తమకము అర్థం ఏమిటి?
తమకం(ము) అంటే ఆతురత /ఆత్రుత, కుతూహలం, ఉబలాటం, ఆబ గా చూచుట, ఎల్లలు లేని/కళ్ళెం వేయలేని కోరిక/కామం, ఆరాటం, కుతి, తుత్త…అనే పలు అర్థాలలో చూడవచ్చు.
తమకం తో నిండిన కనులు, తమకం తో బరువెక్కిన తనువులు అనే వాడుకలలో చూడొచ్చు.పెళ్ళి పీటలమీద కూర్చున్న పెండ్లి కొడుకు / కూతురు మధ్యలో ఉన్న తెర ఎప్పుడెప్పుడు తొలగుతుందా అనే వివరణ అన్నమాచార్యుల వర్ణము లో చూడవచ్చు ..
అదె శ్రీవేంకటపతి అలమేలు మంగయును:
కదిసివున్నారు తమకమున బెండ్లికిని ..
కదిసివున్నారు = ఒక్కటవ్వడానికి వేచియున్నవారు
తమకమున = తమకంతో, ఆతురతతో, ఆబ గా.చూచుట, తొందరపడుతూ
బెండ్లికిని = పెళ్ళికై