వీరశైవులు - సూతకములు
లింగాదారీ సదా శుచీ అని శాస్త్ర వచనం - అందువలననే వీరశైవులు సూతకాదులు పాటించరు, వాటికి సంబంధించిన వివరములు.
దేవార్చనాదికం కర్మ కార్యం దీక్షాన్వితైస్సదా !
నాస్తిఅశౌచం యథాస్థేషాం సూతకం చేతి నిశ్చితమ్ !!
శివ దేవార్చనం యస్య యస్య చాగ్ని పరిగ్రహః !
బ్రహ్మచారి యతీనాం చ శరీరే నాస్తి సూతకం !! (సౌర పురాణం అధ్యాయ్: 5 శ్లోకం:25, 26)
న తస్య సూతకం వత్స ప్రాణలింగాంగ సంగినః !
జననోత్తం మృతోత్తం చ విద్యతే పరమార్థతః !! (శంకర సంహిత, అధ్యాయ్:83)
ప్రారబ్ధ ధీర్ఘ తపసాం నారీణాం యత్రాజో భవేత్ !
నతేన తత్వ్రతం తాసాముపహన్యేత కర్హిచిత్ !! (అంగీరస స్మృతి-24)
పౌండరీకే యథా నారీ సూతకీ వా రాజసవాలా !
రవిరాగ్నియథా వాయుః కోటి కోటి గుణా శుచీః !!
లింగార్చన తథా యాశ్చ ఋతౌ నార్యా న సూతకం
తథా ప్రసూతికాయశ్చ సూతకం నైవ విద్యతే !! (సిద్ధాంత శిఖామణి: పరిచ్ఛేద: 9)
Devaarchanaadikam Karma Kaaryam DeekshaanvithaiSsadaa !
NaasthyAshoucham Yathastheshaam Soothakam Chethi Nishchitham !!
Shiva Devaarchanam Yasya Yasya Chaagni Parigrah !
Brahmachaari Yatheenaam Cha Shareere Naasthi Soothakam !! (Soura Puranam Adhyay: 5 Shloka:25, 26)
Na Thasya Soothakam Vatsa Praanalingaanga Sanginah !
Jananottham MruthotthamCha Vidyathe Paramaarthathah !! (Shankara Samhitha, Adhyay:83)
Praarabdha Dheergha Thapasaam Naareenaam YathRajo Bhaveth !
NaThena ThathVratham Thaasaamupahanyetha Karhichith !! (Angeerasa Smruthi-24)
Poundareeke Yathaa Naree Soothakee Va Rajsavalaa !
Raviragniyathaa Vaayuh Koti Koti Gunaa Shucheeh !!
Lingaarchana Tathaa Yaashcha Ruthou Naaryaa Na Soothakam
Thathaa Prasoothikaayashcha Soothakam Naiva Vidhyathe !! (Siddhantha Shikhaamani: Pariccheda: 9)
నిత్యమూ లింగము అంగమున ధరించి అర్చించు వీరశైవునికి జనన మరణాది సూతకములు ఉండవు. అంతే గాక ఎల్లపుడూ లింగాదారణ చేసే స్త్రీలకు రాజస్వలాది మైలదోషములు ఉండవు.
లింగాదారణ చేత వీరశైవులు అగ్నివలే పవిత్రులై ఉందురు. కావున ప్రతినిత్యము స్నానము చేసి శుచియై లింగ పూజ చేయవలెను అని శాస్త్రములు చెప్పు చున్నవి.
వీరశైవులు పిండారాధన చేయరాదు:
లింగాంగ సంగినీ మృతే సాపింద్యం నవిధేయతే !
శివలింగాంగ యోగేన శివభావయుజః పితుః !! (చంద్రజ్ఞాననాగమం, పాతాళము-4, శ-42)
Lingaanga Sanginee Mruthe Saapindyam NaVidheyathe !
Shivalingaanga Yogena Shivabhaavayujah Pituh !! (Chandrajnaanaagamam, Patalamu-4, Sh-42)
లింగాంగ సంబందమున వీరశైవుడు శివభావమును పొంది యున్నాడు, మృతి నొందిన లింగధారికి ప్రేతత్వమనేది ఉండదు. అందువలన వీరశైవులు పిండ ప్రదానాదులు చేయరు. చనిపోయిన వారిని లింగైక్యులనే అంటారు, వారి సమాధులపైన ఉంచబడే లింగము-నందికీ కూడా లింగమునర్చించిన మాదిరే అర్చిస్తారు.