అమ్మ |
Hindu Baby Boy And Girl Names With letter 'A'
Agajaatha - అగజాత :
పార్వతీ దేవికి “శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత …అని అనేక పేర్లు ఉన్నాయి.
AghuDu - అఘుడు :
రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.
అగస్త్య మహర్షి,Agastya Muni :
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు? అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు. అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర .
Agni - అగ్ని:
వేదములలో పేర్కొన్న ఓక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి.
Anasuya : అనసూయ
అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.
Anjana - అంజన:
కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.
Atri : అత్రి
బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు.
Arjunudu : అర్జునుడు
స్వచ్చమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతి కి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . . పాండురాజు తనయుడు .ఇతనికి అనేక పేర్లు ముఖ్యము గా 10 పేర్లు :
- అర్జునుడు ,
- పార్దు ,
- కిరీటి ,
- పాల్గుణ,
- శ్వేతవాహనుడు ,
- భీభత్సుడు ,
- ధనంజయుడు ,
- విజయుడు ,
- నవ్య్ సాచి ,
- జిష్ణుడు .
AbhimanyuDu : అభిమన్యుడు
అర్జునుడు - సుభద్రల కుమారుడు . కురుక్షేత్ర సంగ్రామములో పద్మవ్యూహం లోపలకు వెళ్ళి బయటకు రావడం తెలియక మరణించాడు . అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు..... యధిష్టురుని తరువాత హస్తినాపురానికి (పరీక్షిత్తు) రాజు అయ్యాడు. పరీక్షిత్తు వలననే పాండవ వంశము వృద్ధి చెందినది.
AnaadrushyuDu : అనాదృష్యుడు
గాంధారీ , ధృతరాష్ట్రుల కుమారుడు . నూరుగురు కౌరవులలో ఒకడు .
Aswaddhaama :అశ్వత్థామ
గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఇతడు చిరంజీవి . ద్రోణుని కుమారుడు . పాండవ ద్వేషి .
AnjanEyuDu : ఆంజనేయుడు
'అంజన'కు పుట్టినవాడు అని అర్ధము . హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి,మారుతి , వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
Ambika : అంబిక - 1.
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Ambika : అంబిక -2.
మహాభారతము లో సత్యవతి - శంతన మహారారు కుమారుడైన చిత్రాంగుని భార్య పేరు అంబిక . భర్త చనిపోయిన తరువాత ఈమె కు వ్యాసుని వలన గుడ్డివాడైన ధృతరాస్ట్రుడు జన్మిస్తాడు .
Ambaalika : అంబాలిక
విచిత్రవీర్యుని ఇద్దరి భార్యలలో రెండెవది . విచిత్ర వీర్యుడు 8 సమ్వత్సరాలు కాపురము చేసి క్షయ (టి.బి.) వ్యాధి లో చనిపోయిన తరువాత అత్తగారైన సత్యవతి ప్రోద్బలముతో వ్యాసుని వలన పాండురాజును కన్నది .
Amma : అమ్మ
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
AnirudduDu : అనిరుద్దుడు
శ్రీకృష్ణుని మనుమడు . ప్రద్యుమ్నుని కుమారుడు . బాణాసురుడి కుమార్తె ' ఉష ' కు భర్త .
AkrUruDu - అక్రూరుడు :
శ్రీకౄష్ణుని మేనమామ. అక్రూరుడు తండ్రి శ్వఫల్కుడు , కాశీరాజు కుమార్తెకు, శ్వఫల్కుడికి జన్మించిన వాడే అక్రూరుడు, సత్ప్రవర్తన, బ్రహ్మచర్య దీక్ష కలిగిన అక్రూరుడే శమంతక మణిని గ్రహించటానికి అర్హుడని కృష్ణుడు ఆమణిని అక్రూరుడికి ఇచ్చాడు. అలా ఆనాటినుండి అక్రూరుడు మనస్సులో ఎలాంటి భయాలు లేకుండా యజ్ఞాలను, శమంతక మణి ఇచ్చే బంగారం సహాయంతో చేస్తూ లోకకళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
Akarkaarudu - అకర్కారుడు :
కద్రువ కొడుకు. ఒక సర్పం.
Aparna : అపర్ణ
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
మేరువు కుమార్తె , ధాత భార్య . ఈమె కుమారుడు .. ప్రాణుడు .
