సిద్దాంత శిఖామణి | Siddantha Shikhaamani
వీరశైవ సిద్దాంతము యొక్క పరమ ప్రామాణిక గ్రంధము సిద్దాంత శిఖామణి:
వీరశైవ సిద్దాంతమును సంపూర్ణముగా తెలుపు గ్రంధము శివయోగి శివాచార్యునిచే రచించబడిన "సిద్దాంత శిఖామణి" అనే సంస్కృత గ్రంథము. పంచాచార్యులలో ఒకరైన రేవణ సిద్దుడు, అగస్త్య మహర్షికి భోదించిన వీరశైవ సిద్దాంతమును శివయోగి శివాచార్యుడు ఈ గ్రంధమున వివరించెను. రేవణ సిద్దుడు (రేణుకాచార్యుడు) భోదించిన సిద్దంతము కాబట్టి దీనిని "రేణుకా గీత", "రేనుకాగాస్త్య సంవాదము" అని కూడా పిలువ బడుతుంది. సిద్దాంతశిఖామణి వీరశైవులకు ధర్మ గ్రంధము వంటిది. వీరశైవుడాచారించ వలసిన పద్దతులను సవివరంగా విశదీకరిస్తుంది. వాటి యందు వివరించబడిన లింగారాధన పద్దతులే వీరశైవ మతమున ఆచరించబడుచున్నవి.
28 శివాగామముల లోని సారాంశమంతయ చేర్చి తెలుపబదినదే సిద్దాంత శిఖామణి గ్రంధము. ఈ సిద్దాంతమును మించిన శ్రేష్ఠమైన సిద్దాంతము ఇంక లేకుండుటన దీనికి సిద్దాంత శిఖామణి అని పేరు పెట్టబడినది. సిద్దాంతముల కన్నిటికీ శిరో రత్నమువలె భాసిల్లి శిఖామణి నామమును సార్థకము చేయుచున్నది. దీనిని పటించినవాడు సమస్త శివాగమ సారమును తెలియబడుచున్నవాడగుచున్నాడు. ఇది విరోధిభావనారహిత సిద్దాంతమై శక్తివిశిష్టాద్వైత సిద్దాంతమును ప్రతిపాదించుతూ శిరోమూలకమున నిలుచుచున్నది.
సిద్దాంత శిఖామణి గ్రంధకర్త శివయోగి శివాచార్యుడు
శివయోగి శివాచార్యుడు క్రీ.శ. 900 ప్రాంతమునకు చెందినవాడు. ఇతను కొలనుపాక వాస్తవ్యుడని కాశీ జగద్గురువులు పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు తమ విభూతి మాస పత్రికలో (1943 సంపుటి 6, సంచిక 4) ప్రకటించారు. శివయోగి శివాచార్యుడు తన తండ్రిపేరు సిద్దనాథుడు అని, తాతగారు ముద్దదేవుడని సిద్దాంతశిఖామణిలో చెప్పుకున్నాడు.
- సిద్దాంత శిఖామణి గ్రంధం శక్తివిశిష్టాద్వైత (వీరశైవ) సిద్దాంతాన్ని ప్రభోదిస్తుంది. ఈ గ్రంధంలో చెప్పబడిన అష్టావరణ, షట్ స్థల, పంచాచార సిద్దాంతాన్ని నేటికీ ఎంతోమంది తమ సంప్రాదాయంలో ఆచరిస్తున్నారు.
- సిద్దాంతశిఖామణి గ్రంథాన్ని తెలుగులిపిలో శ్రీశైల జగద్గురుపీఠం వారు ప్రచురించారు. అలాగే శ్రీ S.P.బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంలో ఆడియో కేసెట్ రూపంలో కూడా తెలుగులో తీసుకువచ్చారు శ్రీశైల జగద్గురువులు.
- తెనాలి సాధనా గ్రంథమండలి వారు మంచి తెలుగు వివరణతో 1960లో ప్రచురించటం జరిగింది.
- శ్రీ కాశీ జగద్గురు పీఠం వారు తెలుగు వివరణతో 2012లో ప్రచురించటం జరిగింది. ఈ గ్రంధమే తెలుగులో ఇప్పుడు లభ్యంగా ఉన్న గ్రంధం.
