శ్రీవేంకటేశ్వరస్వామి |
1963 లో బేసిక్ రికార్డ్(N.96247) గా ఘంటసాల, బృందం గానం చేసిన "శ్రీవేంకటేశ్వరస్వామి బుఱ్ఱకథ-1 & 2"ప్రైవేట్ పాట,
- సంగీతం: ఘంటసాల,
- రచన: ఏ.వేణుగోపాల్
కలియుగంలో భక్తులను కొంగు బంగారమై కరుణించ దలచి శ్రీలక్ష్మి, మహావిష్ణువు ఒక రసవత్తరమైన నాటకంతో వైకుంఠం వదలి రావడం అంతకు ముందే క్రితం జన్మలో వేదవతి యైన పద్మావతిని శ్రీనివాసుడు(విష్ణువు) పరిణయమాడి లక్మి,పద్మావతుల అలక దీర్చలేక శిలా రూపంగా మారే శ్రీనివాసుని దివ్య గాథను చాలమందికి స్పష్టంగా తెలిపేందుకు ఒక బుర్రకథగా
శ్రీ ఎ.వేణుగోపాల్ వ్రాసారు. సనామధేయుడైన వేంకటేశ్వర రావు(ఘంటసాల) వేంకటేశ్వరుని చరిత్ర ను తన స్వంత బాణీలో తన్మయత్వంతో భక్త తమకంతో కథను కనులముందు సాక్షాత్కరించేలా బుర్రకథ ప్రక్రియలో ఎలా పాడారో విని తరిద్దాం-నరసింహ కుమార్.టి.వి
వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
ఆలపించినా ఆలకించినా ముక్తినొసగునయ్యా తందానతాన
ఆలపించినా ఆలకించినా ముక్తినొసగునయ్యా తందానతాన
వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
వైకుంఠమున ఆదివిష్ణువు వైభవమొందుచునుండగ
వైభవమొందుచునుండగ
లక్ష్మిదేవి పతి పాదములొత్తుచు సేవలుచేయుచునుండగ
పతి సేవలుచేయుచునుండగ
కోపధారి భృగువచ్చటికేగి తన్నెను శ్రీహరిని తందానతాన
అలిగిపోయిన లక్ష్మిని వెదకగ వెడలెను శ్రీహరియే చేరెను భూలోకం
హోయ్ వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
పాముపుట్టలో తలదాచుకొని కాలముగడిపాడు
కాలముగడిపాడు
పాలను ద్రాగుచు సాకినాడు ఆరుద్రుడే గోవయ్యా
ఆరుద్రుడే గోవయ్యా
పాపము పండినగొల్లడొకడు బాదెను ప్రభు తలపైన తందానతాన
బాధకు తాళక ఘోర శాపమును ఇచ్చెను శ్రీహరియే, గొల్లడు భూతమయే
హోయ్ వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
అటుపిమ్మట మహా విష్ణువు ఏంచేసాడయా
ఏంచేసాడయా అంటే
ఒంటివాడుగా అడవుల తిరిగి వకుళనుచేరాడు
ఆ వకుళనుచేరాడు
కంటిపాపలా చూచిన వకుళకు కన్నకొడుకులా మెలిగాడు
కన్నకొడుకులా మెలిగాడు
తోటలొచూచిన పద్మావతిని మనసున నిలిపాడు తందానతాన
హోయ్ పచ్చని పందిట పద్మావతిని పరిణయమాడాడు పరిణయమాడాడు
హోయ్ వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
ఆలపించినా ఆలకించినా ముక్తినొసగునయ్యా తందానతాన
వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
తందానోయ్ తానె తందనా తందానోయ్ తానె తందనాన
పరిణయమాడిన పద్మావతితో పయనమయ్యినాడూ తందానతాన
ఆగస్త్య మహముని ఆశ్రమంబున అతిథిగ ఉన్నాడూ తందానతాన
దంపతులచ్చట తపోధనులకూ దర్శనమిచ్చాడూ తందానతాన
వెంకటాద్రిపై విశ్రమించగా తరలిపోయినారూ తందానతాన
తందానోయ్ తానె తందనా తందానోయ్ తానె తందనా
వైకుంఠము విడి వెడలిన లక్ష్మీ నాధుని కలిసిందీ
అహ నాధుని కలిసిందీ
పతి దరి ఉన్నా పద్మావతిని పరుషములాడిందీ
ఒహో పరుషములాడిందీ
ఇద్దరి భార్యల మధ్య శ్రీహరి ఏమి చేయలేక
అహ ఏమి చేయలేక
శ్రీనివాసుడాకొండలపైనే శిలారూపుడై నిలిచాడు
శిలారూపుడై నిలిచాడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తొండమానుడా కొండలపైనా ఆలయమొక్కటి కట్టించే
అహ ఆలయమొక్కటి కట్టించే
శ్రీనివాసుడే వెంకటేసుడై తిరుమలపైన దర్శనమిచ్చె
తిరుమలపైన దర్శనమిచ్చె
భక్తకోటిలా భారముమోసి ముక్తిని ఇచ్చే బాటండి
భక్తకోటిలా భారముమోసి ముక్తిని ఇచ్చే బాటండి
కలియుగమందలి వైకుఠమిదే కన్నులార మీరు కనరండి
కన్నులార మీరు కనరండి
హోయ్ వినుడు వినుడు శ్రీవెంకటేసుని పుణ్యచరితమయ్యా తందానతాన
ఆలపించినా ఆలకించినా ముక్తినొసగునయ్యా తందానతాన
తందానోయ్ తానె తందనా తందానోయ్ తానె తందనా
తందానోయ్ తానె తందనా
కలియుగంలో ప్రత్యక్ష దైవమై వెలసిన ఆ వెంకటేశ్వరుని స్మరించి తరించండి
ఆడుగడుగు దణ్ణాలవాడా ఆపదమొక్కులవాడా వడ్డికాసులవాడా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద