Aghoras |
అఘోరాలు, మాంస భక్షం
అఘోరాల గురించి తెలియని నిజాలు ఏమిటి? వారు నిజంగా మానవ మాంసాన్ని తింటారా? అఘోరాలు మరియు నాగసాధుల మధ్య తేడా ఏమిటి? టీవీ ప్రవచనాలలో వీటి గురించి చెప్పరు.
కేచరీ ముద్ర |
కేచరీ ముద్ర - నాలుకతో క్రింద చూపించిన విధం గా సాధన చేస్తారు…యోగ, తాంత్రిక etc సంప్రదాయాలలో. అది తేలిక కాదు… ఒక్కో విధానం ఒక్కో అనువర్తనం మరియు పద్ధతి ఉంటాయి.
కొన్ని వర్గాల వారు సౌమ్యంగా ఈ ప్రయత్నం చేస్తే. ఇంకొందరు నాలుక క్రింద దానిని పట్టి ఉంచే సన్నని తోలు ని వెంట్రుక వాసి పదునైన కత్తి తో కోసి అది స్వస్థపరచు అయిన తరువాత మళ్ళీ కోసి…మొత్తం తెగేదాక పునరావృతం చేస్తారు. ఇలా సాధన చేస్తూ వెళ్లే తీవ్రమైన పద్ధతులు వారిలో ఉన్నాయి.
అసలు ఎందుకు ఈ ముద్ర? అది వేరే విషయం, మనం వారి పద్ధతులతో ఏకీభవిస్తామా లేదా అన్నది అప్రస్తుతం.
అఘోరాలు ప్రధానంగా రెండు సంప్రదాయాలకి చెందుతారు
- భైరవుడిని ఆరాధించేవారు
- దత్త సంప్రదాయం వారు
నాలుక రుచులు కోరుకోకూడదు అని ఏదైనా తిని బ్రతకడం అలవాటు చేసుకోవడం లో భాగంగా శవం మాంసం తినడం అలవాటు చేసుకుంటారు కానీ రోజూ అదే తినరు.
కళ్ళు మంచి దృశ్యం చూడాలన్న తపనని, చెవులు పొగడ్తలు వినాలన్న కాంక్షని, చర్మం, ముక్కు చక్కని స్పర్శ, పరిమళం కోరుకోవడాన్ని నియంత్రించి ఇంద్రియ నిగ్రహం చేయాలి అన్న ప్రయత్నం లో భాగంగా సమాజానికి మింగుడు పడని మార్గాన్ని ఎంచుకుంటారు.
గమనిక : ఈ మార్గం మిగతావాటి కన్నా గొప్పది లేదా తక్కువ అని భావించకూడదు. అన్నీ సమానమే, సాధకుడి స్వభావం, అభిరుచి బట్టీ మార్గం. అన్ని రకాల స్వభావాల వారూ తరించడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
.....పవన్