కాకి శాస్త్రం |
Kaaki Sastram In Telugu:
బల్లి శాస్త్రం ఉన్నట్లుగానే కాకి శాస్త్రం కూడా ఉంది. కాకి తన్నితే అశుభం అంటారు. కాకి ఇంటి ముందు వచ్చి అరుస్తే చుట్టాలు వస్తారని అంటారు. ఇలా కాకి మన దగ్గరికి వచ్చి చేసే పనుల వల్ల శుభాలు, అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది.
ఇలాంటి కాకి శాస్త్రాన్ని గతంలో మన పూర్వీకులు, పెద్దలు చదివేవారు. ప్రస్తుతం ఈ కాకి శాస్త్రాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ముందుజాగ్రత్తగా కాకి శాస్త్రం గురించి తెలుసుకోవడం ఎంతకైనా మంచిదే.
అతిథి రాకకు సంకేతం
ఇంటి ముందు కాకులు వచ్చి గట్టిగా అరిస్తే.. మరికొంత సేపట్లో ఇంటికి బంధువులు రాబోతున్నారని పెద్దలు చెప్పేవారు. ఇది ఎన్ని సార్లు నిజమైందో గమనించిన వారికే తెలియాలి.
సంతానం
పెళ్లి భోజనంలో ఉన్న స్వీట్లను కాకి తన ముక్కుతో పట్టుకొని లటుక్కున ఎగిరిపోతే ఆ పెళ్లి చేసుకున్న జంటకు త్వరలోనే పండండి అందమైన బిడ్డ జన్మించనుందని శాస్త్రం చెబుతుంది.
లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది
ఎవరి ఇంట్లోనైనా నీటితో ఉన్న కుండపో వాలితే ఆ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి రాబోతోందని, అంటే సంపద మెండుగా లభించనుందని అర్ధం.
డబ్బుకు కొరత ఉండదు
ప్రతీ రోజూ కాకికి ఆహారం పెడితే ఐశ్వర్యం లభిస్తుందని. ఆ ఇంటికి ఎప్పుడూ మంచి జరుగుతుందని సూచన.
అందమైన భార్య
కాకి నోటినుంచి తెలుపు లేదా పసుపు రంగు స్వీట్స్ జారిపడి మీద పడితే అతనికి త్వరలో ఓ అందమైన అమ్మాయితో వివాహం జరగబోతోందని శాస్త్రం చెబుతుంది.
విజయవంతం
మీరు ఏదైనా పని పూర్తి చేయడానికి వెళ్లేటప్పుడుు కాకి దక్షిణం నుంచి ఉత్తరం వైపు, లేదా తూర్పు నుంచి పడమర వైపుకు ముక్కుతో స్వీట్స్ పట్టుకొని వెళ్తంటే మీ పని త్వరలో విజయవంతంగా పూర్తవుతుందని సంకేతం.