family |
అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెల్లెలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు?
పూర్వం కొడుకుని సరయినదారిలో పెట్టకపోతే, సంవత్సరకాలం పాటు అత్తగారింటికి పంపేవారు. అంటే అప్పట్లో అది శిక్షతో సమానము. తన వారి మీద అలిగి అత్తగారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను, సాంఘిక స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. అలాగే చెడిపోయి చేల్లెలింటికి వెళ్ళరాదు.
ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం, ధనమూ ఆశిస్తుంది. అటువంటి చెల్లిలి ఇంటికెళ్ళి ఆ మూడు ఆమె నుంచి ఆశించటం వల్ల చులకనవుతారు. కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తగారింటిలో ఉన్న చెల్లి కూడా!