస్య కృతేనార్జో నాకృృతేనేహ కశ్చన 1
న చాన్య సర్వభూతేషు కళ్చిదర్ధవ్యపాశ్రయః ॥
న - ఉండదు; ఏవ - నిక్కముగా; తస్య - అతనికి; కృతేన - కర్మాచరణ ద్వారా; అర్థః - ప్రయోజనము; న - ఉండదు; అకృతేన - కర్మ చేయకపోవడానికి; ఇహ - ఈ లోకంలో; కశ్చన - ఏదీ; న - ఉండదు; చ - మరియు; అస్య - అతనికి; సర్వభూతేషు - సకల జీవులలో; కశ్చిత్ - ఎవ్వరినీ; అర్ధ - ప్రయోజనము; వ్యపాశ్రయః - ఆశ్రయించడంలో.
ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విధ్యుక్తకర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని, అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు.
భాష్యము : ఆత్మానుభూతిని పొందిన వ్యక్తికి కృష్ణభక్తిభావనలోని కర్మలు తప్ప ఎటువంటి కర్మనిర్వహణ బాధ్యత ఉండదు. రాబోవు శ్లోకాలలో వివరింపబడే రీతిగా, కృష్ణభక్తిభావన అంటే ఏ పనీ చేయకుండ ఉండడము' కూడ కాదు. కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు ఏ వ్యక్తినీ, అంటే మానవుని గాని, దేవతను గాని ఆశ్రయించడు. కృష్ణభక్తిభావనలో అతడు చేసేది ఏదైనా. అతని బాధ్యతా నిర్వహణకు సరిపోతుంది.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -19
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ॥
తస్మాత్ - అందుకే; అసక్తః - ఆసక్తి లేకుండ; సతతం - నిరంతరము; కార్యం - విధిగా; కర్మ - కర్మ; సమాచర - చేయాలి; అసక్తః - అసంగత్వముతో; హి - నిక్కముగా; ఆచరన్ - చేసి; కర్మ - కర్మను; పరం - భగవంతుని; ఆప్నోతి - పొందుతాడు; పూరుషః - మనిషి.
అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండ మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండ పనిచేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు.
భాష్యము. :. భక్తులకు “పరము” అనేది భగవంతుడు. కాగా నిరాకారవాదికి మోక్షము. అందుకే సరియైన మార్గదర్శనలో కర్మఫలాసకి లేకుండ శ్రీకృష్ణుని కొరకు లీదా కృష్ణభక్తిభావనలో పనిచేసేవాడు నిక్కముగా జీవిత చరమగమ్యము వైవుకు పురోగమిస్తాడు.. శ్రీకృష్ణుని ఇష్టానికే కురుక్షేత్రరణరంగములో యుద్ధం చేయమని అర్జునునికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అతడు యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు కోరుకున్నాడు. మంచివాడిగా లేదా అహింసావరునిగా అవడం స్వంత ఆసక్తి. కాని భగవంతుని పక్షాన పనిచేయడం ఫలాపేక్ష లేకుండ పనిచేయడం అవుతుంది. ఇదే దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన మహోత్పృష్టమైన పరిపూర్ణ కర్మ.
ఇంద్రియభోగ రంగంలో జరిగే పాపకార్యాలను శుద్ధిపరచడానికే యజ్ఞాల వంటి వేదవిహిత కర్మలు చేయబడతాయి. కాని కృష్ణభక్తిభావనలో కర్మ మంచి, చెడు కర్మఫలాలకు అతీతమైనది. కృష్ణభక్తిభావనలో ఉన్న వ్యక్తి ఫలాసక్తి లేకుండ కేవలము శ్రీకృష్ణుని కొరకు పనిచేస్తాడు. అతడు నానారకాల కర్మలలో. నెలకొనినా పూర్తిగా అనంగుడై ఉంటాడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -20
కర్మణైన హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ॥
కర్మణా - కర్మ ద్వారా; ఏవ - అయినా; హి - నిక్కముగా; సంసిద్ధిం - పూర్ణత్వంలో; ఆస్థితాః - నెలకొన్నారు; జనక ఆదయః - జనకుడు మున్నగు రాజులు; లోకసంగ్రహం - జనసామాన్యము; ఏవ అపి - కూడ, సంపశ్యన్ -. నిమిత్తము; కర్తుం - కర్మ చేయడానికి; అర్హసి - నీవు తగుదువు.
జనకుని వంటి రాజులు కేవలము కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి.
