Telugu Bhasha Bhagalu |
తెలుగు భాషాభాగములు ఐదు రకములు, అవి: |
---|
భాషాభాగము | ఉదాహరణ |
---|---|
1. నామవాచకము |
ఒక వ్యక్తిని గాని, వస్తువుని , జాతిని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు. ఉదాహరణకు: కృష్ణ,రాధ,గీత కృష్ణుడు అల్లరి బాలుడు. పై వాక్యంలో కృష్ణ అనేది నామవాచకం |
2. సర్వనామము | నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు. ఉదాహరణకు: అతడు, ఆమె, అది, ఇది... కృష్ణుడు అల్లరి బాలుడు. అతడు రాక్షస కంసుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో కృష్ణ అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు కృష్ణ అనే అర్ధం. అయితే కృష్ణడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం. |
3. విశేషణము | విశేషణం: నామవాచకముల, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వాటిని విశేషణములందురు. ఉదాహరణకు: మంచి బాలుడు |
4. అవ్యయము | లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు ఉదాహరణకు: అక్కడ, ఇక్కడ.. |
5. క్రియ | పనులను తెలుపు పదములను క్రియలందురు. ఉదాహరణకు: ఆడుట, పాడుట, నవ్వటం, ఏడవటం... |