శ్రీ మద్రామాయణము
వేద వేద్యే పరే పుంసి జాతే దశర థా త్మజే
వేద : ప్రచాతే సద సీత్ సాక్షా ద్రామా య ణా త్మనా ||
వేదముల చేత ప్రతి పాది౦చబడు పురుషోత్త ముడు దశ రథునికి కుమారుడైన శ్రీ రాముడిగా జన్మించగా, వేదమే వాల్మీకి ముఖము నుండి శ్రీ రామాయణ కావ్యముగా అవతరించినది. కావుననే శ్రీ మద్రా మాయ ణ మునకు వేదములతో సమానముగా గౌరవము కలదు. ఇతి హసములలో శ్రీ రామాయణ, మహా భారతములు ప్రసిద్ది చెందినవి.
శ్లో: యావ స్థా స్య తిగిరి యస్స రిత శ్చ మహీతలే
తావ ద్రా మా య ణ కథా లోకే షు ప్రచారి ష్యతే ||
ఈ భూమి మిద పర్వతములు, నదులు ఉన్న౦త వరకూఈ రామాయణ గాథ ప్రాచుర్యము కలిగి యే యుండునని ఈ శ్లోక అర్ధము
ఇటువంటి ' విశిష్ట మహా కావ్యము' ను మొదటగా సంస్కృతమున రచించిన వాడు అది కవి యైన ' వాల్మీకి ' మన భారత దేశమున ఈ మహా కావ్యము బహుజన ప్రశంసల నంది, బహు భాషలలో రచింప బడినది.
ముఖ్యముగా తెలుగు నా ట అనేక మహా కవులు, అధునాతన కవులు రామాయణమును కవ్యములుగా తమ సామాన్య ప్రతిభా పాండిత్య ములతో ఆంధ్రీ కరణ చేసి యున్నారు. వాటిలో ' మొల్ల రామాయణం, భాస్కర రామాయణం ' మొదలగునవి ఉన్నవి.
' శ్రీ మద్రా మాయణము' ను సంస్కృతమున రచించిన ' వాల్మీకి మహర్షి' కారణ జన్ముడు. శ్రీ రాముని దివ్య చరిత్ర ఈ ' రామాయణం ' ముఖ్యంగా రాముణ్ణి సామాన్య మానవునిగా అనుకొని చదివితే రామాయణంలో గొప్పదనం పూర్తిగా అర్థమవుతుంది. మనిషి పడే బాధలన్ని పడి నా రాముడు చాలించ లేదు. ఆ రాముడి ఘనత చాటేందుకు అతనంతటి గొప్ప వాడు యైన రావ ణు డ్ని ' ఎదుటి వాడి' గా నిలిపాడు. వాల్మీకి. ఎంత గొప్పవా డై నా స్త్రీ వాంఛ కారణంగా చెడి పోయాడు రావణుడు. ఉన్న ఒక్క భార్యని కూడా లోక అపవాదులకు వెరిచి, వదలి వేసిన పురుష శ్రేష్టుడు రాముడు.
పావన మైన సరయూ నది తీరాన ఉన్నది. అయోధ్య నగరం. ఈ నగరాన్ని ఇక్ష్వా కు వంశ మూల పురుషుడైన వైవస్వత మనువు నిర్మించాడు. రామాయణ కథా కాలానికి సూర్య వంశ రాజైన "దశరథుడు' ఈ నగరాన్ని పరిపాలిస్తూ న్నాడు. ఆ నాటి ఆచారం ప్రకారం ఈ రాజుకు కౌశల్య, సుమిత్ర, కైకేయి మొదలగు ముగ్గురు భార్య లున్నారు. కానీ ' ఆ పుత్ర స్య గ తిరస్తి' అనే ఆర్యోక్తి ని ఎగిరి, బిడ్డలు లేనందున దశరథుడు దిగులు పడ్డాడు. తమ కుల గురువును రప్పించి తన భాదను తెలియ జేయగా, ముందు మానవ ప్రయత్నంగా అశ్వ మేథ యాగాన్ని చేయమని చెప్పాడు.
'ఋష్యశృ౦గుడ; నే మహర్షి బాహ్య జగత్తు తో ఎలాంటి బంధాలు లేనివాడు. విభా౦ డ కుని పుత్రుడు. దశరథుని పెంపుడు పుత్రిక యైన ' శాంత' నిచ్చి ఇతనితో వివాహం జరిపించారు. ఋష్య శృ ౦ గుని అయోధ్య కు పిలిపించి ఆతని సలహా మేరకు దశరథుని చేత ' పుత్రికా మేష్టి యాగము' చేయించాడు. గురువు వశిష్టుడు. ఈ యజ్ఞ కుండము నుండి యజ్ఞ పురుషుడు ఉద్భ వించి పాయసమును ఇచ్చి దశరథుని ముగ్గురు భార్యలకు పంచ మనెను. దశరథుడు కౌస్యలకు కొంత, కైకకు కొంత, సుమిత్ర కు కొంత పంచి ఇవ్వగా కొంత మిగిలెను. అది తిరిగి కౌస్యలకు ఇచ్చెను. ఈ విధముగా పంచిన పిదప ఒక శుభ ముహూర్తమున కౌస్యలకు శ్రీ రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రు ఘ్నుడు, కైకకు భరతుడు జన్మించారు. పువ్వు పుట్ట గానే పరిమ ళించు నటుల వారు పెరుగు తూనే అన్ని సద్గుణ ములను అలవరచు కొనిరి.
శ్రీ వాల్మీకి రామాయణమును ఏడు కాండలుగా విభజించెను.
1 . బాలకాండ :
ఇందు దశరథ కుమారుల యొక్క బాల్యము, విశ్వా మిత్రుని వద్ద వారు నేర్చిన విద్యలను గూర్చి, విద్య నంతరము సీతా స్వయ౦ వరమును గూర్చిన విశేషములు వివరింప బడినవి. జనకుని కుమార్తె యైన జానకి (సీతా) అయోని జాగా జన్మించినది. శివ ధనుస్సు ణు విరిచి పురుషో త్తము డైన శ్రీ రాముని వరించినది.