జనకుడు వంటి రాజులందరు ఆత్మదర్శులు. తత్ఫలితంగా వేదాలలోని కర్మలను చేయవలసిన బాధ్యత వారికి లేదు. అయినా జనసామాన్యానికి ఉదాహరణ నెలకొల్పడానికి వారు. అన్ని . విధ్యుక్తకర్మలను. చేసారు. జనకుడు సీతాదేవి తండ్రి, . శ్రీరాముని మామగారు. భగవంతుని పరమభక్తునిగా అతడు దివ్యస్థితిలో నెలకొన్నప్పటికినీ మిథిలకు (భారతదేశంలోని బీహారు నందలి ఒక ప్రాంతము) రాజైన కారణంగా విధ్యుక్త కర్మలను చేసే పద్ధతిని తన ప్రజలకు బోధించవలసివచ్చింది.
శ్రీకృష్ణభగవానునికి, భగవంతుని నిత్యమిత్రుడైన అర్జునునికి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడవలసిన అవనరమే లేదు. కాని మంచిమాటలు విఫలమైన పరిస్థితిలో హింస కూడ అవసరమని జనసామాన్యానికి బోధించడానికే వారు యుద్ధం చేసారు. కురుక్షేత్ర యుద్దానికి ముందు రణాన్ని తప్పించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. చివరకు భగవంతుడే ప్రయత్నించినా ఎదుటి పక్షము యుద్దానికే నిశ్చయించుకొన్నది. అటువంటి సరియైన కారణానికే యుద్ధము అవసరమైంది. కృష్ణభక్తిభావనలో నెలకొన్నవానికి జగత్తు పట్ల ఎటువంటి అభిరుచి లేకపోయినా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా వనిచేయాలో జనులకు బోధించడానికే అతడు పనిచేస్తాడు. కృష్ణభక్తిభావనలో అనుభవజ్ఞులైనవారు ఇతరులు అనుసరించే రతిలో పనిచేయగలుగుతారు. ఇది రాబోవు శ్లోకంలో వివరించబడింది.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 21
యద్ యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రుమాణం కురుతే లోకస్తదనువర్తతే ||
యత్ యత్ - దేనిని; ఆచరతి - ఆచరిస్తాడో; శ్రేష్టః - ఉత్తమ నాయకుడు; తత్ - దానిని; తత్ - దానిని మాత్రమే; ఏవ - నిక్కముగా; ఇతరః -, సామాన్యుడైన; జనః - వ్యక్తి, సః - అతడు; యత్ - దేనిని; ప్రమాణం - ఉపమానము; కురుతే - చేస్తాడో; లోక - లోకమంతా; తత్ - దానిని; అనువర్తతే - అనుసరిస్తుంది.
శ్రేష్టుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్యజనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది.
భాష్యము : ఆచరణాత్మక నడవడి ద్వారా బోధించగలిగే నాయకుడు జనసామాన్యానికి ఎల్లప్పుడు అవసరము. నాయకుడే పొగ త్రాగితే పొగత్రాగడం ఆపమని జనులకు బోధించలేడు. ఉపాధ్యాయుడు బోధనను ప్రారంభించడానికి ముందు సరిగ్గా నడుచుకోవాలని శ్రీచైతన్యమహాప్రభువు చెప్పారు. ఈ రకంగా బోధించేవాడే ఆచార్యుడు, అంటే ఆదర్శనీయుడైన గురువని పిలువబడతాడు. అందుకే సామాన్యునికి బోధించడానికి గురువు _ శాస్త్రనియమాలను తప్పక పాటించాలి. గురువు శాస్త్రనియమాలకు విరుద్ధంగా నియమాలను సృష్టించకూడదు. మనుసంహిత వంటి శాస్థ్రాలు మానవులు అనుసరించవలసిన ప్రామాణిక. గ్రంథాలుగా పరిగణించబడ్డాయి.
ఈ విధంగా నాయకుని బోధలు అటువంటి ప్రామాణిక శాస్త్ర సిద్ధాంతాలపై ఆధారపడి ఉండాలి.
