హోళీ |
అన్న ఆజ్ఞతో బాలుడన్న ఎలాంటి కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టికునేవుండే ఆ పరమాత్ముడు మౌనంగా వుండగలడా? ఆ చిద్విలాసమూర్తి వెంటనే ప్రహ్లాదుడిని మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటలనుంచి బయటకువచ్చాడు.
హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీకో సందేహం రావచ్చు. హోలికకు వరముంది కదా అని. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వర ప్రభావముంటుంది. బాలకుడైన ప్రహ్లాదుడిని తీసుకొని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించకుండా పోయింది.
హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తారు. చిన్ని కృష్ణుడు బాల్యంలో బృందావనం, గోకులంలో చేసిన కార్యాలను గుర్తు పెట్టుకునేందుకూ ఈ పర్వదినాన్ని రంగురంగులతో జరుపుకొంటారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మథుడిని పరమేశ్వరుడు భస్మం చేస్తాడు. అందుకనే హోలీ రోజే కామదహనం కూడా నిర్వహించడం సంప్రదాయం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి