Vijayawada Pallaketha Raja Shila Shaasanam ("Sripathi Pandithaaraadhya Agnisthambana") |
Srikara Bhashyam
శ్రీకరభాష్యం
బ్రహ్మ సూత్రాలు వీటినే వేదాంత సూత్రాలూ అని అంటారు, వీటిని బాదారాయణుడు చెప్పాడు. బ్రహ్మ సూత్రాలకు భాష్యమును వ్రాసినపుడు ఆయా సిద్దాంతముల వారు వారి వారి సిద్దాంత పరంగా భాష్యము రాసారు.
About Srikara Bhashya
శ్రీపతి పండితాచార్యుడు బ్రహ్మ సూత్రములకు భాష్యము నిర్మించి సంస్కృతమున రచించిన "శ్రీకరభాష్యం" సర్వ శృతి సమన్వయమై వీరశైవ విశేష్టాద్వైత సిద్దాంతాన్ని(శక్తి విశిష్టాద్వైత సిద్దంతము) సిద్ద పరచు చున్నది. దీనిని శక్తి విశిష్టాద్వైత, ద్వైతాద్వైత, శివాద్వైత, విశేష విశిష్టాద్వైత మని కూడా అంటారు. ఈ గ్రంధమున సిద్దాంత శిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోనుటయూ కలదు.
Sripathi Panditaachaarya
పురాతనుల అందరి మాదిరిగానే శ్రీపతి పండితాచార్యుని జనన కాలం కూడా భిన్నంగా వినిపిస్తున్నాయి. క్రీ.శ. 960 ప్రాంతమునకు చెందినవాడు అంటే కొందరు క్రీ.శ.1060 అని మరికొందరు క్రీ.శ.1072 కి చెందినవాడు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నందు గల విజయవాడ అతని స్వస్థలం. ఇతను అనంత భూపాలుని సభలో శివభక్తులకు సమానమగు వారు లేరని తెలిపి అగ్నిని ఒక పట్టువస్త్రములో మూట కట్టి, పరవాదులకు యాగాదులకు అగ్ని లభించకుండా చేసినట్లు (అగ్నిస్థంబన) చేసినట్టు విజయవాడ మల్లేశ్వరాలయములో ఒక శిలాశాసనము లభించినది. అంతే గాక ఈ అగ్నిస్థంబన విషయమును మల్లికార్జున పండితుడు తన శివతత్వసారము లోనూ, పాల్కురికి సోమనాథుడు తను రచించిన బసవపురణము లోనూ ప్రస్తుతించారు.
What is in Srikara Bhashya
(పూజ్య పండిత శ్రీ చిదిరేమఠం వీరభాద్రశర్మ గారి విభూతి - చతుస్సూత్రి/శ్రీకర భాష్యం నుండి యథాతథంగా)