తనను బాగుపరచుకోవడానికి కోరుకునేవాడు మహా ఆచార్యులు ఆచరించిన ప్రామాణిక నియమాలను అనుసరించాలి. మనిషి మహాజనుల పదచిహ్నాలను అనుసరించాలని శ్రీమద్భాగవతము కూడ ధ్రువవరవింది. ఆత్మానుభూతి మార్గంలో ఇదే ప్రగతి విధానం. రాజు లేదా దేశాధినేత, తండ్రి, పాఠశాల ఉపాధ్యాయుడు అమాయక జనసామాన్యానికి సహజ నాయకులుగా భావించబడ్డారు. అటువంటి సహజ నాయకులందరు తమపై ఆధారవడినవారి గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారు. అందుకే నీతిసూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాల ప్రామాణిక గ్రంథాలలో వారు తప్పక నిపుణులై ఉండాలి.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 22
న మే పార్దాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥
మే - నాకు; పార్ధ - ఓ వృథా కుమారా; న అస్తి - లేదు; కర్తవ్యం - విధింపబడిన కర్మ; త్రిష - మూడు; లోకేషు - లోకాలలో; కించన - ఏదీ; న - లేదు; అనవాప్తం - కోరేది; అవాప్తవ్యం - పాందవలసింది; వర్త - నేను నెలకొన్నాను; ఏవ - నికృముగా; చ - కూడ; కర్మణి - విధ్యుక్త కర్మలో.
ఓ పృథాకుమారా! ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు. నేను కోరేది ఏదీ లేదు, దేనినీ పొందవలసిన అవసరము లేదు. అయినా కూడ నేను విధ్యుక్త కర్మలలో నెలకొన్నాను.
భాష్యము : వేదవాజ్మయములో భగవానుడు ఈ విధంగా వర్ణించబడ్డాడు :
తం ఈశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం |
పతిం వతీనాం వరమం పరస్తాద్ విదామదేవం భువనేశమీడ్యమ్ ॥
న తన్య కార్యం కరణం చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే 1
'పరాన్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ ॥
“భగవానుడు సకల ఇతర నియామకులందరికీ నియామకుడు. ఆతడే వివిధ సమస్త లోకపాలకులలో అతి ఘనమైనవాడు. ప్రతియొక్కడు ఆతని ఆధీనంలో ఉన్నాడు. జీవులందరికీ కేవలము. భగవంతుని ద్వారానే ఆయా శక్తులు ఇవ్వబడినాయి; వారు స్వతః గొప్పవారు కారు. భగవంతుడు దేవతలందరి చేత పూజనీయుడు, ఆతడే నిర్దేశకులందరికీ వరమ నిర్దేశకుడు. అందుకే సమస్త లౌకిక నాయకులకు, నియామకులకు ఆతడు దివ్యుడై వారందరి చేత పూజనీయుడై ఉన్నాడు. ఆతని కంటే ఘనమైనవాడు లేడు, ఆతడే సర్వకారణాలకు పరమకారణుడు.”
"అతడు సాధారణ జీవునికి ఉన్నట్టి దేహాన్ని కలిగి ఉండడు. ఆతని దేహానికి, ఆత్మకు తేడా ఉండదు. ఆతడు పూర్ణుడు. ఆతని ఇంద్రియాలన్నీ దివ్యమైనవి. ఆతని ఇంద్రియాలలో ఏ. ఇంద్రియమైనా ఇతర ఇంద్రియ కార్యాన్ని చేయగలుగుతుంది. అందుకే ఆతని ఆతనికి మించినవాడు గాని, సమానుడు గాని లేడు. ఆతని శక్తులు అనేకములు, అందుకే ఆతని కార్యాలన్నీ సహజరీతిలో జరిగి పోతుంటాయి” (శ్వేతాశ్వతరోపనిషత్ 6-7-8)
భగవానునిలో ప్రతీదీ పూర్ణ ఐశ్వర్యంతోను, పూర్ణనత్యంగాను ఉండడము వలన వలన కార్యము ఏదీ లేదు. కార్యఫలితాన్ని తప్పకుండ పొందవలసి ఏదో చేయవలసిన కార్యం ఉంటుంది. కాని ముల్లోకాలలో ఏదీ పాందవలసినది నివానికి ఏ కార్యము ఉండదు. అయినా శ్రీకృష్ణభగవానుడు క్షత్రియుల నాయకునిగా కురుక్షేత్ర యుద్ధరంగంలో నెలకొన్నాడు. ఎందుకంటే దుఃఖితులైనవారికి రక్షణను ఇవ్వడం క్షత్రియుల కర్తవ్యం. ఆతడు శాస్త్ర విధులన్నింటికీ అతీతుడైన శాస్త్రాలను భంగపరిచేది ఏదీ చేయడు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 23
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రిత : |
మమ వర్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ॥
యది - ఒకవేళ; హి - నిక్కముగా; అహం -- నేను; న వర్తేయం - ఆ విధంగా నెలకొనకపోతే; జాతు - ఎప్పుడైనా; కర్మణి - విధ్యుక్త కర్మాచరణలో; అతన్ద్రితః - అతిజాగ్రత్తగా; మమ - నా యొక్క; వర్మ - మార్గాన్ని; అనువర్తన్తే - అనుసరిస్తారు; మనుష్యః - మనుషులందరు; పార్థ - ఓ పృథా కుమారా; సర్వశః - అన్ని విధాలుగా.