2 . అయోధ్య కాండ:
దశరథుడు ప్రజా రాంజ కంగా రాజ్య పాలనా చేస్తున్నాడు. తనకు వృద్దాప్యం వస్తు న్నదని గ్రహించిన దశరథుడు పెద్ద కుమారుడైన శ్రీ రామునికి పట్టా భి షేకం చేయ దలచి తీసుకున్న నిర్ణ యమును మంధర అను సేవిక దశరథుని మూడవ భార్య యైన కైక చెవిలో వేసింది. కైక మండి పడి తన పుత్రుడైన భారతునికే పట్టాభిషేకం చేయ వలెనన్న కోరికతో పూర్వము దశరథుడు తనకు ఇచ్చె దనన్న రెండు కోరికలు ఈ సమయములో కోర దలచి దశరథునితో రామునికి పదు నాలుగేండ్ల వన వాసమును, భరతునికి పట్టాభి షేక మును కోరెను. దశరథుడు భార్యకిచ్చిన మాట కాదన లేక శ్రీ రాముని పిలిచి అమితమైన భాదతో వన వాస విషయమును చెప్పెను. శ్రీ రాముడు సహజ సద్గుణ శీలి. తండ్రి ఆజ్ఞను శిర సావహించిన పితృ వాక్య పరిపాలకుడు, సత్య శీలి. మారు మాట్లాడక ఒప్పు కొనెను. సీతా దేవి సుకుమారి. కావున రాముడు వలదన్న నూ కష్ట మైనను భర్త తోడి దె బ్రతుకు గా నెంచి, ఎన్నిక కష్టము లైన నూ భర్తను అను సరించి భరించ వలెనను.
సద్గుణ ముగల విదు షీ మణి అగుటచే వన వాసమునకు సిద్ద పడెను. లక్ష్మణుడు కూడా అన్నను దైవంగా భావించి ఆతనికి సేవ చేయ వలెనని భావించి వన వాసమున కెగెను. రాజమందిరమున నుండి సకల భోగములను అనుభవింప వలసిన వారు వలువలు దరించి, ఇచ్చిన మాట కొరకై అడవులకే గుట చూచి అయోధ్య పుర వాసులు విచారించి. అయినాను శ్రీ రాముడు తండ్రి ఆజ్ఞను శిర సావహించేను. గుహుడు అను ఒక నావికుడు వీరిని గంగ నది తీరము దాటించెను.
శ్రీ రాముడు అడవులకే గుచూ, అనేక మంది మునులను, ఋషులను, తాపసులను దర్శించి వారి వద్ద ఎన్నో ధర్మ విషయములను గ్రహించెను. సీతా, లక్ష్మణ సమేతుడై శ్రీ రాముడు చిత్ర కూట పర్వతము వద్దకు చేరెను. ఒక పర్ణ శాల నిర్మించు కొని అచ్చట నివసించిరి. దశరథ మహారాజు అంతః పురంలో శ్రీ రాముని పైది గులుతో మరణించెను. దశరథునికి పుత్ర శోకంతో మరణి౦చుననే శాపము న్నది. భరతుడు జరిగిన విషయము తెలుసుకొని విచారించి, తల్లి ద్వారా జరిగిన విషయములను తెలుసుకొని కన్న తల్లి యొక్క దుర్గుణ మునకు నిందించెను. ఇక్కడ భరతునికి అన్న యందు గల భక్తి, తండ్రి యందు గల గౌరవమును గుర్తించ వలసియున్నది.
భరతుడు శ్రీ రాముని బదులుగా రాజ్య మేలు మన్న డానికి ఒప్పుకొని, రాముని కడకు వెళ్ళి అతని బదులు పాదుకలకు తెచ్చి, వాటిని సింహాసనము అలంకరింప జేసిన భ్రా తృ భక్తి కల్గిన వాడు. ఇతడు . ఇచ్చట మనకు భ్రా తృ భక్తి, అన్న దమ్ముల సఖ్యత అగు పించు చున్నది. ఈ సోదర భావమును ఈ నాటి ప్రతి వ్యక్తి అలవరచు కోవలసి యున్నది.
భరతుడు శ్రీరామ, లక్షణులున్న చిత్ర కూట పర్వత మునకు వచ్చును. భరతుని సేనలతో వచ్చుచున్నవానిగా ఎరింగి లక్షనుడు కోపగించుకోనగా అన్న శ్రీరాముడు భరతుని చిత్త వృత్తి ని గ్రహించి, అతడ లాంటి వాడు కాడ ని లక్షణునికి తెలియపరచెను. ఎక్కడ రామునికి తొందర పాటు గుణము లేదు ని తెలియుచున్నది. ధీ నివలన తమ్ముడు భరతుని అపార్ధ ము చేసుకోన లేదు. తమ తండ్రి మరణ వార్త భరతుడు శ్రీరామ, లక్షణులకు వినిపించ గా తండ్రి బుణము తీర్చుకోలే నివానిన య్యాన ని శ్రీరాముడు రోదించ గా, తండ్రి ఆజ్ఞను పాలించుట కంటే మించిన పితృబుణము తీ ర్చకోనునది వేరే ఏమి లేదు ని సోదరులు శ్రీరాముని ఒదార్చిరి. పిద ప శ్రీరాముడు తండ్రి ని మన సార తలచుకొని లక్ష్మణ సమేత ముగా మందాకి నీ న దీ తీ రమున తర్పణములిచ్చెచెను. భరతుడు అన్న గౌరవ భక్తులు కలవాడు. అతని కోర్కె తీ ర్చమని వారి కుల గురువు వశిషుడు చెప్పగా శ్రీరాముడు తన పాదుకలను తనకు బదులుగా భారతునికు ఇచ్చి అయోధ్యకు పంపెను. అవి తీ సుకొని భరతుడు అయోధ్య నగరానికి వెడలి శ్రీరాముని బదులుగా అతని పాదుకలను సింహాసనం పై ఉంచి తాను రాజ్యమును పరి పాలించెను.
3, అరణ్యకాండ :
అత్రి మహామునిని వీడ్కొని దండ కారణ్యమును దర్శించెను. అక్కడ కనిపించిన తాపసులను భక్తి తో దర్శించుచుండగా విరాధుడు మొదలగు రాక్షసులను సంహరించెను. శ్రీరామాదులు ఈ విధ ముగా కాలము గడుపుచుండ గా ఒకానొక సమయంలో ఈ వార్త రావణుని చెల్లెలు శూర్పణఖ విని వారున్న వాసమునకు వచ్చి, శ్రీరాముని చూచి మొహించెను. అంత రాముడు తాను ఏక పత్మి వ్రతుడ న ని లక్షణుని వద్దకు పంపెను. లక్షణడు మండి పడి వారి గురించి ఆమెనడుగ గా, సీతారాములు గూర్చి, సిత యొక్క అంద మును గూర్చి ఎరింగించెను. అపుడు రావణుడు సిత ను ఎట్లె నా తెచ్చి తన దానిని చేసుకోవా లెన ని యెంచి, ఆమెను అపహరించుకొని వచ్చుటకు కంకణము కట్టుకొనెను. ఈ విషయంలో రావణుని చెల్లెలు శూర్పణఖ అతనిని పూరి గొల్పెను. ఈ విధ మైన స్త్రిలున్న చోట అనేక అనర్ధ ములు కల్గుటకు అవ కాశ మున్నది. కావున ఈ మనస్త త్వం మంచిది కాద ని రామాయణంలో ని శూర్పణఖ పాత్రను బట్టి గ్రహించ వచ్చును.
రావణుడు మరీ చుని వద్ద కేగి, నీవు సితారాములున్న పర్ణ శాలకు మాయలేడి వేషము ధరించి, వెళ్ళిన చొ నిన్ను వెంటాడుతూ శ్రీరాముడు నీ వెనక వచ్చును, అపుడు నీవు మరనిస్తున్నట్లుగా నటిస్తూ,' హా సీతా! హా లక్ష్మణ!' అని అరువుము. వెంటనే తన భర్త కు ఏదొ ప్రమాద ము సంభ వించెను ని తలచి రామునికోరకు సీత లక్ష్మణ కూడా పంపించును. అ సమయమున సీత ఒంటరిగా పర్ణ శాలయందుండును కావున నేను మాయా బ్రాహ్మణ వేషమున వెళ్లి ఆమెను అపహరించెద నని తన మాయా ఉపయమును మారీ చునికి తెలుపగా అతడు మొదట అంగీ కరించ లేదు. రావణుడు అతనిని చెంపెదన ని బెదిరించ గా, ఇతని చేతిలో మరణించుట కంటే పురుషోత్తము డైన శ్రీరాముని చేతిలో మరనిన్చుటే భాగ్యమని తలచి చివరకు ఆమోదించెను.
మారీ చూడు ఒక బంగారు లేడి రూపమును ధరించి, సీతకు కన బడునట్లు అచటికి వెళ్ళెను. సీత అ బంగారు లేడి ని తెమ్మని శ్రీరాముని కోరెను. విధ వశమన్నచో ఇదే. ఈ విధంగా రావణుని మాయలో పడి నది సీత. శ్రీరాముని కేకలకు లక్ష్మణుని వెళ్ల మని సీత చెప్పగా, లక్ష్మణుడు సీత కు ఏమైనా ఆపద సంభ వించునే మోయని తలచి వెళ్లుటకు నిరాకరించ గా, తన నెంతో భక్తి గా సేవిస్తున్న తన మరిది ని కూడా ఆమెనమ్మక నిందించెను. ఆమె నింద భరించ లేని లక్ష్మణుడు ఆమె చెప్పినట్లే చేసెను. ఈ విధ ముగా రావణాసురుని దుష్ట ఉపాయమున కు ఆమె బలయ్యోను. ఎటువంటి కష్ట సమయములో నైన నూ వారి ధర్మాన్ని, కర్త వ్యాన్ని విడ నివారు శ్రీరామ, లక్ష్మణులు.
రావణుడు సీత ను చేర పట్టి తీ సుకు వెడుతుండ గా, జటాయువు, సంపాతి మొదలగువారు అది అధర్మ మని వారించారు. కాని మూర్ఖ డైన రావణుడు వారి మాటను విన లేదు. జటాయువు ఈ సమాచార మును శ్రీరామ, లక్ష్మణులకు అందించి, మరణించెను. రాముడు జటాయువున కు మోక్ష మునిచ్చేను. తరువాత రామలక్ష్మణులు సీత ను వెదకు సమయమున క బంధుడ నే వానిని వధించి, శబరి అనే భక్తురాలు ఆహ్వానించ గా అచాటకి వెళ్లి ఆమె అతిథ్యిమును స్వీకరించి, తిరుగు ప్రయాణమయ్యిరి.
4, క్రిష్కందా కాండ :
ఈ భాగ ములో శ్రీరామునికి సీతను గుర్చిన దు:ఖము ఎక్కువై, సీత ను వెద కుటలో నిమగ్మమవ్వగా మార్గ మధ్యమున వారికి బుష్యమూక పర్వత ము అగుపించినది. దానిని పాలించు రాజు' సుగ్రీ వుడు' (కపిరాజు). అతని కొలువులో ఉన్నాడు అంజనెయుడు. రాజు వేషములలో వస్తున్నా వారిని చూచి, వీ రెవరో తెలుసుకో వాలని, ఎదురేగి వారిని కలుసుకున్నారు. రామలక్ష్మణులు వారికి వారి కథ ను వినిపించ గా సుగ్రీవుడు కూడా తన భార్యను వెద కూచున్న సంగ తిని వారికి వినిపించి, ఈ విషయంలో మనం ఒకరి కొకరు సహాయము చేసుకోన వలెన ని తలచిరి. వాలి సుగ్రీవుని సోదరుడు. అతడు సుగ్రీవుని భార్యను అపహరించాడ ని చెప్పగా, శ్రీరాముడు అతనికి సహకరిస్తానని మాట యిచ్చును. ఇచ్చిన ప్రకారం వాలిని చెట్టు చాటునుండి సంహరించెను. సుగ్రీవుడు సంత సించి, తన సైన్యమును సీత ను వెద కుటకు పంపెను. ఈ విధంగా సీతాన్వేషణలో శ్రీరామునికి అంజనెయుడు సహకరించెను. రాముని నిజమైన భక్తుడు, నమ్మిన బంటు ఆంజనేయుడు. తన జీవిత మంతా శ్రీరాముని సేవకై అంకిత మిచ్చిన గొప్ప సేవకుడు, మహా బలవంతుడు హనుమంతుడు.
5 . సుందర కాండ :
సుగ్రీవుని ఆజ్ఞను తీ సుకొని హనుమంతుడు సీతను వెదకుటకు దక్షిణది క్కుగా బయలు దేరి నాడు. సిత లంకలో వున్నట్లు హనుమంతుడు కనుకొన్నాడు. తన పట్టుదల, కార్య సాధన దీక్ష, శ్రీరామునిపైవున్న అచంచల భక్తి విశ్వాసాలు సిత క్షే మంగా ఉన్నదన్న శుభ వార్త ను శ్రీరామునికి అందించిన వి. ఆంజనే యుడు వీ రుడు, ఏ కార్యము నైనా సమర్ధ వంతంగా జయించ గ లవాడు. ఇందరి యములను జయించిన వాడు. కనుక నే సీతాన్వేషణ అనే పెద్ద బాధ్యతను తన పై వేసుకొని, మధ్యలో ఎన్నివిధాలైన ఆటంకములెదు రైనా లెక్క చెసవ కులలో అగ్ర గణ్యుడుగా ప్రసిద్ద చెందాడు.
శ్రీ వాల్మీకి మహర్ష ధీ నిని సుందర మైన ది గానూ, సుందర కాండ గానూ అభి వర్ణించినాడు. అశోక వనంలో కుమిలిపోతున్న సీతకు ' ఉన్నాడు లెస్స రాఘవుడు' అని ఏవిధ మైన అనుమానం, ఆందోళన లకు తావులే కుండా ముందుగా ఈ విధంగా పలికి నట్లుగా మెల్ల రామాయణంలో తెలుపబడింది. ఈ విధంగా తన బుద్ద్ కుశలత తో శ్రీరాముని కార్యాన్ని సాదించిన వాడు హనుమంతుడు.
6, యుద్ద కాండ:
సితామాత క్షే మంగా ఉన్నదన్న వార్త విని శ్రీరాముడు హనుమంతుని అభినందించి, ఆమెను అపహరించి మహాపాపం చేసిన దుషుడైన రావణాసురుని సంహరించుటకు నిశ్చయించడు. శ్రీరాముడు వానర ర జైన సుగ్రీవుని సహకారంతో, కపి సైన్యమంతా శ్రీరామునికి సహాయం చేసింది. శత యోజన విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటుటకు కష్ట మైనది. శ్రీరాముడు సముద్రుని ప్రార్ధించ గా, అప్పటికీ ప్రసన్నత చెందినా సముద్రుని పై శ్రీరామునికి కోపం వచ్చి బాణం సందించుటకు సిద్ద పడి నాడు. వంటనే సముద్రుడు భయపడి, శాంతించి, దర్శన మిచ్చి, శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం తన గంభి రతను తగ్గించినాడు. వానర సైన్యం సముద్రం పై రాళ్ల ను వేసి, వరద్ కట్టి తగు ఏర్పాట్లు చేశారు.
శ్రీరామునితో వైరం వద్ద ని, సిత అపహరణ లంకా నగరానికి చేటు తెస్తుందని రావణుని తమ్ముడు విభిషణుడు తన అన్నకు ఎంత వివరించిన నూ, వినక రావణుడు విభి షణుని తన రాజ్యం నుండి వెడలగొట్టెను. విభి షణుడు చేయునది లేక శ్రీరాముని కడ కు వచ్చి శరణు వెడెను. అరటితో వచ్చి అభ్యర్ధించిన విభి షనునికి ఏమాత్రం సందే హించక అభయమిచ్చాడు శ్రీరాముడు. చుట్టూ ఉన్న లక్ష్మణ, సుగ్రీవులు రావణుడు పంపితే వచ్చినాడే మోన ని అనుమానించారు. కానీ శరణన్నవాడు శత్రు వైనసరే చేరదీ యుత క్షాత్రా ధర్మమని శ్రీరాముడు వారికీ చెప్పను. వారంతా సంతోషించి ఆమోదించారు. అంగ దుని రావణుని వద్దకు రాయబారి గా పంపారు. అది కూడ తన మూర్ఖత్వంతో విఫలం చేశాడు. కావున యుద్ధం అనివార్యమని తలచిన శ్రీరాముడు సైన్య సమేతంగా యుద్ద మునకు సిద్ద మైనాడు.
యుద్ద సమయంలో యుద్దానికి కావలసిన సూచనలన్నీ చేయబడి నవి. నిరాయుధులను చంపరాదు. స్త్రీలను, బాలుర ను చంపరాదు. ఇలా ఆశే షజన వాహిని సైన్యంలో ఎవరి నీ అన్యాయంతో అధర్మయుద్దం చేయరాదు. రావణునికి పుంజిక స్ధల శాపం వున్నది. ఒక ప్పుడు రావణుడు శివ పూజ కొరకు కైలాసాచ లమున కు వెళుతూ, మార్గ మధ్యంలో ఇంద్ర సభ లో నాట్యనికై వెళుతున్న' పుంజిక స్ధల అనే అప్సర సను చేర పట్టాడు. అందుకు ఆమె భాధ జెంది ఇష్టంలేని ముగువను తాకి తే శిరస్సు వ్రయ్యలవుతుంది ఆమె శపించింది. కావున సిత ను అపహరించిన మూలంగానే రావణుడు యుద్దంలో నాశనమైనాడు. శ్రీరాముడు తన సైన్యాన్ని గారడ వ్యూహంలో అమర్చి తక్కిన అగ్ర నాయకులకు వివిధ వ్యుహాల్లి చెప్పాడు.
శ్రీరాముని సైన్యంలో - సుగ్రీవ, అంగద, జాంబవంత, నల, నీల, మైండ, స్వివిధ, సుషేణ, వృషభ, గంధ మదన, అహత బలి, అర్క, బాలార్క, పనస, కేసరి, భరత, ద ధ్ ముఖ, ప్రజంఘ, కుముద, గయ, గ వాక్ష, శర భాది వీరులతో వానర సైన్యం వున్నది.
ఇలాగే రావణ సైన్యంలో - ఇంద్ర జిత్తు, కుంభ, నికుంభ, ప్రహస్త, దుర్ముఖ, వజ్రదంష్ట, వజ్రంగా, మహా పార్శ్వ, మహొ దర, ధూమ్రాక్ష మొదలగువారున్నారు. యుద్దం ఘారంగా సాగింది. రావణుని కొడకు ఇంద్ర జిత్తుశ్రీరామ లక్ష్మణులను నాగాస్తంతో బందించ గా అది చూచిన సిత దు:ఖించింది. వెంటనే శ్రీమహావిష్ణువు భక్తు డైన గరుత్మంతుడు అనే పక్షి రాజు ఆకాశంనుండి దిగి వారి విషసర్పాల బారి నుండి రక్షించినాడు. తరువాత యుద్దం తీవ్ర మైనది. వెంటనే రావణుని తమ్ముడు కాంభ కర్ణుని లే పారు వారి సైన్యం. ఈ కుంభ కర్ణుడు మహాబలకయుడు. ఇతడు బ్రహ్మను వర మడుగున ప్పుడు సరస్వతీ మాతఅతని నోట నుండి అపశ్రుతి పలుకునట్లు చేయగా, అతడు 6 నెలలు ఆహారం, 6 నెలలు నిద్ర వుండునట్లు అడి గాడు. లే నిచో ఇతని మహాకయంతో అన్ని ప్రాంతాల ప్రజలను మ్రింగే సేవాడట. అందువల్ల బ్రహ్మదేవుడు ఈవరం ప్రసాదించాడు.
