Natta Rameshwaram |
నత్తా రామేశ్వరం - Nattarameswaram
నత్తా రామేశ్వరం' పేరు వినగానే విచిత్రంగా అనిపిస్తుంది. నత్త పేరు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీ రామచంద్రుడు, 'నత్త గుల్లలు' కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరుకి 'నత్తా రామేశ్వరం' అనే పేరు వచ్చిందని పురాణ కధనం.
నత్తా రామేశ్వర ఆలయం |
శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 'రామావతారం, 'పరశురామావతారం' ఎంతో విశిష్టమైనవి. ఈ రెండు అవతారాలలో శ్రీమహా విష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం. అలాంటి గొప్పదనాన్ని పొందిన క్షేత్రం 'నత్తా రామేశ్వరం'. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఉంది.
శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణహత్య చేసాననే దిగులుతో పాపపరిహారనిమిత్తం ఎన్నోచోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు సీతాదేవి కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకొన్నాడు. దానికి మద్యాన్న సమయంలో గోస్తనీ నదిలో త్రికోటి తీర్ధములు వచ్చి చేరుతాయని తలచి అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని సీతాసమేతంగా ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు, సీతాదేవి కలిసి లింగాన్ని తయారు చేసాకా మిగిలిన ఇసుకముద్దని కూడా అక్కడే ఉంచేసారు. అలా నత్తలు, ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టచేసారని పురాణ కధనం. ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభి ముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
Natta Rameshwaram |
పూర్వం పరశురాముడు గోస్తనీ నదీ తీరమున 9000 సంవత్సరాలు ఏకాగ్రచిత్తముతో శ్రీ మహావిష్ణువుకై తపమాచరించారు.ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతనికి తనలో నాల్గవ అంశముగా ఉన్న సువర్ణ వైష్ణవ ధనువు నీయగా అతడు దానితో అనేకమంది రాక్షసులను, కార్తవీర్యార్జుని జయించి పెడమార్గాలతో జనులను బాధించే కొందరు రాజులను, దుర్మార్గములైన క్షత్రియులను కూడా సంహరించినాడు.
అటుపై ఆ హత్యల వలన ఏర్పడిన దోషాలను తొలగించుకొనుటకు కైలాసమునకు వెళ్ళి క్రౌంచ పర్వతమును భేదించి శివుని ఆనతితో పర్వతమునుండి ఒక లింగము తీసుకుని వచ్చి గోస్తనీతీరమున ప్రతిష్టించారు. సప్తమునులతో, బ్రహ్మర్షి, దేవర్షులతోడను, యాజ్ఞవల్క్యాది భూసురుల తోడను, ఆ లింగమునకు జలాదివాసం, ధాన్యాదివాసం, రత్నాదివాసం మొదలైన సంస్కారముల నాచరించి, అంతర్మాతృకా బహిర్మాతృకాదులచే ప్రాణప్రతిష్ట మొనర్చి స్థాపించినాడు.
అయితే పరశురాముని కోపాగ్ని వలన ఆ శివలింగం అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీ నది నీటితో నింపేసాడు.. స్వామి చల్లబడ్డాకా.. అయ్యోస్వామీ నీకు పూజలెలా అని బాధపడుతుంటే.. అప్పుడు స్వామి బాధపడకు పరశురామా.. నేను 11 నెలలు నీళ్ళతో ఉంటాను ఒక్క వైశాఖమాసం లో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు.
ఆ లింగమునకు సప్తకోటేశ్వర రామలింగమని నామధేయము కలిగెను. భార్గవనిర్మితంబనీ క్షేత్రమము పంచక్రోశపరిమితమైనది. పరుశురాముడా క్షేత్రమునకు సర్వపాపహరమైనదిగాను, స్వరర్ణతీర్థఫలద్రాయకమైనదిగాను వరమిచ్చెను.
Natta Rameshwaram |
Natta Rameshwaram |
Natta Rameshwaram |
అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. మునులు ... ఋషులు ... దేవతలు ... ఇలా మొత్తం ఏడు కోట్ల మంది సమక్షంలో ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని 'సప్త కోటీశ్వర లింగం' అని కూడా పిలుస్తుంటారు. శ్రీ రామేశ్వరస్వామివారి నత్తలతో కూడియున్న లింగం కావున శంభూక రామమేశ్వరమని కూడా పిలువబడుతున్నది.
ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే వుంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలు వున్నాయి. నత్తా రామలింగేశ్వరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సప్త కోటీశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి యేటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, కాలభైరవస్వామి, గోస్తనీ నది ఒడ్డున లక్ష్మణేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. రామేశ్వరస్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచింది. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా పదివేలమందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏటా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా గోస్తనీనదిలో ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం కేవలం వైశాఖమాసంలోనే భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది.
ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తేముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్సనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు. నత్తా రామలింగేశ్వాలాయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం కలదు. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రము 14 కి.మీ. దూరంలో వున్నది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ. అత్తిలి నుండి 6 కి.మీ. మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రమున్నది.
Natta Rameswaram Temple, Penumantra Mandal, West Godavari Dist.
Two main temples dedicated to Shiva are there in the same complex. One Linga installed by Shri Parasurama in the middle of Goasthani and the same was witnessed by Sapta Koti Rishies so the temple got the name of Saptakoteswara Linga temple. As the temple is in the Goastani water, piligrims can do abhishekam and puja during the telugu month of VAISAKHAM ( i.e in the middle of May/June )only. All the remaining months the Saptakoteswara Linga will be under the waters of Gostani. Another Linga is installed by Lord Rama. So the temple got the name Ramalingeswara Swamy. Here Linga made of shells and conches, so it is called as Natta Rameswaram. You can visit this temple through out the year. According to the Juttiga Inscriptions, this temple was reconstructed on the Orders of Khulli Padusha on 15th September 1583.
The temple complex is on the bank of Gosthani River. Thousands of devotees congregate here on Maha Shivaratri day to take a dip in the Gosthani River. Rathotsavam is also performed on Shivarathri Day. Nearest Railway station is Manchili. Number of trains to Manchili is very less. So piligrims reach TADEPALLIGUDEM by train and catch RTC BUS going to MARTERU OR NARSAPURAM and get down at Natta Rameswaram. Hire a Auto or Riksha to reach Natta Rameswaram Temple. Howver it is roughly same distance from Towns of Tanuku, Tadepalligudem, Bhimavaram.
Juttiga & Natta Rameswaram are twin Villages assumed religious importance on account of the temples of Swayambhulingam known as Sri Uma Vasuki Ravi Someswara Swamy at Juttiga Village and Natta Ramalingeswara Swamy at Natta Rameswaram Village. Every “SIVARATHRI” Festival day “Edurukolotsavam” is being celebrated at the border place of two villages. Thousands of Piligrims attend to that celebrations. It is one of the important piligrim centre in the District.
One who visit this temple will also visit the temple of Sri Uma Vasuki Ravi Someswara Swamy, Juttiga, just 2 KM away from Natta Rameswaram temple.