IRCTC Ganga Ramayan Yatra |
వివరాల్లోకి వెళ్తే...
గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ యాత్రలో భాగంగా కాశి, సారనాధ్, ప్రయాగ్ రాజ్, నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లు సాగనున్న ఈ గంగా రామాయణ్ యాత్ర వివరాల గురించి తెలుసుకుందాం..
వేసవి వినోదంగా భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాలని ఆలోచిస్తున్న వారికీ ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలను దర్శించేందుకు వీలుగా ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తాజాగా గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ యాత్రలో భాగంగా కాశి, సారనాధ్, ప్రయాగ్ రాజ్, నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లు సాగనున్న ఈ గంగా రామాయణ్ యాత్ర వివరాల గురించి తెలుసుకుందాం.. 2023 మే 25న, తిరిగి జూన్ 7న గంగా రామాయణ్ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే మే నెలకు సంబంధించిన టికెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీన పర్యటన కోసం వెళ్లాలనుకునేవారి కోసం వివరాలు మీ కోసం..
ఈ యాత్ర ప్యాకేజీలో భాగంగా మొదట హైదరాబాద్ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో చివరి రోజున లఖ్‌నవూ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోవడంతో సంపూర్ణమవుతుంది.
యాత్ర షెడ్యూల్..
- Day-1: ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి.. వారణాసికి చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు చేరుకొని ప్రెష్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం.. కాశీ విశ్వనాథుడి దర్శనానికి తీసుకునివెళ్లారు. అనంతరం గంగా ఘాట్ ను దర్శించుకునేందుకు తీసుకుని వెళ్లారు. ఈ విశ్వనాథుడి, ఘాట్ దర్శనం కోసం అయ్యే ఖర్చుని యాత్రికులే భరించాల్సి ఉంటుంది. రాత్రి కాశీలోని బస చేయాల్సి ఉంటుంది.
- Day-2: రెండో రోజు ఉదయం కాశీలో టిఫిన్ తీసుకుని అనంతరం సారనాథ్ కు వెళ్లి.. అక్కడ శివయ్య దర్శనం అనంతరం.. మధ్యాహ్నం వారణాశికి చేరుకుంటారు. కాశీలో రెండవ రోజు బిర్లా టెంపుల్, ఘాట్స్ దర్శనం, షాపింగ్ చూసుకోవచ్చు. రాత్రి వారణాసిలో బస చేయాల్సింది ఉంటుంది.
- Day-3: మూడో రోజు ఉదయం కాశి నుంచి వెకేట్ చేసి.. ప్రయాగ్ రాజ్ చేరుకొని త్రివేణి సంగమం, అలోపీ దేవీ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అయోధ్యలో బస చేయాల్సి ఉంటుంది.
- Day-4: నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత అయోధ్యలోని రామాలయాన్ని సరయు నదిని సందర్శించవచ్చు. మధ్యాహ్నం అయోధ్య నుంచి లఖ్‌నవూ చేరుకొని రాత్రి అక్కడే హోటల్లోబస చేయాల్సి ఉంటుంది.
- Day-5: ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్లో టిఫిన్ తిన్న తర్వాత నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా నైమిశరణ్యంలో గడిపి సాయంత్రానికి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి లఖ్‌నవూలోనే బస చేయాల్సి ఉంటుంది.
- Day-6: ఆరో రోజు ఉదయం టిఫిన్ ముగించుకొని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం హోటల్ చేరుకొని.. సాయంత్రం 4 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో గంగా రామాయణ్ యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు హైదరాబాద్ నుంచి వారణాసి, లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు ప్లైట్ టికెట్స్ తో పాటు.. వారణాసి, అయోధ్య, లఖ్నావూ లో హోటల్ లో బస, టిఫిన్, ఐదు రోజులు రాత్రి భోజనం, ఒక రోజు మధ్యాహ్నం భోజన సదుపాయాలను కల్పిస్తోంది. అంతేకాదు భీమా సౌకర్యం కూడా ఉంది. అయితే పర్యటక ప్రాంతాల్లో ఇతర సందర్శనీయ ప్రదేశాలు, ఆలయ దర్శనం టికెట్స్ ధరలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.
- ప్యాకేజీ ధరలు: సింగిల్ ఆక్యుపెన్సీ – రూ.36,850
- డబుల్ ఆక్యుపెన్సీ – ఒకొక్కరికి రూ.29,900
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ- ఒకొక్కరికి రూ.28,200
- 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు – రూ.24,600 (బెడ్ సదుపాయం కల్పిస్తారు)’
- 2 నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారులకు- రూ.18,300 చెల్లించాల్సి ఉంటుంది.
టికెట్ రద్దు చేసుకోవాలంటే..
ఈ టూర్ మొదలు కావడానికి 7 రోజుల ముందు వరకు మాత్రమే టికెట్ రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు నిర్దేశిత మొత్తాన్ని రీఫండ్ కింద చెల్లిస్తారు.