యుద్దంలో రామలక్ష్మణులు ఇంతని కంఠాన్ని ఎడ పెడా కొట్టి, చివరగా రాముడు బాణాన్ని సందించగా అతడి శిరస్సు రావణుని పడింది. యుద్దం తీవ్ర మవుతున్న కొద్ది ఇంద్ర జిత్తు సాహసం పెరుగుతున్నది. ఇతడు రావణుని కుమారుడు. పన్నెండు సంవత్సరాలు నిద్రాహారాలు మానిబ్రహ్మ చర్యం చేసిన వాడు తప్ప ఇతడి ని చంపలేరన్న వరం ఉన్నద ని విభి షణుడు లక్ష్మణుని కి చెప్పాడు. వెంటనే శ్రీరాముడు లక్ష్మణుని ఇంద్ర జిత్తు ను చంపవలసింది గా అజ్ఞాపించాడు. ఇంద్ర జిత్తు మాయలను భస్మం చేసి, లక్ష్మణుడు అతని శిరస్సును ఖండించాడు. ఈవిషయం గురించి విన్న రావణుడు పుత్ర శోకం భరించలెక పోయాడు. తను యుద్దానికి సిద్ద మైనాడు.
సర్వ సైన్యంతో రావణుడు యుద్దానికి తరలి వచ్చాడు. శ్రీరాముని సైమ్యం రామునికి జై జై అంటూ యుద్దంలో వీర విహారం చేస్తున్నది. ఇలా ఉండ గా రావణుడు సైన్యంతో యుద్ద బూమికి వచ్చాడు. శ్రీరాముని గాంచి ఒక్క క్షణం ఆశ్చర్య చకితు డైనాడు. రాముడంటే ఇంత శృంగార మూర్తి యా! ఈ రాముని కొరకే నా సిత రామా! రామా! అని కలవరిస్తున్నది అని అనుకొన్నాడు. యుద్దం చేయుటకు సంనద్దు డైనాడు. శ్రీరామ, రావణుల యుద్దం ఆరంభ మైంది. ఈ యుద్దంలో లక్ష్మణుడు మూర్చి ల్లి నాడు. అది చూచి శ్రీరాముడు, తన కుడి భుజమైన లక్ష్మణుడు మూర్చి ల్లి తే తన కింక ఎవరు అండ అని చాలా దు:ఖించాడు. ఇంతలో అంజనెయుడు శ్రీరాముడు దు:ఖించుట చూచి, సూర్యోదయంలో పు ఇతడికి సంజీవనీ పర్వత పు మూలికను వాసన చూపించిన మూర్చి నుండి కోలుకుంటాడ ని చెప్పాడు. ఇది ద్రోణాచలంలో ఉంది. దానిని వాయు వేగ మున ఎవరు తెస్తారని రాముడు ప్రశ్నించ గా, ఆంజనేయుడు నేను తెస్తానని చెప్పి, వెంటనే వాయువేగంతో ద్రోణాచలమునకు వెడ లెను. పర్వతంలో, ని ఏమూలికతో పని అవుతుందో తెలియక, మొత్తం పర్వతాన్నే పేక లించుకొని వచ్చిన మహాబలుడు హనుమంతుడు. ఆ మూలిక ను తెచ్చి వాసన చూపగానే లక్ష్మణుడు తే రుకొని యుద్ద సంనద్దుడ య్యాడు. తిరిగి రామ-రావణుల యుద్దం ప్రారంభ మైంది. మహొ త్సాహంతో రాముడు యుద్ద భూమికి చేరాడు. రాముడు భూమిపైనుండి, రావణుడు రథం పై నుండి యుద్దం చేయుట అధర్మంగా భావించిన 'దేవతలు' ఇంద్రుని దెగ్గర ఉన్న రథాన్ని శ్రీరామునికి ఇప్పించారు.
రావణునికి మండో దరి హిత బోధ: రావణుడు యుద్దంలో విజయం పొందుటను గూర్చి ఆలోచిస్తూ పచార్లు చేస్తుంద గా, అతని భార్య మండో దరి ( సిత లాంటి మహా పతివ్రత ) అతనిని సమీపించి ఒక విన్నపం చెబుతాను వింటారా? అని అడిగింది. రావణుడు తలూపగా, ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. 'జానకి రామునికి అప్పగించుము, ఆమె ఎవరో కాదు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి స్వరూపము. ఆమె సామాన్య స్త్రీ కాదు. ఇలా తెచ్చుట మన లంకానగరానికి మంచిది కాదు' అని చెప్పగా రావణుడు విని మందో దరీ నీ కేమీ తెలియదు. ఆమె సామాన్య స్ర్తీ కాదు కనుక నే తన చే లంక కు తేబడి నది ని చెప్పను. అ శ్రీ వల్లే హరి శ్రీహరి అయ్యాడు. స్ర్తీ కోసమే సృష్ట్యాది యుద్దాలూ, రక్త పాతాలూ జరుగుతున్నాయి. కావున నీవు వీర పత్నివి. ఇలా దు:ఖించ కూడ దు వెళ్ళు మని చెప్పగా, మందో దరి విలపిస్తూ అంత:పురం పలికి వెళ్లి పోయెను.
