Kundalini yoga |
కలలో పాము కనిపిస్తే ఏమైనా కీడు జరుగుతుందా?
మీ కలలు బహుశా మీకు ఏదైనా శకునం లేదా సూచన ఇస్తూ ఉండవచ్చు..
అసలు కలలు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఇవీ:
మీకు తెలియకుండా మీ మనసు పొరల్లో దాగి ఉన్న అనేక కోరికల ప్రతీకగా.. మీరు ఈరోజు నిద్రపోయేవరకూ మీ దైనందిన జీవితంలో జరిగిన సంఘటనలు, మీ మెదడు నెమరు వేసుకోవడం..
ఇక పాము మీ కలలోకి రావడాన్ని విశ్లేషించి చూద్దాం:
- సర్పం అనేది కుండలిని శక్తి కి సంకేతం, మీ స్వప్నం లోకి సర్పం వచ్చిందంటే, బహుశా మీ కుండలిని జాగృతమయ్యే అవకాశం వచ్చినట్టే..
- ఇక కలలో ఒక సర్పం మిమ్మల్ని కాటు వేసిందంటే అర్ధం, మీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్లు..
- నీటిలో కదలాడుతున్న సర్పం: స్వచ్ఛతకు ప్రతీక…
- ఇవన్నీ స్వప్న శాస్త్రంలో చెప్పబడిన శకునాలు..
- అయితే వాస్తవ జీవితంలో ఇవి ఎంతవరకూ నిజమవుతాయి అంటే చెప్పడం క్రోద్దిగా కష్టమే…
- కాకపోతే ప్రపంచంలో జరిగే /జరుగుతున్న ఎన్నో విషయాలు మానవ మేధాశక్తికో, సైన్సు కో అందాలని నిబంధన ఏమి లేదు..
ఇక సైకాలజీ ప్రకారం చెప్పాలి ఆంటే, పాము పదే పదే కలలోకి రావడం అంటూ జరుగుతుంటే మాత్రం మీరు వాటి గురించి భయంతో కూడిన ఆలోచనలు ఎక్కువగా చేయడం వల్ల కావొచ్చు…
ఆలోచించండి, పరిశోధించండి.. సమస్య మీ దగ్గర ఉందంటే, పరిష్కారం కూడా మీ దగ్గరే తప్పక ఉంటుంది..