అరటి పూజ |
మాంగళ్య దోషం | Mangalya Dosham
మాంగళ్య దోషం తొలగిపోవాలంటే.. ఏ పూజ చేయాలి?
ఈ వివాహ బంధం ద్వారా బ్రతికినంత కాలం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకోసమే పెళ్లివిషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి వివాహ కార్యక్రమాలను జరిపిస్తారు.ముఖ్యంగా పెళ్లి విషయంలో జాతకాలు ఎంతో ముఖ్యమైనవి. అబ్బాయి అమ్మాయి జాతకం సక్రమంగా ఉన్నప్పుడే వారి పెళ్లికి పెద్దలు అనుమతి తెలుపుతారు.ఇలా జాతకాలను చూసి పెళ్లి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విధంగా పెళ్లి తర్వాత అందరి జీవితాలు సక్రమంగా ఉంటాయని చెప్పలేము.కొందరి సంసార జీవితంలో సమస్యలు ఏర్పడితే మరికొందరికి సంతాన విషయంలో సమస్యలు ఏర్పడతాయి.
అరటి పూజ |
ఈ విధమైనటువంటి సమస్యలు ఏర్పడే వారికి మాంగళ్య దోషం ఉంటుందని, ఆ దోషం కారణంగానే ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ విధమైనటువంటి మాంగళ్య దోషం తొలగిపోవాలంటే తప్పనిసరిగా కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. సంతానం కలగాలన్న మాంగల్య దోషం తొలగిపోవాలన్నా అరటి చెట్టుకు పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అరటి చెట్టును దైవ సమానంగా భావిస్తారు.
ఈ క్రమంలోనే అరటి చెట్టును పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. మాంగల్య దోషం ఉన్నవారు ఒక మంచి రోజు ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి అరటి చెట్టుకు పూజ చేయాలి. అరటి చెట్టు కాండం మొత్తం కడిగి పసుపు రాసి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. అలంకరణ అనంతరం కొబ్బరినూనెతో దీపారాధన చేసి నైవేద్యంగా పెసరపప్పు, బెల్లం సమర్పించి పూజించాలి.
ఇలా అరటి చెట్టుకు పూజ చేసేవారు ఉపవాసంతో పూజ చేయాలి. ఈ విధంగా అరటి పూజ అనంతరం మధ్యాహ్నం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి తాంబూలంలో ఐదు అరటిపళ్లను దక్షిణం గా ఇవ్వాలి. ఇలా ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత సాయంత్రం చంద్రుని దర్శనం అనంతరం ఉపవాస దీక్షను విరమించి ఉప్పులేని అన్నం తినాలి.