Kanipakam |
ఐరాల మండలం , కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.