శుకబ్రహ్మ |
శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.
శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.
అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.
కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.
- చరణ