Sri Rama |
శ్రీ రామదూతం - శిరసానమామి
ఆంజనేయ మతి పాటలాన నం కాంచ నాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నన్దనమ్
యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్త కాంజలిమ్
బాష్పవారి పరి పూర్ణ లోచనం మారుతిం నమత రాక్ష సాన్త కమ్
మనోజవం మారుత తుల్య వేగం జితేన్ద్రి యం బుద్దమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీ రామదుతం శిరసానమామి
మకుట రత్నకాంతి - మధి తత మిస్రం శ్రీరామదూతం శిరసానమామి
( ప్రతీ సగం లైనకు శ్రీరామదూతం శిరసానమామి అని చదవాలి )
అరుణోదయ రుచిరానన కమలం - స్వర్ణ పింగళ భాస్వర నేత్ర యుగళం
చరిత మకర కుండల గండ భాగం - నవమణి మయ రసనా మధ్యభాగం
తరుణరుచిర శుభ తరవర హారం - సమలం కృత దివ్య స్వర్ణో పవీతం
కటి తట విలసిత కాంచన చేలం - మంజుమంజీర - మహిత పదాబ్జం
దిన మణి శత నిభ దివ్య ప్రకాశం - సకల సద్గుణబృంద సార పయోధిం
దాసము ఖామ్భో జద శశత భానుం - వాల్మీకి కృత కావ్య వర సరో హంసం
శ్రిత జనకు వలయ శీత మయూఖం - రామలావణ్యాభ్ర రాగ మయూరం
రామ చంద్ర పద రాజీవ మధుపం - తరుణాయతదో స్తంభ గంభీరం
సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం - సుగ్రీవ వేదిత శ్రీరామ వృత్తాన్తం
అగ్నిసాక్షీ కృత అర్కజరామం - సీతాభూషణ సమర్పితరామం
శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం - వానివ ధోపాయ వరమృదువాక్యం
సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం - వానర సేనా సమాహూత ధీరం
సకలదేశాగత శాఖామృగాళి - రామచన్ధ్ర దత్త రమణీయ భూషం
స్వయంప్రభాదత్త సుఫలాతిభోజ్యం - లంకాగమన సమలంకృత దేహం
సాగరోల్లంఘన సంపూర్ణ కాయం - అబ్ది మధ్యమిత అగ పతి పూజ్యం
సురసమాయాధ్వాన్త సూర్య ప్రకాశం - ఛాయాగ్ర హిచ్చే దశమన స్వరూపం
దివ్య ద్వేగ కృత గోష్పాద జలధం - సువేలా శిఖరాగ్ర శమితాభి గమనం
లంకిణీ భంజన లావణ్యసారం - లంకా వరోధ నిశ్శoకిత హృదయం
సీతాన్వేషణ సురశత్రుసదనం - వాయు ప్రేరిత వరవన గమనం
సీతాదర్శన చింతాపహరణం - రావణ దుర్వాక్య ఆక్షీణ కోపం
సీతానివేదిత శ్రీరామకుశలం - రాఘవీ యక ధారంజిత రామం
రామాంగుళీ యక రామనివేద్యం - వసు ధాత్మ జాద్త వర శిరో భూషం
అతిశ యబల దర్వ అశోక భంగం - దనుజనిన హవనద హన దావాగ్నిం
వజ్రాయుధ ఘోర వాలక రాళ - సప్త మన్త్రిసుత శలభకృశానుం
అంబుమాలివధ చండ ప్రతాపం - అక్ష కుమార సంహరణ విక్షేపం
బ్రహ్మాస్త్ర బంధత బ్రహ్మ వరదానం - చాతుర్భాగసైన్య చండిత రూపం
వాయు ప్రేరిత వాలాగ్నిజ్వాలం - సీతాప్రసాదిత శీతలవాలం
వరరాక్ష సగృహ వహ్ని సందగ్దం - కపిదృక్చకోర సంగత చంద్ర బివ్బం
