Ganesha |
చాలా ఆలయాల్లో లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకున్న వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఇది శాస్త్ర సమ్మతమేనా? విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని వినాయకుడు తొడపై కూర్చోపెట్టుకోవడం ఎంతవరకూ సమంజసం?
దేవతల భార్య అనే విషయం ముందు అర్థం చేసుకోండి. దేవతల శక్తినే మనం భార్యగా చూస్తున్నాం. విష్ణు శక్తి పేరు లక్ష్మి - అందుకే నారాయణుడు లక్ష్మి నారాయణడు అనే పేరు గాంచాడు.
పరమాత్మ ఈశ్వరుడు అతే ఆ శక్తి ఈశ్వరి, ఇలా ప్రతి దేవతకి శక్తి భార్యగా ఉంటుంది. అలాగే గణపతి యొక్క శక్తి పేరు " వల్లభ దేవి " ఈమె మరో పేరు లక్ష్మి కాబట్టే వల్లభ గణపతి లేదా లక్ష్మి గణపతి అని పేరు వచ్చింది.
ఇంకొక ప్రధాన విషయం విద్యా గణపతి అంటే విద్యా యొక్క భర్త అని గ్రహించకుండా విద్యా నీ ఇచ్చే గణపతి గా అర్థం చేసుకోవాలి అలాగే లక్ష్మి గణపతి అంటే లక్ష్మి కటాక్షం కురిపించే గణపతి అని కూడా అర్థం చేసుకోవాలి.
కాబట్టి విష్ణు పత్నీ ఆయన తొడ మెడ కూర్చొంది అనే అలోచన చాలా తప్పు. ఆయన తొడ మీద ఉన్న అమ్మవారి పేరు కూడా లక్ష్మి "వల్లభ దేవి" - ఈమె గణపతి యొక్క శక్తి మరియు భార్య కూడా . కాబట్టి ఆగమ శాస్త్రం లో వీటికి సంబందించిన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొంత అర్థం చేసుకుంటే ఇలాంటి సందేహాలు తొలగుతాయి.
గురువుల అనుగ్రహం వలన తెలిసిన వరకు చెప్పాను ఇంకా మీకు తెలుసుకోవాలి అనుకుంటే సరైన గురువుని ఆశ్రయించి తెలుసుకోండి.
...కామేశ్వర శాస్త్రి