కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 13
యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బీషై |
భుంజతే తే త్వఘం పాపా యే పచ న్త్యాత్మకారణాత్ ॥
యజ్ఞశిష్ట - యజ్ఞాచరణ తరువాత తీసికొనే ఆహారం; ఆశినః - తినేవారై; సన్తః - భక్తులు; ముచ్యన్తే - విడివడతారు; సర్వ - అన్ని రకాలైన; కిల్బిషై: - పాపాల నుండి; భుంజతే - భోగించేవారు; తే - వారు; తు - కాని; అఘం - ఘోరమైన పాపాన్ని; పాపాః - పాపులు; యే - ఎవరైతే; పచన్తి - వండుతారో; ఆత్మకారణాత్ - ఇంద్రియభోగం కొరకు.
మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవదృక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసికొనే ఇతరులు కేవలము పాపమునే తింటారు.
భాష్యము : భగవదృక్తులు, అంటే కృష్ణభక్తిభావనలో ఉన్న మనుషులు... "సన్తులు" అని పిలువబడతారు. “ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సన్తః సదైవ హృదయేమ విలోకయన్తి” అని . బ్రహ్మసంహితలో (5.38). వర్ణించబడినట్లు వారు సర్వదా బ్రహ్మసంహితలో ఉంటారు. దేవదేవుడైన గోవిందునితో (సమస్త సుఖాలను ఇచ్చేవాడు) లేదా ముక్తుందునితో (ముక్తి నిచ్చేవాడు) లేదా శ్రీకృష్ణునితో (సర్వాకర్షకుడు) ప్రేమతో గట్టిగా ముడివడినవారె... ఆ సన్తులు పరమవురుషునికి మొట్టమొదట సమర్పించనిదే దేనినీ అంగీకరించరు. కనుక అటువంటి. భక్తులు శ్రవణం, కీర్తనం, . స్మరణం, అర్చనం మొదలైన వివిధ భక్తిమార్గాలలో సర్వదా యజ్ఞాలు చేస్తుంటారు. ఇటువంటి యజ్ఞనిర్వహణ వారిని. భౌతికజగత్తులోని నానారకాల పావసాంగత్య కల్మషాల నుండి సర్వదా దూరంగా ఉంచుతుంది. తమ కొరకు, అంటే ఇంద్రియభోగం కొరకు ఆహారాన్ని వండుకునే ఇతరులు కేవలము దొంగలే కాకుండ నానారకాలైన పాపాలను తినేవారు అవుతారు. మనిషి దొంగ, పాపి రెండు కూడ అయితే ఎట్లా సుఖిగా. అవుతాడు? అది అసాధ్యం. అందుకే అన్నివిధాలుగా జనులు సుఖభాగులు కావాలంటే పూర్తి కృష్ణభక్తిభావనలో సంకీర్తన యజ్ఞమనే నులభమైన విధానాన్ని వారు నిర్వహించడాన్ని నేర్వాలి. లేకపోతే ప్రపంచంలో శాంతి గాని, సుఖము గాని ఉండదు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -14
అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥
అన్నాత్ - ధాన్యము వలన; భవన్తి - పెరుగుతాయి; భూతాని - భౌతికదేహాలు; పర్జన్యాత్ - వర్షము వలన; అన్న - ధాన్యము; సమ్భవః - ఉత్పత్తి అవుతుంది; యజ్ఞాత్ - యజ్ఞాచరణము ద్వారా; భవతి - సాధ్యమౌతుంది; పర్జన్యః - వర్షము; యజ్ఞః - యజ్ఞావరణము; కర్మ - విధ్యుక్త కర్మల నుండి; సముద్భవః - పుడుతుంది.
దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి, ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురవగా, యజ్ఞము విధ్యుక్తకర్మము నుండి ఉద్భవిస్తుంది.
భాష్యము : భగవద్గీతకు... గొప్ప వ్యాఖ్యాతయైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ విధంగా వ్రాసారు : “యే ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విమ్ణమభ్యర్చ్యతచ్చేష మశ్నన్తి తేన తద్దేహేయాత్రాం సంపాదయన్తి, తే సన్తః సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్తాః సర్వకిల్బిషై అనాదికాలవివృద్ధైః ఆత్మానుభవ ప్రతిబన్దకై ర్నిఖిలైః పాపైర్విముచ్యన్తే”.
యజ్ఞపురుషునిగా అంటే సర్వయజ్ఞాలకు భోక్తగా _తెలియబడే భగవంతుడే దేవతలందరికీ ప్రభువు. వివిధ దేహాంగాలు పూర్తి దేహాన్ని సేవించినట్లుగా ఆ దేవతలందరు భగవంతుని సేవిస్తారు. ఇంద్రుడు, చంద్రుడు వరుణుడు వంటి దేవతలు లోకకలాపాలను నిర్వహించడానికి నియమించబడిన పాలకులు. ఈ దేవతల సంతృప్తి కొరకే వేదాలు యజ్ఞాలను ఉపదేశించాయి.. తద్ద్వారా వారు. ప్రసన్నులై ధాన్యోత్పత్తికి తగినంతగా గాలి, వెలుతురు, నీళ్ళు సరఫరా చేస్తారు.
శ్రీకృష్ణభగవానుని అర్చించినప్పుడు ఆతని వివిధ దేహాంగాలే అయినట్టి దేవతలు కూడ అప్రయత్నంగా పూజింపబడతారు. అందుకే దేవతలను వేరుగా పూజించవలసిన అవసరము లేదు. ఈ కారణంగానే భగవదృక్తులు, అంటే కృష్ణభక్తిభావనలో ఉన్నవారు శ్రీకృష్ణునికి ఆహారం నైవేద్యం పెట్టి తరువాత తింటారు. ఈ పద్ధతి దేహాన్ని ఆధ్యాత్మికంగా పోషిస్తుంది. అటువంటి కార్యం ద్వారా కేవలము దేహంలోని గత పాపాలన్నీ నశించిపోవడమే కాకుండ దేహము. సమస్త ప్రకృతి కల్మషాలకు అతీతమౌతుంది. అంటువ్యాధి ప్రబలినవుడు రోగనిరోధక బెషధము అటువంటి వ్యాధి నుండి మనిషిని కాపాడుతుంది. అదేవిధంగా విమ్ణుభగవానునికి నైవేద్యము. పెట్టి తీసికొనిన ఆహారము. మనలను భౌతికాసక్తి నుండి తగినంతగా. నిరోధిస్తుంది. ఇటువంటి అభ్యాసానికి అలవాటు. పడినవాడే భగవద్భక్తునిగా పిలువబడతాడు. అందుకే కేవలము కృష్ణార్పితమైన ఆహారాన్ని తినే కృష్ణభక్తిభావనాయుతుడు ఆత్మానుభూతిలో ప్రగతికి అవరోధాల వంటి సమస్త పూర్వ పాపాలను నశింపజేసికొంటాడు. ఇంకొక ప్రక్క ఆ రకంగా చేయనివాడు పాపరాశిని పెంచుకోవడం కొనసాగిస్తాడు. ఆ. పావఫలాలను అనుభవించడానికి ఇది తదుపరి జన్మలో శునక్క సూకర దేహాలను కలుగజేస్తుంది. భౌతికజగత్తు కలుషాలతో నిండినట్టిది. భగవత్రసాదము (విషువ్రసాదము) తినడం ద్వారా నిరోధకశక్తిని పొందినవాడు వాటి దాడి నుండి రక్షింపబడతాడు, కాగా ఆ రీతిగా చేయనివాడు కల్మషానికి గురౌతాడు.
ధాన్యము, . కూరగాయలే. నిజానికి తినదగినవి. మానవుడు... నానారకాల ధాన్యాలను, కూరగాయలను, పండ్లను తింటాడు. ఇక పశువులు ధాన్యపు వ్యర్థ శేషాన్ని, కూరగాయలను, గడ్డిని, మొక్కలను తింటాయి. మాంసము. తినడానికి అలవాటు పడిన మానవులు కూడ ఆ పశువులను తినడానికి వృక్షాల పైననే ఆధారపడవలసి వస్తుంది..కనుక చివరికి మనము భూమి ఉత్పాదనల మీదనే ఆధారపడాలి గాని పెద్ద కర్మాగారాల ఉత్పత్తిపై కాదు. వ్యవసాయోత్పత్తి ఆకాశము నుండి తగినంత వర్షము కురియడము ద్వారానే. కలుగుతుంది. అటువంటి. వర్షాలు ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతలచే నియంత్రించబడతాయి. వారందరు భగవంతుని సేవకులే. 'యజ్ఞాల ద్వారా భగవంతుని సంతృప్తిపరచవచ్చును. అందుకే వాటిని చేయలేనివాడు
కొరతకు లోనౌతాడు. ఇది ప్రకృతి నియమము, అందుకే కనీసము ఆహార కొరత నుండి మనలను రక్షించుకోవడానిక్టైనా యజ్ఞాన్ని, ముఖ్యంగా ఈ యుగానికి చెప్పబడిన సంకీర్తన యజ్ఞాన్ని తప్పక నిర్వహించాలి.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -15
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్జే ప్రతిష్ఠితం ॥
కర్మ = కర్మ; బ్రహ్మ - వేదాల నుండి; ఉద్భవం - పుట్టినదిగా; విద్ధి - నీవు తెలిసికో వలసింది; బ్రహ్మ - వేదాలు; అక్షర - పరబ్రహ్మము (దేవదేవుని) నుండి; సముద్భవమ్ - ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి; తస్మాత్ - అందుకే; సర్వగతం - సర్వవ్యాపకమైన; బ్రహ్మ - వరబ్రహ్మము; నిత్యం - నిత్యముగా; యజ్జే - యజ్ఞములో; ప్రతిష్ఠితం - ప్రతిష్ఠితుడు.
