శివ భగవానుడు |
దేవతార్చన లో పుష్ప విలాసం
పరమశివుడు అభిషేక ప్రియుడైతే, శ్రీమహావిష్ణువు అలంకార ప్రియుడు. అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో భక్తుల కోర్కెలను తీచే కల్పతరువుగా తిరుమల వేంకటాద్రిపై కొలువై ఉన్నాడు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరునికి పుష్పాలను సమర్పించే తీరు ఓ విశిష్టతతో కూడుకున్నదనిపిస్తుంటుంది. శ్రీవారి అలంకరణకు వినియోగించే పుష్పహారాల శైలి అత్యద్భుతం. ముక్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్పస్వామి అలంకరన విషయంలో తిరుమల యావత్తూ పుష్పమాలంకృతమవడం, అడుగడుగునా భక్తులను అనందపార్వశంలో ముంచెత్తుతుంటుంది.
‘త్రివర్గ సాధనం పుష్పం – పుష్టి – శ్రీ – స్వర్గ మోక్షదం’
అని అన్నారు. అంటే పువ్వులు పుష్టిని (శక్తిని), సంపదలని స్వర్గాన్ని కూడ ప్రసాదిస్తాయన్నమాట.
‘పుష్పైర్దేవా: ప్రసీదంతి ‘
పుష్పాల ద్వారా దేవతలు ప్రీతి చెంది మనిషి కోరుకున్నవి లభింపజేస్తారు. అందుకే ప్రతి పూజలో పుష్పాలుంటాయి.
పత్రం పుష్పం తోయం మోమే బక్త్యా ప్రహచ్చతి
తదహం భక్త్యు పహృత మశ్నామి పయతాత్మన: ||
అని శ్రీకృష్ణ పరమాత భగవద్గీతలో చెప్పాడు కదా! అంటే పరిశుద్ధాంత: కరుణుడైన భక్తుడు ప్రీతిపూర్వకంగా ఆకునుగానీ, పువ్వునుగానీ,పండునుగానీ, చివరకు కొంచెం జలాన్నిగానీ ఇస్తే, దానినే నేను ఆరగిస్తున్నాను అని పరమాత్మ చెప్పాడు. పువ్వులలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి ధనిక పేద తారతమ్యం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. భగవంతునికి అర్పించే పూజాద్రవ్యాలలో పువ్వులకు ఓక విశిష్టస్థానం వుంది. ఆ పరమాత్మకు విదురుడు, ద్రౌపది, పత్రాన్ని అందించి కృతార్ఠులవ్వగా, గజేంద్రుడు పుష్పాన్ని, శబరి ఫలాన్ని, రంతిదేవుడు తోయమును భక్తితో సమర్పించుకుని ధన్యులయ్యారు.
నిజమైన పుష్పార్చన
అహింస ప్రథమ పుష్పం, పుష్ప నింద్రియ నిగ్రహ:
సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశిష్యతే
ద్యానపుష్పత్తప: పుష్పం, జ్ఞాన పుష్పంతు స్ప్తమం
సత్యం చై నాషంఅమం పష్ప, మే భిస్తుష్యతి కేశన: ||
అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, క్షమ, ధ్యానం, తపస్సు, జ్ఞానం, సత్యం అనే ఎనిమిది సద్గుణాలతో కూడిన నిజమైన పుష్పాలతో భగవంతుని అర్చించాలని భావం. ఈ సద్గుణాలు లేకుండా లక్ష పుష్పార్చన చేసినప్పటికీ ఫలితం శూన్యం.
ఏ తదేవ పరం ధ్యాన, పూజైషేక పరమతా
యదనారత మంతస్త, మృద్ చినాత్మ వేదనం అని ‘యోగ వాశిష్టం ‘ చెబుతోంది. ఈ సద్గుణాలు లేకుండా పుష్పార్చన, పూజలు చేయడం మట్టి కంటె వ్యర్థమే. అయితే పుష్పాలు లేకుండా చేసే పూజ సంపూర్ణమయిన పూజ అనిపించుకోదు.