ఓ పార్థా! ఎందుకంటే ఒకవేళ నేను విధ్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా ఫలుడనైతే నిక్కముగా మనుషులందరు నా మార్గమునే అనుసరిస్తారు.
భాష్యము : ఆధ్యాత్మికజీవన పురోగతి కొరకు సాంఘిక ప్రశాంతతను నిలిపి ఉంచడానికి ప్రతీ నాగరిక మనిషికి వంశాచారాలు ఉద్దేశించబడ్డాయి. అటువంటి నియమనిబంధనలు బద్దజీవునికే గాక శ్రీకృష్ణునికి కాకపోయినా ధర్మస్థావనకే అవతరించిన కారణంగా ఆతని అడుగుజాడలలోనే సామాన్యజనులు నడుస్తారు. శ్రీకృష్ణభగవానుడు గృహస్తునికి అవసరమైన సమస్త ధార్మిక కార్యాలను గృహము లోపల, గృహము బయట కూడ నిర్వహించే వాడని శ్రీమద్భాగవతము నుండి తెలుస్తున్నది.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 24
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం |
సంకరన్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ||
ఉత్పీదేయుః - నాశనమౌతాయి; ఇమే - ఈ; లోకాః - లోకాలు; న కుర్యాం - నేను చేయకపోతే; కర్మ - విధ్యుక్త కర్మలు; చేత్ - ఒకవేళ; అహం - నేను; సంకరస్య - అనవసరమైన ప్రజా సమూహాన్ని; చ - మరియు; కర్తా - సృష్టించినవాడను; స్యాం - అవుతాను; ఉపహన్యాం - నాశనము చేసినవాడను; ఇమాః - ఈ; ప్రజాః - జీవులందరినీ.
నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమౌతాయి. అనవసరమైన ప్రజాసృష్టికి నేను. కారణుడనై తద్ద్వారా జీవులందరి శాంతిని నష్టపరచినవాడనౌతాను.
భాష్యము : సామాన్య సంఘ శాంతికి భంగము కలిగించే అనవసరమైన జనాభాయే వర్ణసంకరము. సాంఘిక కలతను నివారించడానికి నియమనిబంధనలు ఉన్నాయి. వాటి ద్వారా జనులు జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి కొరకు అప్రయత్నంగానే శాంతియుతులు, క్రమబద్ధత కలవారు అవుతారు. శ్రీకృష్ణభగవానుడు అవతరించినపుడు సహజంగానే అట్టి నియమనిబంధనలను చక్కగా పాటిస్తూ ఆ ముఖ్యమైన కలాపాల గౌరవాన్ని, అవసరాన్ని నిలబెడతాడు. భగవంతుడు జీవులందరికీ తండ్రి.
ఒకవేళ ఆ జీవులు దారితప్పితే వరోక్షంగా భగవంతుడే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. అందుకే ధర్మాల పట్ల అగౌరవము కలిగినపుడు భగవంతుడు స్వయంగా అవతరించి సంఘాన్ని సరిదిద్దుతాడు. అయినా మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే భగవంతుని పదచిహ్నాలను అనుసరించాల్సి ఉన్నప్పటికిని ఆతనిని మనం అనుకరించలేమని గుర్తుంచుకోవాలి. అనుసరించడం, అనుకరించడం ఒకే స్థాయిలో ఉన్నవి కావు. భగవంతుడు తన బాల్యంలో చేసినట్టి గోవర్దనోద్ధరణ లీలను మనం అనుకరించలేము. అది ఏ మనిషికైనా అసాధ్యము. మనము, ఆతని ఉపదేశాలను తప్పకుండ అనుసరించాలి, కాని ఏ సమయంలోనైనా ఆతనిని అనుకరించలేము. శ్రీమద్భాగవతము (10.33.30-31) ఈ క్రింది విషయాన్ని ధ్రువపరిచింది :
నైతత్సమాచరే జ్ఞాతు మనసాపి హ్యనీశ్వరః 1
వినశ్యత్యాచరన్ మౌఢ్యాద్యథా రుద్రోబ్దిజం విషం ॥
ఈశ్వరాణాం వచః సత్యం తథైవా చరితం క్వచిత్ |
తేషాం యత్ స్వవవోయుక్తం బుద్ధిమాం స్త త్సమౌచరేత్ ॥
“మనిషి కేవలము భగవానుని ఆదేశాలను, ఆతని శక్త్యావేశ సేవకుల ఆదేశాలను అనుసరించాలి. వారి ఉపదేశాలు మనకు సర్వశుభదాయకాలు. బుద్ధిమంతుడు వాటిని ఉపదేశించిన రీతిగా అమలు చేస్తాడు. అయినా వారి కలాపాలను అనుకరించకుండ మనిషి జాగ్రత్తవడాలి. శివుడిని అనుకరిస్తూ ఎవ్వడూ విషపూరిత పానానికి ప్రయత్నించకూడదు.”
