Sri Ranganatha Swamy Devalayam |
శ్రీ రంగనాథ స్వామి దేవాలయం
అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి 6 కి మీ దూరం లో ఉన్న ఆలూరు కోన దట్టమైన అడవి లో పక్షులు కిలకిలారావాలు మద్య ప్రయాణం చేయాలి. 14 వ శతాబ్దంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు అని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం లో తాటకికి మోక్షనిచ్చిన వైకుంట వాసుడు శ్రీ రాముడి కుల దైవమైన శ్రీ రంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Sri Ranganatha Swamy Devalayam |
విశ్వ మిత్ర మహర్షి ప్రజల సుఖంగా ఉండటానికి ఎన్ని సార్లు యాగాలు చేసిన రాక్షసులు వాటిని ఏదో రకంగా బంగం చేస్తున్నారు .మహర్షి తన దివ్య దృష్టితో విషయాన్నీ తెలుసుకొని దశరథ మహారాజు దగ్గరికి వెళ్లి మలక్షమనులను పంపి లోకాన్ని రక్షించమని అడిగాడు అట . దశరథుడు మొదట సంకోచించినా తరువాత వశిష్ట మహర్షి ధైర్యం చెప్పగా విశావమిత్ర మహా ముని తో అడవికి పంపారట. తిరిగి మహర్షి వారు యాగాన్ని ప్రారంబించారు . అక్కడికి వచ్చిన తటాకి రాక్షసులతో యాగం బంగం చేయాలనీ ప్రయత్నించిన తాటకి ని రాముడు భణం గురి పెట్టి వదలగా అది తాకి నేలకొరిగి మోక్షం లబించింది అని చెబుతారు. అసుర సంహారా దోషపరిహరానికి రాముల వారు అదీ ప్రాంతం లో శివలింగాన్ని ప్రతిస్టించాడు అట శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం. ఇంటి దైవముగా బాసిల్లుతున్నాడు. తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు.
ప్రత్యేక కార్యక్రమాలు :-
ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి.