Shiva with Dhanussu |
శివ ధనుస్సు | Shiva Dhanussu
హిందూ పురాణాల ప్రకారం శివ ధనుస్సు పరమశివుని దివ్యాయుధం. ఈ ధనుస్సుతోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు.
దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవరాతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు. దీనిని పినాకము అని అంటారు. సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు.
రాముడు శివధనస్సునెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది.