శ్రీ గాయత్రీ దేవి
ఒకసారి వశిష్ట మహర్షి విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, 'నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి' అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన,
సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం
చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోకక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్టాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్టాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి నిష్ట,కర్తవ్య పరాయణ తత్వం,బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని'సుదీర్ల జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్టాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్టులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్టాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్టాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్టాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం :
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
గాయత్రీ మంత్రం:
ఓం భూరువన్సువః
తత్సవితుః వరేణీయం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ||
...ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్టించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్టమైనది.
నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ 'ఓం నమో గాయత్రీ మాత్రే” అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రరరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
గాయత్రి మంత్రాక్షరాలు :
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
“న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్ ||
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్టమైనది. 'గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.” ఆది శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24
ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
గాయత్రి మంత్ర విశిష్టతను తెలియజేసే కథ :
పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయబణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుజ్టీ శరణు వేడారు బహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు. అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు” అన్నాడు.
బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొజపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొజ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్ధించ వలసిందిగా సూచించాడు.
బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి,” మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని అడిగాడు.
అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు " అని సమాధాన మిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.
గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.
" నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్వంతకారిణి
నమః కమల వ్యతాక్షి నర్వాధారే నమాన్తుతే
భ్రమరై ర్వేష్టితా యస్త్యాత్ భ్రామరీ యా తత స్స్మృతా
త స్మై దేవ్యై నమా నిత్యం నిత్వమేవ నమో నమః"
అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.
అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి, భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండై, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా తేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్తాస్తాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షప్పది (ఆరు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.
తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.
గాయత్రీ పరాశక్తి స్వరూపము. ఆమెకు ఐదు ముఖాలు!
ఈ ఐదు ముఖాలూ సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. ఐదు శిరస్సులతో, పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది.
గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతఃకాలంలో గాయతిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంతం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోవరిస్తూ ఉంటుంది.
గాయత్రీ మంత్రానికి నాలుగ పాదాలు. ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు. మొదటి మూడు పాదాలూ బుగ్యజుస్సామ వేదాల నుండి, నాలవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి మూడు పాదాల్లో ఐరవైనాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు (టత్రిసంధ్యలలోనూ జపిన్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కన్పిస్తూండగాను, మధ్నాహ్న సంధ్య, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయంసంధ్య సూర్యస్తమయం కంక ముదుగాను అచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంర్యతము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్పలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీవుృక్ష సమీపంలో, నదీతీరాల్తో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం.
"తస్మాత్ సర్వే ద్విజా శ్శాక్తాః న శైవాన చ వైష్ణవాః”
ద్విజులందరూ గాయథీ దేవతారాధనం చేసే వారే కనుక, వారు వెష్టవులైనా, శెవులైనా ముందుగా అందరూ శాక్తేయులు.
గాయత్రీ మంతంలోని ఇరవై నాలుగు అక్షరాలూ సృష్టిలోని ఇరవై నాలుగ తత్తాలకు సంకేతాలు, కర్మేరదియాలు ఐదు. (కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూతావయవాలు) జ్ఞానోందియాలు ఐదు, (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) , పంచప్రాణాలు(వాణ, అవాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు), పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము అనే నాలుగు(అంతఃకరమ చతుషయం) కలసి సృష్టిలోని ఇరవై నాలగు తత్త్వాలు. జీవుడు ఇరవై అయిదవవాడు. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై అయిదు అక్షరాలు అవుతాయి.
ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క బుషి. ఒక్కొక్క చంధస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. ఇరవై నాలుగు రంగులు, ఇరవై నాలుగు శక్తులు, ఇరవైనాలుగు ముద్రలూ గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి, కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి.
ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి, తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రీ హృదయానికి నారాయణుడే బుషి గాయత్రియే చందస్సు. పరాశక్తియే దేవత.
గాయత్రీ దేవతకు ఐదు ముఖాలు. నాలుగు దిక్కుల వైపు నాలుగు, ఐదవది ఊర్ధ్వ్యముఖంగాను ఉంటాయి. ఆమెకు పదిచేతులు. కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను , మిగిలిన ఎనిమిది చేతులలో వరద, అభయ అంకుశ కళాది శక్తులనూ ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి, సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి.
"ఓ జగన్మాతా! నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి, అంతటా వ్యాపించి, భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణివి. త్రిసంధ్యలకూ దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు.
హంసవాహన అయిన బాహ్మీ శక్తి గరుడవాహన అయిన వైష్టవీ శక్తి వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే. భూమిపై బుగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేతాల నుండి, సాత్విక బావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్టా, వరారోహ, నీలగంగా, సంధ్యా, భోగమోక్షదా అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు.
మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది. నీవే. తిలోత వాసులనూ తరింప చేయడానికి నదీరూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ, భువర్హోకంలో సిద్దివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు.
ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ [ప్రాణ నాడులూ నీవే. ఇచ్చా, జాన, క్రియా శక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి.
నీవే. మూలాధారంలోని కుండలినీ శక్తి నీ రూపమే” అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు.
వేదము నుండి ఉద్పువించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి, శధాభకులతో మంత్రానుషానం సాగిస్తే, సర్వశక్తులూ స్వాధీనమవుతాయి. భూత గ్రైత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయ్యత్రియే మాతృక.
గౌతమ మపహర్తి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి, దేశంలో అనావృష్టి వల్ల
కలిగిన కరువు కాటకాలను నివారింప చేశాడు.
"నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే
వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి
భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం
తుర్వాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం”
అని గౌతముడు గాయత్రీ మాతను ప్రార్దించి, ఆమె పరిపూర్ణనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
కనుక గాయత్రీ రూపాన్నీ మనసులో భావించినా, ఆమెను పూజించినా, ఆమె మంత్రాన్ని జపించినా, సర్వారిష్టాలు తొలగి, సకల సంపదలూ లభిస్తాయి. ఈ గాయత్రీ మాత మీ పులిహోర నైవేధ్యంగా పెట్టాలి. గాయత్రీ మంత్ర శక్తిని దుర్వినియోగం పరచి, లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయాాడు. గాయత్రీ మంధత్ర శక్తిని సద్వినియోగం చేసి, గౌతముడు దుర్చిక్షాన్ని తొలగించి, లోకాన్ని ఆదుకుని లోకపూజుడయ్యాడు. కనుక మంథత శక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని, స్వార్దంతో, అహంకారంతో, ఆ శక్తిని దుర్వినియోదం చేయరాదు.
లోకా సమస్తా సుఖినోభవంతు!
శ్రీ మాతే నమః