రామ- రావణ రథాలు రణ భూమికి చేరాయి. వెంటనే దేవతలు పంపిన అగస్త్య మహాముని శ్రీరామునికి ప్రత్యక్ష మై, రామా! ఈ రావణుని సంహరించవలెనన్న, సూర్యుణ్ణి ప్రసన్నం చెసుకోవాలి. ద్వాద శాది త్యులకి ప్రత్యక్ష స్వరూపుడు ప్రత్యక్ష నారాయణుడు. కర్మసాక్షి అయిన ఆ దివ్య తేజో మూర్తి ని' ఆదిత్య హృదయం' తో స్తుతించి. ఇది నీకు ఉపదే శిస్తున్నాను అని వెళ్లి పోయెను. శ్రీరాముడు మన సులో నే దేవతలకు, అగస్త్యునికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఒక్కసారి ఆదిత్య హృదయం పఠించాడు. రావణుని శిర: బహు ఖండనం ఆరంభించాడు. కానీ, యథాత థoగా రావణునికి శిరస్సులూ, బాహువులూ మొలుస్తూ నే ఉన్నాయి. రావణుని ఇంకెలా చంపడ మా అని అలోచిస్తుండెను. రణభూమిలో ఇద్దరే వీరులు. వారే రామ రావణులు. 'గగనం గగ నాకారం సాగరం సాగ రో పమా రామరావణ యోర్యుద్దం రామరావణ యోరి వ' ఆకాశానికి ఆకాశ మే సాటి. అట్లే సాగరానికి సాగర మే సాటి. అటులనే రామరావణ యుద్దానికి రామరావణ యుద్దా మే సాటి అని ఆర్యోక్తి. ఈవిధంగా ఎవరికి వారే ఒకరి కొకరు తీ సిపోకుండా యుద్ధం చేస్తున్నారు. రావణుని తమ్ముడు విభీషణుడు రావణుని కుక్షిన అమృత భాండ మున్నది. కుక్షి ని చేదిస్తే కాని అతను చావడు అని పలుకగా రాముడు ఈ విషయం తెలుసుకొనెను.
స్తుతి సంతుష్టుడైన సూర్యుని ప్రేర ణ కలిగిన వాడై, సూర్యవంశాన్వయుడూ, శూర శిఖామణి, మహా ధానుష్యుడూ, ధర్మ వీరుడూ, కర్మ వీరుడూ కౌసల్యాగర్భ జనితుడూ అయిన రాముడు ఎదురులే ని మహాస్తాన్ని వింట సంధించి, దుస్సాధ్య మైన తన ధనుస్సును ఆకర్ణాంతం లాగి రావణుడి 'కుక్షి' ని కొట్టాడు. ఆ బాణం లంకేశ్వరుడి కుక్షిని చీల్చి, రసాతలమంటి వచ్చి, తిరిగి రాముడి తూణీరం చేరింది. అనంతరం మరో మహొగ్రమైన అస్తం కార్ముకానికేత్తి రావణుని వక్షాన్ని కొట్టాడు రాముడు.
ఆ దెబ్బకు రావణుడు గిలగిల్లాడాడు. కంపించే కర ములలో నుండి ఆయుధ ములన్నీ జారి పోగా అవనిపై పడ్డాడు. ఆకాశం నుంచి దేవతలూ, మునులు పుష్పవృష్టి కురి పించారు. విజయభేరి య్రోగించారు. బ్రహ్మ మంగళ ప్రదమైన వేద గానం చేయ నారంభించాడు. ఈ లోకం, అ లోకం అని లేకుండా అన్ని లో కాలూ ఆనందంలో మునిగి పోయాయి.
రాముని విజయం వరించింది. రావణుడు ఒడి పోయాడు. రావణుడు ఒడి పోయాడన్న వార్త విన్న పద్నాలుగు లో కాలూ ఆనందించాయి. రాముడు గెలిచాడ ని విని అశోకవనంలో సిత ఆనందించింది. ఆ తరువాత శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి లక్ష్మణా! రావణుడు సామాన్యుడు కాదు. అతని క్షాత్రం పడి పోయింది. నిరాయుధుడూ, విర ధుడూ అయిన అతడు ప్రస్తుతం బ్రాహ్మణుడు మాత్రమే అని చెప్పి, అతని తుది సందేశం అడిగి రమ్మన్నాడు శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు వెళ్లి బాధ లో నున్న రావణుని తుది సందేశం చెప్పమని అడిగాడు. అతడు ఇలా పలికాడు: లక్ష్మణా! ఓ ర హాస్యం చెబుతాను విను. రామా అంటే వేదార్ధం జీవాత్మ. సిత అంటే న రుడి నాగేటి చాలువబుట్టిన ధాన్యం. సీతారాములు జీవన శక్తి - జీవాలు. ఆ సంగ మమే జీవనం. దానికి అడ్డొచ్చి జీవాత్మను హింసించే యే రావణుడూ యెన్నాశ్లో బ్రతకడు. సీతే రామునికి ఆధారం. రాముడు వీరుడు అన్నాడు. ఇన్ని ధర్మాలు తెలిసిన వాడు కనుక నె' షడంగ వేద విదుషా: అని కీర్తించ బడ్డాడు రావణుడు. కడ సారి రాముని కళ్ళారా చూచి కన్నుమూశాడు రావణుడు.
అన్న మరణించుట చూచి ధు:ఖిస్తున్న విభిషణుని రామలక్ష్మణులు ఉరడింపజే శారు. వెంటనె లంకారాజ్యానికి పట్టాభి షిక్తుణి చేశారు. యుద్దంలో శ్రీరాముని విజయము, రావణ సంహారము, శ్రీరాముడు సీత ను తిరిగి పరి గ్రహించడంతో యుద్ద కాండ ముగిసింది.
7 . ఉత్తరా కాండ :
వాల్మీకి మహర్షి ఏడవ కాండ అయిన ఉత్తరా కాండ nu శ్రీ రాముని పుత్రులైన లవ కుశ లతోనూ, వారి రాజ్య పాలనా తోనూ వర్ణించారు. శ్రీ రాముడు అవతారం చలిచే వరకు ఈ ఉత్తరా కాండ వ్రాయ బడింది. పద్నా లుగేళ్ళ వనవాసం తరువాత సీత రాములు అయోధ్య నగరంలో కోసల రాజ్యాభి షిక్తులై సుఖంగా వున్నారు. పది పంటలతో అయోధ్య నగరం కళ కళ లడుతుండేది . రామ రాజ్యం సర్వ జన భూయిష్టంగా సాగుతుండగా, కొంత కాలానికి సీత మహా దేవి ఘర్భము ధరించినది. అయోధ్యలో ఆనందానికి అవధులు లేవు. సీత దేవికి సీమంతం ప్రకటించునంతలో ఒక దుర్వార్త ప్రజలంతా విన వలసి వచ్చించి. అదే మనగ శ్రీ రాముడు గూఢ చారు లందరినీ పిలిచి తరుచు నగరంలో విశేషాలను గురించి అడిగి తెలుసుకొనుటకు రాజ్య క్షేమము గా నెంచు చుండెను. ఇదె విధముగా జరుగుచున్న సమయములో అందరు శుభాములే వినిపించిరి. కానీ భద్రుడనే గూఢ చారి వెనుకడుట శ్రీ రామ ప్రభువు గమనించి, అతనిని పిలిచి విషయమే మిటిని అడుగగా, అతడు
ఎంతకూ నోరు మెదప కుండెను. రాముడు నీవు చెప్పునది ఎలాంటి వర్తా అయినాను నిర్భయ ముగా చెప్పు మనగా భద్రుడు వణుకుతూ చెప్పా దొడ గెను.
