మనిషి జీవితంలో కలిగే శుభాశుభాలకు నవగ్రహాలే కారణమని, వాటికి శాంతి చేయిస్తే మంచి జరుగుతుందని అంటారు. నిజమేనా?
మన శాస్తాలు బోధించే ప్రతివాక్యము సత్యమే. దాన్ని మనం సరియైన భావాలతో అన్వయించుకోవాలి. వక్ర దృష్టితో చూడకూడదు. మొండి వాదనలకు దిగకూడదు. మనిషి యొక్క పుట్టుక నుండి మరణం వరకూ అతని జీవనగతిని, వ్యక్తిత్వాన్ని, మరెన్నో కీలకమైన అంశాలని జ్యోతిష్య శాస్త్రంలో చర్చించబడి యున్నాయి.
"గ్రహాయత్తా లోకయాత్రా"” - మనం ప్రయాణం చేస్తున్న వాహనాన్ని డ్రైవరు ఏ విధంగా నడిపించి గమ్యానికి చేరుస్తాడో, అదే విధంగా నవగ్రహాలు మానవుని జీవనగతికి ఆధారములవుతున్నాయి. అట్టి మానవుడు జన్మాంతరంలో చేసుకున్న కర్మల వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందుటకై తప్పక ప్రాయశ్చిత్తాది శాస్త్రం చేయమంటుంది.