రథం ముగ్గు |
Spiritual reason behind Ratham Muggu on Kanuma festival day
ప్రతి ఏడు కనుమ రోజున రథం ముగ్గుని తప్పనిసరిగా వేయడం వెనుక ఆధ్యాత్మిక కారణం ఏమిటో తెలుసుకుందాం!
హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండగకు విశిష్ట స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని భోగి, సంక్రాంతి, కనుమగా జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ముక్కనుమగా నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మూడవ రోజు కనుమను “పశువుల” పండుగ అని కూడా అంటారు. తమకు పాడిపంటలను సమృద్ధిగా అందించే పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ.. రైతు కుటుంబ సభ్యులు జరుపుకునే పండుగ. ఈరోజు తమతో పాటు పశువులు, పక్షులకు కూడా ఆహారం అందాలని.. ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇప్పటికీ ఈ పద్దతిని పల్లెల్లో కొందరు పాటిస్తూనే ఉన్నారు. అంతేకాదు ధనుర్మాసం నెల రోజుల పాటు వివిధ రంగ వల్లులతో తమ ఇంటి ముంగిటను అలంకరించే మహిళలు.. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పని సరిగా వేస్తారు.. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతారు.
రథం ముగ్గు విశిష్టత:
ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని .. ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే.. ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో.. వచ్చిన “సంక్రాంతి” పురుషుడు శుభాలని కలిగించాలని కోరుతూ.. ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి.. వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజచేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకూ సాగనంపుతారు.
ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక కధనం:
బలిచక్రవర్తి.. పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులూ గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తరవాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గువేస్తారని ఓ కథ