Magha Gauri |
మాఘ గౌరీ నోము
పూర్వ కాలం నాటి మాట . ఆ కాలాన ఒక గ్రామం .అది అగ్రహారం .ఆ అగ్రహారాన బ్రాహ్మణ దంపతులు జీవిస్తున్నారు. వారికి భూలక్ష్మి అను ఒక కుమార్తె . యుక్త వయసు రాగానే ఆమెకు తల్లి దండ్రులు వివాహం చేశారు . పాపం ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది .అంత తల్లి దండ్రులు ఆమెను వెంట బెట్టుకుని తీర్ధ యాత్రలు చేయ సాగారు.
ఒకనాడు వారు ఒక ప్రదేశాన ఆగారు. అక్కడ కొందరు స్త్రీలు తామున్న ప్రదేశమును శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి దీపములు వెలిగిస్తున్నారు. అది చూసి తల్లి దండ్రులు ఆ వితంతువుని అక్కడ ఆపారు. వారి మువ్వురుని ఆ దీపాలు వెలిగించే వారిలో గౌరీ దేవి దగ్గరకు పిలిచి -ఏమమ్మా ! బాల్య మందే వైధవ్యం ప్రాప్తించి నదా ! చింతించకు బాధపడకు నే చెప్పినట్లు చేయి .నదిలోని ఇసుకను 5 కుప్పలుగా చేయి వరుసగా పోయి అని పలికెను. ఆమె అట్లే చేసెను .చిత్రం ! ఆ అయిదు కుప్పలు వరుసగా పసుపు, కుంకుమ , కొబ్బరి ,బెల్లము, జీలకర్ర గా మారిపోయాయి. అంత గౌరీ దేవి మాఘ గౌరీ దేవి నోము విధానమును వివరించి చెప్పింది. విధి విధానం తెలిసికొని బాల వితంతువు మాఘ గౌరీ నోము నోచింది .ఆ నోము ఫలంగా మరణించిన తన భర్త బ్రతికి బయట పడ్డాడు.
ఇక ఉద్యాపన - ఈ వ్రతమునకు మాఘమాసం మంచిది .నెల అంతయూ నదీ తీరానికి పోవలయును. .పిండి, పసుపు, కుంకుమలతో, ఐదేసి పద్మములు పెట్టవలెను .అక్కడ పసుపుతో గౌరీ దేవి ని ప్రతిష్టించి పూజించవలెను. పూజానంతరం నీటిలో కలుపుకొనవలెను. మొదటి సంవత్సరం పసుపు, రెండవ సంవత్సరం కుంకుమ, మూడవ సంవత్సరం కొబ్బరి , నాలుగవ సంవత్సరం బెల్లం, అయిదవ సంవత్సరం జీలకర్ర అయిదుగురుకి వాయన మిచ్చికొనవలెను.
కధ చెప్పుకొని నోము నోచిన ఫలం సిద్దించ గలదు.