దుర్గా పూజ |
మాఘ సప్తమి నోము
పూర్వ కాలం నాటి మాట .ఆ రోజులలో ఒక అగ్రహారం .అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే .ఒక కుటుంబాన భార్య -భర్త .వారికి సిరి సంపదలకు తిరుగులేదు .పాడి పంటలకు లోటు లేదు. అన్నీ ఉన్నాయి . కాని అనుభవించేందుకు సంతానం లేదు. సంతానం కోసం ఎవరేమి చెబితే అది చేయ సాగారు. అయినా ఫలితం శూన్యం. వ్రతాలు చేశారు .తీర్ధ యాత్రలు సేవించేరు .పాపం ఫలితం లేదు. ఒకనాడు వారింటికి ఒక పండితుడు వచ్చాడు . వచ్చిన పండితుని ఆదరించి భోజనం చేసి వెళ్ళమన్నారు. విని ఆయన -అయ్యా ! అందుకు అభ్యంతరం లేదు కాని మీకు సంతానం ఎందరు ? అని అడిగాడు. అందుకు ఆ దంపతులు మౌనం వహించగా గ్రహించిన ఆ పండితుడు విచారించకండి . చివరి సారిగా చెప్పిన ఈ వ్రతం కూడా చేయండి . తప్పక మీకు సంతానం కలుగుతుంది . అని వ్రతం గురించి వివరించి చెప్పి వెళ్ళిపోయాడు.
ఏ వ్రత ఫల మెట్టిదో నని వారు ఆ పండితుడు చెప్పిన మాఘ సప్తమీ వ్రతం నోచారు. ఆచరించారు. వ్రత ఫలితంగా సంతానం పొందారు. ఇహమందు సుఖపడి పరమందు మోక్ష మందారు.
ఇక ఉద్యాపన వినండి .చక్కని నిమ్మ మొక్క వేరుతో గౌరీ దేవిని తయారు చేయించండి . తయారు చేసిన వారిని తగు విధంగా సత్కరించండి . తయారు చేసిన గౌరీ దేవిని ఇంటికి తీసుకుని రండి . రధ సప్తమి నాడు తెల్లవారు జామున లేవండి . స్నానం చేయండి . దేముడి గది శుబ్రం చేసుకుని అడ్డెడు తవ్వెడు బియ్యం పోయండి . అక్కడ గౌరీ దేవిని ఉంచండి . ప్రతిదినం పూజించండి . అక్షతలు శిరసున జల్లుకోండి. సంవత్సరం పూర్తికాగానే రధ సప్తమి నాడు నిమ్మ పండ్లు, నల్లపూసల పోగు ,పసుపు, కుంకుమ సిద్దం చేసుకోండి .13 మంది పేరంటాళ్ళను పిలిచి వాయన మీయండి . ఫలం సిద్దించ గలదు.