నోము చేయుచున్న .. రూపవతి వందన . |
నోముకి వ్రతానికి గల తేడా ఏమిటి - Difference between Nomulu and Vratamulu?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము , వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు . భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము . దండము పెట్టి ... దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీనకాలము లో శాస్ర ప్రరంగా నమ్మకము కుదరడలేదు . ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంధాలు లలో ఉన్న ప్రకారము .
నోము చేయుచున్న .. రూపవతి వందన . |
- నోము : మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము . ఉదా:శ్రావణమంగళవారం నోము , అట్లతద్ది నోము . నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు. ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము.
- వ్రతము : అత్యంత నియం నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతము . వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా: వరలక్ష్మీ వ్రతం. సావిత్రీ వ్రతం. గౌరీ వ్రతం. మున్నగునవి .