ఆది శంకరాచార్యులు |
దేవుడు ఒకడే అని తన అద్వైత తత్వశాస్త్రం చెప్పినప్పటికీ ఆది శంకరాచార్యులు వివిధ దేవతల గురించి శ్లోకాలు ఎందుకు రాశారు?
Raghu M
శంకరాచార్యులువారు సాక్షాత్తూ శివుడే అని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువయిఉన్న దుర్గమ్మతల్లి ఉగ్ర రూపాన్ని శాంతపరిచి భక్తులను అనుగ్రహించేలా చేయగల మహాకార్యం చేయగల సామర్ధ్యం ఆ శివుడికి తప్ప ఇంకెవరికి ఉంటుంది. హిందూధర్మం నమ్మి ఆచరించేవాళ్లకు జ్యోతిష్యం గ్రహగతులు దశలు అంతర్దశలు గ్రహాల ఉచ్ఛ నీఛ స్థానాల ప్రభావంవలన పడే కష్టాలు ఇబ్బందులు ఒక్కొక్క గ్రహముకు శాంతులు చేయడంవలన జీవనగమనములో అనుకూలమార్పులు సంభవించి ప్రశాంతత చేకూరడం మనలో చాలామందికి అనుభవం ఉంటుంది. నాకు కూడా అలాంటి వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి.
భగవంతుడు తాను నిర్వహించవలసిన వివిధ లోకోద్ధరణ కార్యక్రమాలకోసం ఎన్నో రూపాలలో అవతరించాడు అనే సిద్ధాంతాన్ని నేను కూడా నమ్ముతాను. అయితే ఎంతో అంగబలం అర్ధబలం ఉంటేగాని యజ్ఞాలు యాగాలు చేయలేని జనసామాన్యోద్ధరణకై శ్రీ శంకరాచార్యులు వారు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని మెప్పించడానికి ఉపయోగపడే ఒక్కొక్క స్తోత్రాన్ని రచించారు వేటికవే అత్యంత శక్తివంతమైనవి. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మందు లేదా వివిధ ఔషధాల కాంబినేషన్ తో ఉపయోగించినట్లు వ్యాధినివారణ చేసుకొన్నట్లుగా మనం కూడా సమస్యలు ముదిరి చేయిదాటకముందే కొన్ని రెమిడీలు కొన్ని స్తొత్ర పారాయణలతో మానవప్రయత్నం కూడా కొనసాగించడం జీవితంలో సుఖశాంతులు కలిగిస్తుందని అదే ఈ యుగన్యాయం మనధర్మం అని నేను విశ్వసిస్తున్నాను.