- ఈ సిద్దాంత శిఖామణి గ్రంధాన్ని 14 వ శతాబ్దములో వరంగల్, పాల్కురికి గ్రామానికి దగ్గరగల మల్లంపల్లి గ్రామానికి చెందిన చెన్నవెగ్గడ నాగేశ్వర కవి తెలుగులో "సిద్దాంత శైవము" అను పేరున ద్విపద రచన చేశాడు. అది చాలా సరళంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం లభించుట లేదు. ఈ గ్రంధం గూర్చి పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు తమ విభూతి మాసపత్రికలో తెలపటం జరిగింది.
ఆ తెలుగు ద్విపద సిద్దాంత శిఖామణి ఇలా ఉంది :
సిద్దాంత శిఖామణి PDF గ్రంధము కొరకు 49.రూ నామమాత్రపు రుసుముతో ఈ ప్రాచీన గ్రంధములను పొందవచ్చును :
సిద్దాంత శిఖామణి గ్రంథ విశిష్టత
బ్రహ్మ సూత్రములకు భాష్యము నిర్మించి సంస్కృతమున "శ్రీకరభాష్యం" రచించిన శ్రీపతి పండితాచార్యుడు (క్రీ.శ. 960 ప్రాంతమునకు చెందినవాడు) తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోనుటయూ కలదు. శ్రీపతి పండితుడు విజయవాడ శాసనములలో కలడు, అతను సిద్దాంతశిఖామణి గ్రంథమును ప్రస్తావించుటన అతనికి పూర్వమే ఈ గ్రంధము వెలువడినదని, పురాతనమని చారిత్ర్యక పరంగానూ చెప్పవచ్చును.
శ్రీపత్ పండితుడు తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.
అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:
- "పవిత్రంతే" - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్ అని
- "రేణుక భగవత్పాద చార్యేణాపి" - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథము ఎంత ఉన్నతమైనది తెలియజెప్పాడు.
"శ్రీకంఠ భాష్య" (బ్రహ్మ సూత్ర భాష్యము) కారులైన శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ భాష్యంలో ఈ సిద్దాంత శిఖామణి శ్లోకములను ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట వలన ఈ గ్రంధ ప్రశస్తి ఎంత గొప్పదో తెలియనగును. శ్రీకంఠ శివాచార్యులు తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున:
సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది. ఇంకనూ భట్టోజీ దీక్షితుల (ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త) "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకర భట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" , "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" ఆదిగా గల గ్రంధములలో సిద్దాంత శిఖామణి ప్రమాణముల ఉదాహరించుటచే ఇది జగత్ప్రసిద్ది నొందబడు చున్నది.
సిద్దాంత శిఖామణిలో ప్రతిపాదింపబడిన విషయములు:
సిద్దంతశిఖామణి గ్రంధము శక్తి విశిష్టాద్వైత సిద్దాంతమును విర్దుష్టముగా ప్రతిపాదించుచూ సుమధురమైన సంస్కృత శ్లోకములచే 21 పరిచ్చేదములతో విలసిల్లు చున్నది.
ఇందులో తెలుపబడిన విషయములు:
- ఆధ్యాత్మిక విషయములు
- ధార్మిక విషయములు
- యోగ విషయములు
- మత విషయములు
- గురుమహాత్మ్య వివరణ
- లింగ ధారణము
- భస్మ ధారణము
- రుద్రాక్ష ధారణము
- పంచాక్షరీ మంత్రం విచారము
- వర్ణాశ్రమ విచారము
- శక్తి విశిష్టాద్వైత విచారము
- జీవాత్మ పరమాత్మ విచారము
- వర్ణాశ్రమ ధర్మ విచారము
- క్రియా జ్ఞాన సముచ్చయ విచారము
- లింగాంగ సామరస్య విచారము
- శక్తి విచారము
- జగత్సత్యత్వ విచారము
- పరిణామవాద విచారము
ఇందులో 6 సోపానములుగా షట్ స్థల సిద్దాంతము (భక్త, మహేశ, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య) పొందుపరచబడినది. ఈ షట్ స్థల జ్ఞానమే మోక్షమునకు మూలభూతము.
వీరశైవ సిద్దాంతములో అంగస్థళ, లింగస్థళ అని 2 భేదములు కలవు. అంగస్థళములు - 44, లింగస్థళములు - 57 కలవు . 5-20 పరిచ్చెదములలొ ఈ మొత్తం 101 స్థళముల యొక్క ప్రమాణ విచారము వివరింప బడినది.