భద్రుడు శ్రీ రామునికి లోక నింద గూర్చి తెల్పు టకు భయపడి నాడు. తరువాత శ్రీ రాముడు ఖచ్చితంగా చెప్ప వలసిన దని అజ్ఞా పించగా ప్రభూ! ఒక చాకలి వాడు భార్యను గెంటి వేసి, ఏలోకోను పొమ్మన్నాడు. అతడు బాగా తాగి వున్నాడు. అక్కడ పెద్దలందరూ కూడి భార్యన లా వెలి వేయటం సబబు కాదని చెప్పగా, వాడు వెంటనే లంకలో రావణుని వద్ద ఏడాది పతున్న సీతను రాముడు కాబట్టి ఏలుకున్నాడు. కానీ నేను మాత్రం పరాయి వాడి పంచలో నున్న భార్యను ఏలను అని పలుకగా విన్నాను ప్రభూ ! అని దీనముగా పలికాడు. ఇది విన్న శ్రీ ర్మునిలో దు: ఖం గాని, కోపంగాని, క్రోధం గాని, భయం గాని, ఆశ్చర్యం గాని ఏ ఇతర భావమూ లేదు. ఆలోచనలో పడ్డాడు. వెంటనే లక్ష్మణుని పిలిచి సీతమ్మను అడవిలో దించి రమ్మని అజ్ఞాపించాడు. మనిషి ప్రత్య క్షంలోనూ, పరోక్షంలోను కూడా తన గురించి మంచి చెప్పుకోవాలి. లోకం ఎటువంటి దైనా సరే, ఆపవాదు తొలగించు కోవడమే మానవుడి ముఖ్య ధర్మ౦ అన్నాడు. ఇలా అన్న రాముని మాటలను తమ్ములెవారు ఒప్పుకోలేదు.
ఆఖరికి లక్ష్మణుడు తప్పని సరై తీసుకు వెళ్ళి అడవిలో దించాడు. అడవిలో విడుచుటకు కారణమూ సీత దేవి అడుగగా సీత దేవి చెప్పుటకు భాద పడ్డ లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో ఆమెకు విషయమును చెప్పాడు. వెంటనే సీత కన్నీరు మున్నిరుగా విలపించింది.
పిదప అత్త గార్లకు, అయోధ్య వసులందరికి తన వందనాలు తెలుప మంది. ఈ సీత ప్రతి జన్మలో నూ శ్రీ రాముని భార్య గనే ఉంటుంది. అని శ్రీ రామునికి చెప్పమని లక్ష్మణునితో చెప్పి మని లక్ష్మణునితో చెప్పి దుఖిస్తూ ఆమె నేలపై పది పోయింది. కొంత సేపటికి ఆ దిక్కుగా వచ్చిన వాల్మీకి మహర్షి 'నేలపై పది వున్నా సీతను చూచి, మంత్ర జాలం చల్లి, మేలు కొలిపెను. ఆమె దుఖిస్తున్న విధం తెలుసుకొని, తన ఆశ్రమంలో నివసించమని, ఆశ్ర మమ౦తట శ్రీ రామ నామము వెళ్ళి విరుస్తుందని చెప్పి, తన ఆశ్రమంలో స్థానం కల్పించెను. అప్పటికి ఇంకా అయన రామాయణాన్ని వ్రాస్తున్నారు. 'లవకుశ' జననం ఆ వాల్మీకి ఆశ్రమంలోనే జరిగింది.
సీతా మాత వాల్మీకి ఆశ్రమంలోనే సేద దీర్చు కుంటున్నది. ఒక శుభ ముహూర్తాన లవకుశ జననం జరిగింది. లవకుశులకు శ్రీ వాల్మీకి మహర్షి శ్రీ రామాయణ కథలను గానం చేయుటకు వీలుగా నేర్పించెను.
లవకుశులు తల్లి పైన, తాత పైన అభిమానం పెంచుకున్నారు. వాల్మీకి మహర్షి దగ్గర అన్ని విద్యలు నేర్చారు. శ్రీ రామాయణానికి వల్మికే ఆదికవి. శ్రీ రామ చంద్రుడు 'ఆశ్వ మేథ యాగం'చేయుటకు 'వశిష్ట మహర్షి' సలహా ఇచ్చెను. భార్య లేకుండా యజ్ఞం చేయుట దోషం కావున సీతా మాత బంగారు ప్రతిమను పెట్టి యజ్ఞం నిర్వహించు నట్లుగా ఏర్పాటు చేసెను. పిదప అశ్వాన్ని వదలెను. శ్రీ రాముడు చంద్రుడు ఆశ్వ మేథ యాగం నిర్వహించి నాడన్న వార్త లవకుశలకు తెలిసింది. రామునితో నే యుద్ధం చేయుటకు వారి సిద్దమైనారు. అశ్వాన్ని కట్టి వేసినారు. శ్రీ రామునితో యుద్ధం చేసి, తండ్రికి తగిన కొడుకులు, విరులు అనిపించుకున్నారు.
అపుడు సీతా శ్రీ రాముని దర్శించి ఈయన మీ తండ్రిగారని చెప్పగా, తండ్రి అని తెలియక యుద్దమునకు సిద్ద పడ్డామని, క్షమించా మని లవకుశులు శ్రీ రాముని కోరిరి. శ్రీ రాముడు విరు విరులుగా నిరూపించు కున్నారని ఆశీర్వ దించెను. వెంటనే సీతామాత శ్రీ రాముని పాదాలపై బడి, తను పుట్టి నందుకు, రఘు వంశం మెట్టి నందుకు తన జన్మ ధన్య మైనదని భావించి తన తల్లి అయిన భూ మాటను పిలువగా, భూమిని చిల్చు కొని భూ దేవి ప్రత్యక్ష మయ్యెను. సీతా ఆమె తెచ్చిన సింహాసనం పై కూర్చోన గా భూ దేవి ఆమెతో సహా పుడమిలో కలిసి పోయెను. శ్రీ రాముని పథమ పుత్రుడైన కుశునికి రాజ్య భారమును అప్పగించి శ్రీ రాముడు తన అవతమును చాలించెను.