AkshayapAtra : అక్షయపాత్ర
అరణ్యవాసము చేస్తున్న ధర్మరాజు తనవెంట బ్రాహ్మణ భోజనార్ధం సూర్యుడుని ప్రార్ధించి ఒక పాత్ర సంపాదించారు . దానిలో కొద్దిగా వండినా అక్షయమవుతుంది (సరిపోయినంత) , దానితో ధర్మరాజు నిరంతరము అన్నదానాలు చేస్తుంటాడు .
Agnishauchamu , అగ్ని శౌచము :
కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము .
Alakananda : అలకనంద
దేవలోకం లోని గంగానది . పితృలోకాలో పయనించేటప్పుడు దీనిని ' వైతరణి ' అంటారు . మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.
స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనేవి ఆ మూడు లోకాలు.
- స్వర్గలోకంలో మందాకిని,
- భూలోకంలో గంగ మరియు అలకనంద
- పాతాళలోకంలో భోగవతి... అని గంగానదికి పేర్లు.
AtikaayuDu : అతికాయుడు
రావణుని కుమారుడు . పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.
Aanantha vijayam ,
అనంత విజయం : ధర్మరాజు శంఖము
Achala,అచల:
కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.
Ahalya ,అహల్య :
అహల్య గౌతమ మహర్షి భార్య.ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.
పుట్టుక-- బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.
అంగదుడు :
- లక్ష్మణుని కుమారుడు, ఇతని నగరము అంగదపురము
- ఒక వానరుడు. వాలి పుత్రుడు. ఇతని తల్లి తార. వాలి మరణానంతరం సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యెని. అపుడితడు యువరాజాయెను.
అంగరాజు :
- బలి-యను రాజు కుమారుడు. ఇతని తల్లి సుధేష్ణ. ఈమె భర్త వియోగముచే 'దీర్ఘతముని' వలన నితనిని కన్నది. ఇతడు పాలించిన దేశమే అంగదేశము.
- కర్ణుడు.
అంగారకుడు :
- ఏకాదశ రుద్రులలో ఒకడు.
- నవగ్రహముకలో ఒకడు. భూదేవి విష్ణుమూర్తిని కామించి స్త్రీ రూపము దాల్చియాతని తన కోర్కె దీర్చమని కోరెను. విష్ణువు అంగీకరించెను. భూదేవి పగడపు రూపమున నొక బీజమును విడెచెను. దాని నుండి అంగారకుడు పుట్టేను (బ్రహ్మవైవర్తన పురాణం).
అంగారపర్ణుడు :
ఒక గంధర్వుడు, కుబేరుని మిత్రుడు. ద్రుపదునగరం పోవుచున్న అర్జునునితో యుద్ధము చేసి ఓడిపోయి, అర్జునుని శక్తి సామర్థాలను మెచ్చుకొని 'జాక్షుసి' యను గంధర్వ విద్యనుపదేశించెను.
అంగిరసుడు :
1) యాగ్నేయీయూరువుల కుమారుడు.(మత్స్య పురాణం).
2) పథ్యుని శిష్యుడు.అధర్వణ వేదము పఠించెను.(భాగవతము).
3) ఉల్ముకుని కుమారుడు.అంగుని తమ్ముడు. ఇతని భార్య స్మృతి.
4) ఒక ముని. ఈయన ప్రసిద్ధోపాస్యభూతమైన ముఖ్య ప్రాణమును ఆత్మదృష్టిచే ఉపాసన చేసెను. అందువలన ముఖ్య ప్రాణమును అంగిరసముగ ఋషులు తలచుచున్నారు.
5) బ్రహ్మ మానస పుత్రుడు. ఒకనాడు అగ్నికి కోపమువచ్చి తన రూపమునుపహరించి తపస్సు చేయనారంభించెను. కొలది కాలములో అగ్ని స్థానమును అంగీరసునకీయబడెను. తన పదవి పోగిట్టుకొనిన అగ్ని చింతించెను. అపుడు అంగిరసుడు ఆ పదవినతనికిచ్చి తనకు పుత్రునిగా ఉండుటకంగీకరించెను. ఇతని భార్య శివ(శ్రద్ధ). ఈతనికి బృహర్కీర్తి, బృహజ్యోతి, సంవర్తనుడు, ఉతధ్యుడు, మొదలగు పుత్రులు పుట్టిరి.
అరుంధతి -Arundhathi :
ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతా రు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు. మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు.
రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.
అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి.? గాలిపటం ఆకారంలో 7 నక్షత్రాలు ఉంటాయి. అవే సప్తషులు. తోక భాగంలో క్రిందినుండి రెండవది వశిష్ఠుడు. వశిష్ఠుని ప్రక్కనే అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.
డా . శేషగిరిరావు