అంగస్థళములు:
- పిండ స్థలము
- పిండ జ్ఞాన స్థలము
- సంసార హేయ స్థలము
- గురు కారుణ్య స్థలము
- లింగ ధారణ స్థలము
- భస్మ ధారణ స్థలము
- రుద్రాక్ష ధారణ స్థలము
- పంచాక్షర జప స్థలము
- భక్త మార్గ క్రియా స్థలము
- ఉభయ స్థలము
- త్రివిధ సంపత్తి స్థలము
- ప్రసాద స్వీకార స్థలము
- సోపాది దాన స్థలము
- నిరుపాది దాన స్థలము
- సహజ దాన స్థలము
- మహేశ్వర ప్రశంసా స్థలము
- లింగ నిష్టా స్థలము
- పూర్వాశ్రయ నిరసన స్థలము
- సర్వాద్వైత నిరసన స్థలము
- ఆహ్వాన నిరసన స్థలము
- అష్టమూర్తి నిరసన స్థలము
- సర్వగత్వ నిరసన స్థలము
- శిల జగన్మయ స్థలము
- భక్త దేహిక లింగ స్థలము
- ప్రసాది స్థలము
- గురుమహాత్మ్య స్థలము
- లింగ మహాత్మ్య స్థలము
- జంగమ మహాత్మ్య స్థలము
- భక్త మహాత్మ్య స్థలము
- శరణ మహాత్మ్య స్థలము
- ప్రసాద మహాత్మ్య స్థలము
- ప్రాణ లింగి స్థలము
- ప్రాణ లింగార్చన స్థలము
- శివయోగ సమాధి స్థలము
- లింగ నిజ స్థలము
- అంగ లింగ స్థలము
- శరణ స్థలము
- తామస నిరసన స్థలము
- నిర్దేశ స్థలము
- శీల సంపాదన స్థలము
- ఐక్య స్థలము
- ఆచార సంపత్తి స్థలము
- ఏక భాజన స్థలము
- సహభాజన స్థలము
లింగ స్థళములు:
- దీక్షా గురు స్థలము
- శిక్షా గురు స్థలము
- జ్ఞాన గురు స్థలము
- క్రియాలింగ స్థలము
- భావలింగ స్థలము
- జ్ఞానలింగ స్థలము
- స్వస్థలము
- చార స్థలము
- పర స్థలము
- క్రియాగమ స్థలము
- భావాగమ స్థలము
- జ్ఞానాగమ స్థలము
- సకాయస్థలము
- అకాయస్థలము
- పరకాయ స్థలము
- ధర్మాచార స్థలము
- భావాచార స్థలము
- జ్ఞానాచార స్థలము
- కాయానుగ్రహ స్థలము
- ఇంద్రియానుగ్రహ స్థలము
- ప్రాణానుగ్రహ స్థలము
- కాయార్పణ స్థలము
- కరునార్పణ స్థలము
- భావార్పణ స్థలము
- శిష్య స్థలము
- శుశ్రూష స్థలము
- సేవ్య స్థలము
- ఆత్మ స్థలము
- అంతరాత్మ స్థలము
- పరమాత్మ స్థలము
- నిర్దేహాగమ స్థలము
- నిర్భావాగమ స్థలము
- నష్టాగమ స్థలము
- ఆది ప్రసాది స్థలము
- అంత్య ప్రసాది స్థలము
- సేవయ ప్రసాది స్థలము
- దీక్షా పాదోదక స్థలము
- శిక్షా పాదోదక స్థలము
- జ్ఞాన పాదోదక స్థలము
- క్రియానిష్పత్తి స్థలము
- భావనిష్పత్తి స్థలము
- జ్ఞాననిష్పత్తి స్థలము
- పిండాకాశ స్థలము
- బింద్వాకాశ స్థలము
- మహాకాశ స్థలము
- క్రియాప్రకాశ స్థలము
- భావప్రకాశ స్థలము
- జ్ఞానప్రకాశ స్థలము
- స్వీకృత ప్రసాది స్థలము
- శిష్టోదన స్థలము
- చరాచరలయ స్థలము
- భాండ స్థలము
- భాజన స్థలము
- అంగాలేప స్థలము
- స్వపరాజ్ఞ స్థలము
- భావాభావ లయ స్థలము
- జ్ఞాన శూన్య స్థలం
- చివరగా శివైక్య స్థలము తెలుప బడినది.
ఈ గ్రంధమును చదివిన వారు సంపూర్ణ జ్ఞానముచే మోక్ష ప్రాప్తి నొందుట తథ్యము.
సిద్దాంత శిఖామణి PDF గ్రంధము కొరకు 49.రూ నామమాత్రపు రుసుముతో ఈ ప్రాచీన గ్రంధములను పొందవచ్చును :