తారానంద నాది తరుచర యుక్తం - మధువన మధుపాన మత్త కపీన్ద్రం
కౌసలే యకార్య కరుణ సమర్ధం - రామ నివేదిత రామ వృత్తాన్తం
వరవిభీషణరక్ష వాక్య నైపుణ్యం - రామ సంవర్ధత రాక్ష ససంఖ్యం
అబ్దిబంధన కార్య అమితోత్సాహం - ప్రబల జలధ సేతు బంధన నిపుణం
ధూమ్రక్షాకంపన త్రిశిర సంహారం - రామనామాస్త్రేణ రాక్ష సనాశం
రణకర్కశ ఘోర రాజిత వేషం - రావణ ఘన యుద్ధ రామ తురంగం
మేఘనాద సైన్య మృత్యు సర్వరూపం - రక్షేన్ధ్ర జిద్యుద్ద లక్ష్మణ తురంగం
లక్ష్మణ మూర్చా సంరక్షణ హృదయం - సంజీవాద్రి గమన సంతోషస్వాంతం
కాలనే మికృత ఘన మాయాయుక్తం - మకర బంధి కృత మహిత పదాబ్జం
ధాన్య మాలినీ శాప దర్ష తరూపం - కాలనే మిదనుజ ఖండిత ధిరం
దికృతాద్ర్య ధిశ త్రీవ్ర ప్రకోపం - గంధర్వ సైన్య సంక్షోభ ప్రతాపం
స్తబకీ కృత ధృత సంజీవ నాద్రిం - భరత సంబోధిత ప్రశమిత బాణం
మాల్య పదాది మహొ దధి హరణం - లక్ష్మణప్రాణ సంరక్షణ నిలయం
సౌమిత్రి సమ్మోహ జలద సమీరం - అబ్ది మధ్య మధత రాక్ష సవారం
స్థూలజం ఘాసుర తుముల సంహరణం - సింధూల్లం ఘన జలద సమీరం
వాలప్రాకార సంవేష్టిత వీరం - పాతాళ లంకా ప్రవేశిత ధీరం
మత్స్య వల్లభ ధీర మహనీయభీతిం - మైత్రీకృత ధీర మత్స్యాధ పత్యం
దోర్దండీ కృత మిత్ర ధైర్య ప్రతాపం - భిన్నతులాయన్త్ర భీమ స్వరూపం
బలరాక్ష సకోటి భంజిసత్వం - శ్రుతివాక్య శ్రవణ సంతోషిత స్వాంతం
మెరావణకృత మర్మ సంవేద్యం - మైరావణ సైన్య మర్దత శూరం
మహనీ యాతి ఘోర మైరావణాజిం - దోర్దం జవాక్యాతి ఖండిత దైత్యం
నీలమేఘకృత నిస్తుల రాజ్యం - రామలక్ష్మణ పూర్వ లంకాభి గమనం
సకల వానరస్తుతి సంతోష హృదయం - ప్రబల మూలబల ప్రళయ కాలాగ్నిం
రామారావణయుద్ధ రామతురంగం - దశ కంట కంట విలుంటన దీక్షం
రాక్షసానుజదత్త లంకాభిషేకం - పుష్పకాధ రూఢ పృద్వీశ సహితం
సాకేత పుర వాస సబల సంయుక్తం - భక్తి పాపతిమిర భాస్కర రూపం
శతకంట వధో పాయ చాతుర్య యుక్తం - ఏకైక రాక్షస ఏకైక రూపం
శతకంటచ్చే దక సీతాప్రబోధం - అవనిజాధ పయుక్త రాజ్య ప్రవేశం
ఆశ్వమేధ యాగ అమితోత్సాహం - దశశత శిరచ్చేత దీక్ష ప్రతాపం
దశశత శిరచ్చేద దశరట సూనుం - సకల సైన్యావృత సాకేత వాసం
బోధతక పివర్య పూర్ణ స్వరూపం - ఝంకారోచ్చలిత డాకినీ సైన్యం
చరిత వాలసం వేష్టిత కాయం - యజత రామపాద యజురాది వాక్యం
శ్రీకాకుళే శాశ్రిత మందారం - భక్త జన కాంక్ష ముక్తి నిదానం
లీలా వినోదిత దాన స్వరూపం - పరి పాలిత భక్త ముక్తి నిదానం
బుధ జనవేదిత పూర్ణ స్వరూపం - మోహన ఘన పెద ముక్తే వివాసం
భద్రాచల రామ భద్ర సమేతం - పర సుందర రామ దాసాను పాలం
మంగళ మంజనామారుత పుత్రం - శ్రీరామదూతం శిరసానమామి