Purusharthas |
పురుషార్థాలంటే ఏమిటి?
ధర్మార్ధ కామ మొక్షములే పురుషార్ధములు. ఈ లోకంలో ప్రతి వ్యక్తీ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. ఆ కోరికనే “కామః” అంటుంది శాస్త్రం. అట్టి సుఖాన్నిచ్చే పరికరములను పొందడానికి ధనం అవసరం. కనుక ధనాన్ని “అర్థ” అంటుంది. అయితే ఈ ధనాన్ని 'ధర్మ' మార్గంలో ఆర్జించి తద్వారా జీవితంలో సుఖాన్ని, హాయిని, తృప్తిని పొందే జీవన విధానాన్ని శాస్తాలు నిర్దేశిస్తున్నాయి.
మనిషి జీవన విధానానికి ధర్మ, అర్థ, కామములు ప్రధానమైన అంశములైతే, మనిషి యుక్క జీవిత లక్న్యానికి "మోక్షమే" అత్యంత ప్రధానమైన అంశముగా శాస్త్రాలు పరిగణిస్తున్నాయి. అట్టి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పొందాలనుకునే వారికి ఆశ్రమ ధర్మాలను ప్రభో ధిస్తున్నాయి.