శ్రీ రాముడు, లవకుశులు రోది స్తుండగా వాల్మీకి మహర్షి వారిని ఓదార్చెను. కొంత కాలానికి ఒకనాడు రామాయణ చివరి భాగంలో కల పురుషుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి రాముని చెంతకు గోప్యమైన విషయాలను ముచ్చటించ డానికి వస్తాడు. రామునితో ఓ షరతు అంగీ కరింప చేస్తాడు. 'మనము ఓ రెండు విషయాల గురించే చర్చించ వలసివుంది. మనం మాట్లాడే సమయంలో అచటికి ఎవరూ రాకూడదు . ఒక వేళ ఎవరైనా వస్తే వానికి మృత్యు దండనని విధించాలి ' ఈ నిబంధనకు అంగీకరించిన రాముడు, లక్ష్మణుని గుమ్మం వద్ద నిల్చో బెడ్తడు. అంతలో దుర్వాసముని అచ్చటకు వచ్చి, నాకు రామునితో పని వుందని, కలవాలని ' చెప్పగా లక్ష్మణుడు లోనికి ప్రవేశానికి నిరాకరించాడు .
దుర్వాసుడు రుద్ర రూపాన్ని ధరించి' నన్ను అడ్డ గిస్తే అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్స్తాను. అని హెచ్చరించాడు.
లక్ష్మణుడు ధర్మ సంకటంలో పడి, అందరూ, నాశన మయ్యే బదులు తనోక్కడు నశించి పోవటం ఉత్తమమని భావించి లక్ష్మణుడు రాముని చెంతకు వెళ్ళ సాగాడు. అదే సమయంలో రాముడు కల పురుషునీతో రహస్యంగా మాట్లాడి ఇవతలికి వస్స్తున్నాడు. లక్ష్మణుడు నిబంధనను ఉల్లంఘించి లోనికి అడుగు పెట్టాడు. మరి కొంచెం సమయం గది పెస్తే లక్ష్మణుడు లోనికి వెళ్ళ వలసిన అవసరం ఉండేది కాదు. వారి మాటలు పూర్తి అయి రాముడు బయటకు వచ్చు చుండెను. వారి రహస్య మాటలను ఏ మాత్రం ఆలకించన ప్పటికి లోనికి వెళ్ళడం అనే అపరాధం సంభవించింది. ఇది వాస్తవానికి అపరాధం కాకపోయిన ప్పటికి నియమావళి ప్రకారం నేరంగా భావించారు. సమాజంలో ప్రతి వ్యక్తి మహో జ్వలమైన చరిత్ర సంపన్నుడైన లక్ష్మణునికి మృత్యు దండన విధించ వలసిందే' అని వివరించాడు. న్యాయ సంస్థ ఆజ్ఞను సారం నీవు శిక్షను శిర సావహించ వలసిందే ' అంటదు రాముడు లక్ష్మణునితో మృత్యు దండ నాన్ని స్వయంగా శ్రీ రామ చంద్రుడే విధించడం నా సౌభాగ్యం అంటూ లక్ష్మణుడు సమాధాన మిచ్చి, పరుగులు తీస్తూ సరయు నదిలో జల సమాధి ని పొందుతాడు. అతన్ని శ్రీ రామ చంద్రుడు వెంబడిస్తాడు. దీనితో రామాయణం సమాప్త మౌతుంది.
ప్రభుత్వానికి సలహా లివ్వటమే కాక, సలహాలను ప్రభుత్వం ఆచరించానిచో హెచ్చ రించేది. కూడా, ప్రభుత్వాన్ని అదుపులో పెట్టేది ఋషి మండలం. అన్నిటికంటె ఉన్నత స్థానంలో నున్నది రుషి మండలం, మధ్యలో నున్నది. ప్రభుత్వ సంస్థ, దానికి౦ద నున్నది. మంత్రి మండలం. కానీ ఆ ఋషి మండలమే ఏదేని పోరా పాటు చేస్తే? దీనికి కూడా రామాయణంలో సమాధానం వుంది. అందు వల్లనే నేటికి ప్రపంచం రాజ్యాన్ని కంక్షి స్తుంది , తలుస్తుంది.
లోకోత్తర జీవితాన్ని దర్శి౦ప జేయడానికి, ఆధ్యాత్మిక, లౌకిక ప్రేరణను జనులలో కల్గించా దానికి, అన్ని కాలాల్లో మార్గ దర్శ కత్వం లభిస్తూ౦ డాలనే సదు ద్దేశముతో మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ' శృ తం హరతి పాపాని ' శ్రవణం తో మన పాపాలు తొలిగి పోతాయి అనే విశ్వాసంతో రామాయణాన్ని తిరగ వేస్తే లాభం లేదు. శ్రీ రాముని గుణాల్ని మనం ఆకళించుకొని, జిర్ణింప జేసుకొని, నిత్య జీవితంలో అలా వ్యవహరించాలి.
'కర్తవ్యం " ప్రేమ 'యీ రెంటి మధ్య వివాదం తలెత్త గానే శ్రీ రాముడు బుద్దిని ఆశ్రయించి కర్తవ్య పథము పై ముందుకు సాగాడు. లక్ష్మణుడు అతి చరిత్ర సంపన్నుడైన వ్యక్తి సీతాదేవి నగలను గుర్తించే ప్రస్తావన వచ్చినపుడు ' నాహం జానామి కేయూర నాహం జానామి కుండలే, నుపురే త్యేవ జానామి నిత్యం పాదాభి వందనత్ ' కేయురములు నేనెర గను. కుండలములను నేనెరగను. నేను నిత్యం పాదాభి వందనం చేస్తాను. కావున అందెలు మాత్రం గుర్తు పట్టా గలను అని చెబుతాడు.లక్ష్మణుడు.
మనం ముగ్గురు భరతుల్ని పూజించాలి. ఆ ముగ్గురు రామాయణంలో ని భరతుడు, మహా భారతంలోని దుష్యంత రాజు పుత్రుడైన భరతుడు, భాగవతంలోని జడ భరతుడు. శ్రీ రాముని గుణాల్ని జీవితంలో అలవర్చుకున్న ప్పుడే రామ రాజ్యం. లేకపోతే రావణ రాజ్యం.