పూజకు పుష్పం
పుణ్య సంవర్థనాచ్ఛాపి, పాపౌఘ పరిహారత: ||
పుష్కార్థక ప్రదానచ్ఛ, పుష్ప మిత్యభిదీయతే – అని ‘కులార్ణవ తంత్రం ‘ వక్కాణిస్తోంది. అంటెఏ పాపపరిహారానికి, పుణ్య సంవర్థనానికి, ఐశ్వర్యప్రాప్తికి పుష్పపూజ తప్పనిసరి అని దీనర్థం. పూజలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు చేసినప్పటికీ పువ్వులు లేకపోతే, ఆ పూజ ప్రయోజనం శూన్యమే .
పుష్పైర్దేవా: ప్రసీదంత్, పుష్పే దేవాశ్చ సంస్ఠితా:
న రత్నే: న సువర్నేవ, న విత్తే న చ భూరిణా
తథా ప్రసాద మాయాని, యథా పుష్పై జనార్థన: ||
విష్ణు ధర్మోత్తర పురాణం, స్కాందపురాణం, కొన్ని తంత్ర గ్రంథాలలో ఇదే విధంగా చెప్పబడింది.
పుష్ప సేకరణ విధి
స్నాత్వామధ్యాహ్న సమయే నఛింద్యాత్ కుసుమంపర:
దేవతాస్తన్న గృహణంతి, భస్మీ భవతి కాష్టవత్ ||
మధ్యాహ్నం తరువాత పువ్వులనుకోస్తే, ఆ పువ్వులను దేవతలు స్వీకరించరు. అటువంటి పుష్పార్చన కాల్చిన కట్టె కంటే అధ్వాన్నమవుతుంది.
పువ్వులను కోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.
నమస్తే కుసుమా ధారే, నమసే కమలాశాఏ
పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవజ్ఞయా ||
పూజకు పనికిరాని పువ్వులు
అక్రితాన్య ప్రదాత్తాని, చౌర్య లబ్దాని యానిచ
శూద్రా హృతాని నా భూమౌ, పతితా తదైవ చ
పరండార్కచ పత్రేషు, చా హృతానికరే తథా
పటా హృతని యాన్స్య, వ్ర్ణయేత్తాని యత్న తపి ||
పురుగులు పట్టిన పువ్వులను, సగంగా చీలిపోయిన వాటినీ, ముక్కలుగా నలిగిపోయిన పూవులను, బాగా వడలిపోయిన పూవులను, ఎలుకలు కొరికి పువ్వులను ఎవరి దగ్గరైనా అడిగి తెచ్చిన పువ్వులను, కాళ్ళకు తగిలిన పుష్పాలను, వేరే దేవాలయాలలో కింద పడిన పూవులను పూజకు ఉపయోగించకూడదని అర్థం.
పూజలో పుష్పాలు
పుష్పం నా యది నా పాత్రం
ఫలం నేష్ట మథో ముఖం
దు:ఖదం తత్సమాఖ్యాతం
యథోత్సవం తహర్పణం
లక్ష్మీ సరస్వతి పుష్పేషు లక్ష్మీ
ర్వ సతి పుష్కరే
ప్ష్పాంజతా నతోద్దోష్:
బిల్వ పత్ర మథోముఖం ||
పుష్పాలలో లక్ష్మీదేవి నివస్తిస్తుంది. అందువల్ల భగవంతునికి అర్పించేప్పుడు పువ్వులు క్రింది ముఖభాగంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. అయితే పుష్పాంజలి సమర్పించే సమయంలో ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. తులసీ దళాలకు, బిల్వ పత్రాలకు ఈ విధానం వర్తించదు. ఏ విధంగానైనా ఆ పుష్పాలను లభించకపోయి నట్లయితే శ్రీహరి పూజకు తులసీ దళాలను సమర్పించుకోవడమే ఉత్తమమైన పద్ధతి అని వృద్ధ గౌతమ స్మృతి చెబుతోంది. పరమేశ్వరునికి పసుపురంగు దేవకాంచనం, విష్ణువుకు నల్లకలువ, అమ్మవారికి మల్లి,మందారం, లలితా పరమేశ్వరీ దేవికి చంపక, కుంద, కేసర, శిరీష పుష్పాలంటే ఇష్టమని చెప్పబడింది. లలితాపరమేశ్వరి ఈ పుష్పాలనే తన శిరోజాలలో అలంకరించుకుంటుందట. అలాగే ఆ తల్లి కదంబ వనాలలో సంచరిస్తూ కదంబపువ్వులను అలంకరించుకుంటుందట.