నియమిత కర్మలు, వేదాలలో చెప్పబడినాయి, అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు.
భాష్యము : యజ్ఞార్థకర్మ, అంటే కేవలము శ్రీకృష్ణుని. ప్రీత్యర్థమే కర్మ చేయవలసిన అవసరము ఈ శ్లోకంలో మరింత నొక్కి చెప్పబడింది. మనము యజ్ఞవురుషుని (విష్ణువు) ప్రీత్యర్థమే కర్మ చేయవలసి వస్తే ఆ కర్మకు సంబంధించిన పద్ధతిని బ్రహ్మములోనే, అంటే దివ్యమైన వేదాలలోనే కనుగొనాలి. అందుకే వేదాలు కర్మనిర్దేశక సూత్రాలు. వేదనిర్జేశము లేకుండ చేసేది. ఏదైనా వికర్మ అంటే అప్రమాణికమైనది, పాపకర్మ అనబడుతుంది. అందుకే కర్మఫలం కలుగకుండ ఉండడానికి మనిషి సర్వదా వేదాల నుండి మార్గదర్శనం పొందాలి. సామాన్య జీవితంలో మనిషి వ్రభుత్వ ఆదేశానుసారము పని...చేయవలసి ఉన్నట్లుగా . భగవంతుని పరమ రాజ్య - నిర్దేశంలోనే అతడు
పనిచేయవలసి ఉంటుంది. అటువంటి వేదనిర్దేశాలు సాక్షాత్తుగా భగవంతుని శ్వాస ద్వారా ప్రకటమయ్యాయి.
“అస్య మహతో భూతస్య నిశ్వసితమేతత్ యద్ బుగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వాంగిరసః” అని. చెప్పబడింది. అంటే. బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము,... అథర్వవేదము.. అనే నాలుగు వేదాలు దేవదేవుని శ్వాస నుండే బహిర్గతమయ్యాయి. (బృహదారణ్యకోపనిషద్ 4.5.11). సర్వశక్తిమంతుడైనందున భగవానుడు శ్వాస ద్వారా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే బ్రహ్మసంహితలో ధ్రువవరువబడినట్లు భగవంతుడు తన ప్రతీ ఇంద్రియము ద్వారా సర్వేంద్రియ కార్యాలను చేయగలిగిన సర్వశక్తిసంవన్నుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే భగవంతుడు తన శ్వాన ద్వారా మాట్లాడగలడు, తన కళ్ళ ద్వారా గర్భాదానము చేయగలడు.
నిజానికి ఆతడు ప్రకృతిపై దృష్టిని నిలిపి జీవులందరినీ సృష్టించాడని చెప్పబడింది. బద్ధజీవులందరినీ ప్రకృతి గర్భంలో సృష్టించిన తరువాత లేదా నిలిపిన తరువాత ఆతడు వారందరు భగవద్ధామానికి తిరిగి చేరుకునే విధంగా వేదజ్ఞాన నిర్దేశాలు ఇచ్చాడు. ప్రకృతిలో బద్ధజీవులందరు భౌతిక భోగాపేక్షతో ఉంటారని మనము సర్వదా గుర్తుంచుకోవాలి. అయినా జీవుడు తన వికృత కోరికలను తీర్చుకొని, ఆ నామమాత్ర భోగాన్ని పూర్తి చేసికొని ఆ తరువాత భగవద్ద్ధామానికి చేరుకునేటట్లుగా వేదనిర్దేశాలు తయారు చేయబడ్డాయి. ఇది బధద్ధజీవులు ముక్తిని పొందడానికి “ఓక అవకాశము వంటిది. అందుకే వారందరు. కృష్ణభక్తిభావనాయుతులై యజ్ఞపద్ధతిని తప్పకుండ వేదాదేశాలను పాటించనివారు కూడ కృష్ణభక్తిభావన సిద్ధాంతాలను స్వీకరించవచ్చును. అది వైదిక యజ్ఞాచరణము లేదా వైదిక కర్మాచరణమే అవుతుంది.
