గరుడ పురాణము |
గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా? చదవకూడదా?
వ్యాసమహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గర్తుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి.
దీనిలో ప్రేతకల్పము ఉండటంవలన ఇంట్లో చదువవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాల మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితము. పురాణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి.