Shraddha Karma |
శ్రాద్ధం ఎవరు చేయాలి ?
శ్రాద్ధం చేయడానికి అధికారం కన్న కొడుక్కి ఉంటుంది .కొడుకు లేని పక్షంలో పుత్రిక కొడుకుకి ఆ అధికారం ఉంటుంది. ఒకవేళ అతడు లేకపోతే అదే గోత్రానికి సంబంధించిన వారెవరైనా ఈ విధి చేయవచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది కుమారులు ఉంటే అందరూ ఒకచోట చేరి పెద్ద కుమారుడు ద్వారా శ్రాద్ధ కర్మ చేయటం ఉత్తమం.
"శ్రద్ధా నికి పిత్రు- పితామహ- ప్రపితామ" అంటే తండ్రి ఆ తండ్రి తండ్రి తాత ను ఈ ముగ్గురిని గోత్రనామాలతో స్వీకరించాలి అలాగే తల్లి ఆమె తండ్రిని ఆమె తాత ఈ ముగ్గురిని స్వీకరించాలి వారి పేర్లతో తిల తర్పణాలు వదిలి పిండ ప్రధానం చేయాలి తగిన దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి ఇది మహాలయ శ్రాద్ధం చేసే విధి.
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం జన్మించిన ప్రతి మనిషికి 3 రుణాలు ఉంటాయి. ఒకటి దేవఋణం రెండు ఋషి రుణం మూడో పితృఋణం దేవతలను పూజించి జలంతో తర్పణాలు వదలడం వలన దేవ రుణం తీరుతుంది
ఋషి రుణం ఋషీశ్వర్లను పూజించడం వలన తీరుతుంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి. శాస్త్రం నిర్దేశించిన ప్రకారం వారు ఏ నెలలో ఏ తిథి నాడు మరణించా రో ఆ రోజున వారి పేరుతో శార్ధ కర్మ జరపాలి.మహాలయ పక్షంలోని 15 రోజుల్లో వచ్చే పితరుల తిథి రోజున వారి పేరుతో తర్పణం చేసి శార్ధం జరపాలి పితృ పక్షం లో పెద్దలను స్మరిస్తూ శ్రాద్ధం తప్పనిసరిగా నిర్వర్తించాలి.
ఈ విధంగా శ్రాద్ధకర్మలు నిర్వర్తించటం వలన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పితృ దోష నివారణ జరుగుతుంది. పితృదేవతల ఆశీర్వాదం అత్యంత శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ పితృ కర్మలను తప్పకుండా నిర్వర్తించాలి.