శృంగేరి శారదాపీఠం రాజగోపురం. |
మొదట శృంగేరి అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం:
- ఋష్యశృంగ + గిరి -> శృంగ + గిరి -> శృంగేరి.
ఋష్యశృంగ ఒక మహర్షి. వారు ఎవరో తెలుసా? రామాయణంలో దశరథ మహారాజు ఆస్థానంలో పుత్రకామేష్టి యజ్ఞం చేసినవారు. దీని మూలంగానే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.
ఋష్యశృంగుడు ఇక్కడే ఉండేవారు, అందుకే స్థల పేరు శృంగేరి..ఇక్కడ సుప్రసిద్ధమైన ఆలయం అంటే శారదా పీఠం. దాని గురించి చూద్దాం. శృంగేరిలో ఈ శారదా పీఠాన్ని ఆది శంకరాచార్యులు స్థాపించారు. వారు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి భారతదేశంలో నాలుగు దిశలలో నాలుగు మఠాలను స్థాపించాలనుకున్నారు.
Sarada Peetham |
ఒకసారి శంకరాచార్యులు తుంగా నది ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా, ఒక పాము తన పడగ ద్వారా గర్భిణీ కప్పను సూర్యుడి కిరణాల నుండి రక్షించడం చూశారు. ఒక సహజమైన శత్రువులు అయినప్పటికీ కప్పకు సహాయం చేసే పామును చూసి శంకరాచార్యులు, ఇది విశేషమైన ప్రదేశమని ఆయన ధృవీకరించారు.
అందువల్ల అతను ఇక్కడ మొదటి మఠం స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. వారు శారదా పీఠాన్ని ఇక్కడే స్థాపించారు. ఈ మఠం ఇప్పుడు దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం అని ప్రసిద్ధి పొందింది. తుంగ నది తీరంలో ఈ మఠం ఉంది.
శ్రీ శారదా ఆలయం. |
శ్రీ శారదా దేవి. |
ఇదే తుంగ నది. చేపలు ఇలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి ఈ నదిలో. |
కన్నడలో ఒక మాటు ఉంది 'గంగ స్నాన తుంగ పాన' అని. తుంగ నది నీళ్లు అంత మంచిది. అంటే గంగలో ఒక సారి స్నానం చేయాలి మరియు ఒక సారి తుంగ నీళ్లు తాగాలి.
విద్యాశంకర దేవాలయం గురించి చూద్దాం.
శ్రీ విద్యాశంకర దేవాలయం |
విద్యాశంకర |
విద్యాశంకర ఆలయం క్రీ.శ 1338 లో నిర్మించబడింది. ఇది పూర్తిగా ఒకే రాతితో నిర్మించిన ఒక ప్రత్యేకమైన ఆలయం, ఇది హొయసల మరియు ద్రావిడ నిర్మాణ శైలుల సమ్మేళనం.
పడమటి వైపు గర్భగృహం ఉంది, ఒక వైపు విద్యా గణపతి, మరోవైపు దుర్గ దేవి ఉన్నాయి. గర్భగృహం యొక్క ఇతర మూడు వైపులలో బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు చిన్న గర్భగృహాలు ఉన్నాయి. తూర్పు వైపులో పన్నెండు స్తంభాలతో ఒక మంటపం ఉంది. ఈ పన్నెండు స్తంభాలు రాశిచక్రం యొక్క పన్నెండు సంకేతాలను వాటి క్రమంలో చూపిస్తాయి.
శ్రీ విద్యాశంకర దేవాలయం మరియు శ్రీ శారదా ఆలయం పక్క పక్కనే ఉంటాయి. తుంగా నది కూడా దగ్గరగా ఉంటుంది.
శృంగేరి పక్షి నోట |
ఆలయం మరియు గురు నివాసాన్ని కలిపే వంతెన ఒకటి ఉంది. నదికి అవతలి వైపు మనకు గురు నివాసం ఉంది.
సంస్కృత తరగతులు, గురుకుల, వేద తరగతులు అక్కడ జరుగుతాయి. |
భారత దేశంలో శృంగేరి మఠంలో మాత్రమే అవిచ్ఛిన్న గురుపరంపర ఉంది. వేరే ఎక్కడ కూడా లేదు.
శృంగేరి మఠం గురువుల పేర్లు:
- ఆది శంకరాచార్యులు ( - 820)
- సురేశ్వరాచార్యులు (820-834)
- నిత్యభోధఘన (834-848)
- జ్ఞానఘన (848-910)
- జ్ఞానోత్తమ (910-954 )
- జ్ఞానగిరి (954-1038)
- సింహగిరి (1038-1098 )
- ఈశ్వర తీర్థ (1098-1146)
- నృసింహ తీర్థ (1146-1229 )
- విద్యాశంకర తీర్థ (1229-1333)
- భారతీకృష్ణ తీర్థ (1333-1380)
- విద్యారణ్య (1380-1386 )
- చంద్రశేఖర భారతి I (1386-1389 )
- నృసింహ భారతి I (1389-1408 )
- పురుషోత్తమ భారతి I (1408-1448 )
- శంకర భారతి (1448-1455 )
- చంద్రశేఖర భారతి II (1455-1464 )
- నృసింహ భారతి II (1464-1479 )
- పురుషోత్తమ భారతి II (1479-1517 )
- రామచంద్ర భారతి (1517-1560 )
- నృసింహ భారతి III (1560-1573 )
- నృసింహ భారతి IV (1573-1576 )
- నృసింహ భారతి V (1576-1600 )
- అభినవ నృసింహ భారతి (1600-1623 )
- సచ్చిదానంద భారతి I (1623-1663 )
- నృసింహ భారతి VI (1663-1706 )
- సచ్చిదానంద భారతి II (1706-1741 )
- అభినవ సచ్చిదానంద భారతి I (1741-1767)
- నృసింహ భారతి VII (1767-1770 )
- సచ్చిదానంద భారతి III (1770-1814)
- అభినవ సచ్చిదానంద భారతి II (1814-1817 )
- నృసింహ భారతి VIII (1817-1879 )
- సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి (1879-1912 )
- చంద్రశేఖర భారతి III (1912-1954 )
- అభినవ విద్యాతీర్థ (1954-1989 )
- భారతీ తీర్థ (1989-ప్రస్తుతం)
- విధుశేఖర(2015-ప్రస్తుతం)
__Goutham R