శివ వివర్జయత్ కందం, ఉన్మత్తంచ హరే తథా
దేవీ నామర్క మందారౌ, సూర్యస్య తగరం తథా
కేతకీ భావ పుష్పైశ్చ, నైవార్చ శంకర స్తథా
గణేశం తులసీ పత్రై, దుర్గాం నైనతు దూర్వయా ||
అని పద్మపురణాం చెబుతోంది. సాధారణంగా శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేల, తామర, శంఖపుష్పం, నాగలింగం పువ్వులను ఉపయోగించడం జరుగుతుంది కానీ, శివ పూజకు మొగలిపువ్వులను, తీగమల్లెపువ్వులను, విష్ణుపూజకు ఉమ్మెత్తుపువ్వులను, స్త్రీదేవతల పూజకు జిల్లేడుపూలను, పారిజాతాలను దుర్వారాలను వాడరు. సూర్యునిపూజకు నందివర్థనాలను, విఘ్నేశ్వరపూజకు తులసీదళాలను ఉపయోగించకూడదు.
అలాగే విప్పపూలు, అశోకపుష్పాలు, గోరింటపువ్వులు, వేపపువ్వులు, విష్ణుక్రాంతపూలు, వాయిలిపువ్వులు, తుమ్మపూలు, పెద్దగన్నేరుపూలు, మందారపూలు, మొగ్గమల్లె, దత్తూరపూవ్వులు, నందివర్థనాలు, అవిశ, డొమ్మడోలు పువ్వులు శ్రీహరిపుజకు పనికిరావు. భాద్రపద మాసంలో మొగలిపువ్వులను పూజకు ఉపయోగించ రాదని చెప్పబడింది.
కొన్ని పుష్పాల ప్రత్యేకత
పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది.
సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ, మత్ర్పియం నాస్తి పాండవ
మేరుతుల్య సువర్ణాని, దత్త్వా భవతియత్ఫలం
ఏకేన స్వర్ణ పుష్పేన, హరిం సంపూజ్య తత్ఫలం
సువర్ణ కురుమైర్దివ్యై, యైర్నధితో హరి:
రత్న హీనై: సువర్ణాద్యై:, సభవేజ్జన్మ జన్మని ||
సంపంగి పూలతో పూజచేయనివాడు మరుజన్మలో సువర్ణ రత్నాలా హీనుడవుతాడట. ఆయుష్షుకోసం దుర్వారపూలతో, సంతానంకోసం దత్తొరపూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలిపూవులు, ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు, శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిరమాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా చెట్టునుంచి ఆరోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాము. కానీ, కొన్ని పుష్పాలను కొన్ని రోజులపాటు నిలువ ఉంచిన తరువాత కూడ్ పూజకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు కలువపూలను ఐదు రోజులవరకు, కమలాలను పదకొండు రోజులవరకు నిలువ ఉంచినప్పటికి పూజకు వినియొగించవచ్చని ‘భవిష్యపురాణం’ పేర్కొంటోంది. బిల్వ పర్తాలాను, తులసీదళాలను, అవిశపూలను, వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు చిద్రమైనప్పటికీ పూజకు ఉపయొగించవచ్చని ‘మేరుతంత్రం’ చెబుతోంది.
పువ్వులు ప్రత్యేకమైన కంపనాలను కలుగజేస్తాయి. ఆ కంపనాలు రంగుతో పాటు అతి చక్కని శాంతిని మనసుకు కలిగిస్తాయి. అందుకే పువ్వులకు అంతటి ప్రాముఖ్యత. కొన్ని పువ్వుల కారణంగా యుధ్ధాలు కూడ జరిగాయి. పారిజాత పుష్పం కోసం సత్యభామ పంతం పట్టగా, అందుకోసం, శ్రీకృష్ణుడు ఇంద్రునితో యుధ్ధానికి దిగాల్సి వచ్చింది. సౌగంధిక పుష్పంపై మోజుపడ్డ ద్రౌపది కోసం భీముడు, కుబేరుని అనుచరులతో తలపడ్డాడు కదా! అందుకే పువ్వులకు అంతటి ప్రాముఖ్యత.
nicw
రిప్లయితొలగించండి