కర్మయోగము - Karma Yogam - శ్లోకము -16
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్ధ స జీవతి ॥
ఏవం - ఈ విధంగా; ప్రవర్తితం - వేదాలచే నిర్ణయించబడిన; చక్రం - చక్రమును; న అనువర్తయతి - అనుసరించనివాడు; ఇహ - ఈ జన్మలో; యః - ఎవ్వడు; అఘాయుః - పావజీవనుడు; ఇంద్రియ ఆరామః - ఇంద్రియభోగంలో తృప్తి చెందుతూ; మోఘం - వ్యర్థంగా; పార్థ - ఓ వృథా తనయా (అర్జున); సః - అతడు; జీవతి - జీవిస్తాడు.
అర్జునా! ఈ. విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞవక్రమును జీవితంలో అనుసరించనివాడు. నిక్కముగా పాసమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు.
భాష్యము: “కష్టించి పనిచేసి ఇంద్రియభోగాన్ని అనుభవించు” వంటి ధనమే సర్వస్వమనే తత్త్వము ఇక్కడ భగవానునిచే నిరసించబడింది. కనుక ఈ భౌతికజగత్తును భోగించాలని కోరుకునేవారికి పైన తెలుపబడిన యజ్ఞచక్రము అత్యంత అవసరము. అటువంటి నియమాలను పాటించనివాడు మరింతగా నిరసించబడి ప్రమాదకరమైన జీవితాన్ని గడువుతాడు. ప్రకృతి నియమాన్ని అనుసరించి ఈ మానవజన్మ కర్మ యోగము, జ్ఞానయోగము లేదా భక్తియోగము అనే మూడింటిలో ఏదో ఒకదాని ద్వారా ఆత్మానుభూతికే ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. మంచిచెడులకు అతీతులైనట్టి మహాత్ములకు విధ్యుక్ష యజ్ఞనిర్వహణ కచ్చితంగా చేయవలసిన అవసరము లేకపోయినా ఇంద్రియభోగంలో నెలకొన్నవారికి పైన చెప్పబడిన 'యజ్ఞవక్రనిర్వహణ ద్వారా పవిత్రీకరణ అవసరమౌతుంది.
కర్మలు అనేక రకాలుగా ఉన్నాయి. కృష్ణభక్తిభావనా యుతులు. కానివారు. నిక్మముగా ఇంద్రియభోగభావనలో ఉంటారు. అందుకే వారు పుణ్యకర్మలు చేయవలసిన అవసరము ఉంటుంది. భోగభావన కలిగినవారు ఇంద్రియభోగకర్మఫలంలో చిక్కుబడకుండ తమ కోరికలను తీర్చుకునే విధంగా యజ్ఞవిధానము ఏర్పాటు చేయబడింది. ప్రవంచ పురోభివృద్ధి మన ప్రయత్నాల మీద కాకుండ భగవంతుని ఏర్పాటు మీద ఆధారవడి ఉంటుంది. అది దేవతలచే ప్రత్యక్షంగా నిర్వహింవబడుతుంది. అందుకే వేదాలలో పేర్కొనబడిన ప్రత్యేక దేవతలకు నేరుగా యజ్ఞాలు చెప్పబడినాయి. పరోక్షంగా ఇదే కృష్ణభక్తిభావనలో అభ్యాసము. ఎందుకంటే మనిషి యజ్ఞనిర్వహణలో ప్రవీణుడైనవుడు తప్పకుండ కృష్ణభక్తిభావనాయుతుడు అవుతాడు. కాని యజ్ఞనిర్వహణ ద్వారా అతడు కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు కాకపోతే ఆ నియమాలన్నీ కేవలము నీతిసూత్రాలుగా భావించబడతాయి. అందుకే మనిషి తన పురోగతిని కేవలము నీతిసూత్రాల స్థితి వరకే పరిమితము చేసికోకుండ, వాటిని దాటి కృష్ణభక్తిభావనను పొందాలి.