సూర్యభగవానుడు |
ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.
అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు. నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో నానుడి అయింది - అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా?
ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది.
- ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం.
- ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము.
- చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు.
- భారతీయులు యొక్క మేధస్సుకు,శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు.
- ఇపుడు ఆదివారం అంటే సెలవు దినం. మందు మాంసాల దినం అయింది కానీ, అంతకు ముందు మనకు అదో పవిత్రమైన సుదినం.
- అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు.
- విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, అష్టమి, చతుర్దశి, పూర్ణిమ- అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు.
- మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ.
- కనుక, పాడ్యమినాడు అయితే చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు.
- చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు.
- ఆదివారం నాడు విధిగా సూర్య ఉపాసన చేసేవారు.
మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది. అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు.
ఆదివారంనాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మన వేదాలలోనే కాదు. సూర్యాష్టకంలో కూడా ఉంది.
"స్త్రీ తైల మధు మాంసాని యేత్యజన్తి రవేర్ధినే|
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి||"
మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి శక్తీ సరిపోదు.