ఈశ్వరుల స్థితిని, అంటే సర్యోన్నతులుగా సూర్యచంద్రుల గమనాన్ని నిజంగా నియంత్రించగలిగిన వారి స్థితిని మనము సర్వదా గుర్తించాలి. అటువంటి శక్తి లేనిదే పరమ శక్తిమంతులైన ఈశ్వరులను ఎవ్వడూ అనుకరించకూడదు. శివుడు సముద్రమంత విస్తారముగా ఉన్న విషాన్ని త్రాగాడు. కాని ఎవడైనా సామాన్యవ్యక్తి ఆ విషంలో కించిత్తు భాగం త్రాగడానికి యత్నించినా చనిపోతాడు. చాలామంది కుహనా శివభక్తులు గంజాయి పీల్చడం, అటువంటి. మాదకద్రవ్యాలను వాడడం వంటివి చేస్తారు. శివుని కలాపాలను ఆ రకంగా అనుకరించడం ద్వారా తాము మృత్యువును దగ్గరికి పిలుస్తున్నామని వారు విన్మరిస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణభగవానుని మిథ్యాభక్తులు కొందరు గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేని తమ అసమర్థతను మరిచిపోయి ఆ దేవదేవుని రాసలీలలను, అంటే. ప్రేమనృత్యాన్ని అనుకరించడానికి ఇష్టపడతారు. అందుకే శక్తిమంతులైనవారిని అనుకరించడం కంటే వారి ఉపదేశాలను అనుసరించడం ఉత్తమము. అంతే కాకుండ యోగ్యత లేకుండ వారి స్థానాలను ఆక్రమించే యత్నం కూడ చేయకూడదు. భగవచ్చక్తి లేనట్టి భగవదవతారాలు చాలా ఉన్నాయి.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 25
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్యాద్ విద్వాంస్తథాసక్తన్చికీర్షుర్లోకసంగ్రహం ||
సక్తాః - అసక్తులై; కర్మణి - కర్మలలో; అవిద్వాంసః - పామరులు; యథా - ఎట్లా; కుర్వన్తి - చేస్తారో; భారత - ఓ భరతవంశీయుడా; కుర్యాత్ - తప్పకుండ చేయాలి; విద్వాన్ - పండితుడు; తథా - ఆ విధంగా; అసక్తః - సంగరహితంగా; చికీర్షుః - నడపడానికి; లోకసంగ్రహం - జనసామాన్యాన్ని.
పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరియైన మార్గంలో నడిపించడానికి అదేరకంగా, కాని సంగరహితంగా వర్తించాలి.
భావ్యము : కృష్ణభక్తిభావనలో ఉన్న వ్యక్తి మరియు కృష్ణభక్తిభావనలో లేని వ్యక్తి భిన్న కోరికల ద్వారా భేదపరుపబడతారు. కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు కృష్ణభక్తిభావన వృద్ధికి దోహదపడనిది ఏదీ చేయడు. అతడు భౌతికకలాపాల పట్ల అమితాసక్తుడైన పామరునిలాగా పనిచేస్తుండవచ్చును. కాని ఒకడు ఇంద్రియభోగార్థమే అటువంటి కార్యాలలో నెలకొంటే, వేరొకడు కృష్ణ ప్రీత్యర్థము ఆ కార్యాలలో నెలకొంటాడు. అందుకే కృష్ణభక్తిభావన ఉద్దేశముతో ఏ విధంగా వనిచేయాలో, ఏ విధంగా కర్మఫలాలను వినియోగించాలో జనసామాన్యానికి కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు చూపవలసిన అవసరము ఉన్నది.