Telugu Lingamulu - తెలుగు లింగములు
లింగములు మూడు రకాలు:
- మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
- మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
- అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.