తల్లిదండ్రుల గొప్పదనం | The Best Thing Parents
తల్లిదండ్రుల గొప్పదనం
ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.