Namaste |
నమస్కారములు | Namaskaramulu
మన శాస్త్రాలు పెద్దలకు, దేవుడికి ఎలా నమస్కరించాలనే విషయాలన్నీ పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ నియమనిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ నియమాల ప్రకారం పెద్దలకు నమస్కరించేటవ్వుడు వంశపారంపర్య వివరాలను, పేరు గోత్రము వివరాలన్నీ చెబుతూ నమస్కరించాలి. స్త్రీలకు నమస్కరించేటవ్వుడు ఈ వివరాలన్నీ చెప్పనక్క ర్లేదన్నది శాస్త్రవచనం. ఎందుకంటే స్త్రీలకు ఆ విషయాలు భర్త ద్వారా అవగతమవుతాయన్నది శాస్త్రకారుల అభిప్రాయం.
అలాగే పెద్దలు, అగ్రజులు, గృహస్థులకు ఒకే ఒకసారి నమస్కరిస్తే వాలని పెద్దలు చెబుతుంటారు. తమకంటే చిన్నవారి దగ్ధర్నుంచి నమస్కారాలను అందుకున్న పెద్దలు, తప్పుకుండా ఆశీర్వచనాలను ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా నమస్కారాన్ని స్వీకరించిన పెద్దలు, పిల్లలను 'దీర్రాయుష్మాన్ భవ “ 'చిరంజీవ భవ' అని ఆశీర్వదిస్తుండేవారు. అదే సమయంలో ఆశీర్వాచనాలను ఇవ్వని పెద్దలకు నమస్మ్కరించనవసరం లేదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే 'నమస్కారం' వెనుకగల అసలు ఉద్దేశం ఆశీర్వాచనములను అందుకోవడమే తప్ప ఎదుటివ్యక్తిని మానవాతీత వ్యక్తిగా చూడడం కోసం కాదు.
సన్యాసులను, మఠాధిపతులను దర్శించుకునేటప్పుడు అక్కడి నియమాలనను గురించి, నమస్కరించాల్సి ఉంటుంది. అంతే తప్పు, వారి ముందు తమ గోత్ర వివరాలను చెప్పనవసరం లేదు. అలాగే సన్యాసులకు, మఠాధిపతులకు నమస్కరించేటప్పుడు, గతంలో తెలిసో, తెలియకో మనం చేసిన తప్పులను ఒప్పుగించాల్సిన అవసరం లేదు. సన్యాసులను చూసినవుడు 'నమో నారాయణాయ' లేదా 'నమః శివాయ' అని చెప్పాల్సి ఉంటుంది. ప్రతిగా సదరు సన్యాసి కూడ నమో నారాయణాయ లేదా 'నమః శివాయ' అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మన సంస్కృతిలో నమస్కారానికి ఇంత అంతరార్థం ఉంది.
మన భారతీయ సంస్కృతిలో నమస్కరానికి ఎంతో విశిష్టత ఉంది. అసలు నమస్కార ప్రక్రియ మనలోని వినయ భావాన్ని వ్యక్తీకరించడానికి వీర్పడింది. సంస్కృతంలో 'నమస్' అంటే వినయం, భక్తితో కూడిన 'ప్రణామం' అని అర్ధం. “తే" అంబే “మీకు” అని అర్ధం. కాబట్టి "నమస్తే" అంటే, 'మీకు భక్తితో కూడిన 'ప్రణామం' అని అర్థం. అందుకే మనం పెద్దలను చూసినపుడు గౌరవ భావంతో నమస్కరిస్తుంటాం.
అలాగే మనం నిత్య జీవితంలో తెలిసో తెలియక కొన్ని తప్పులను చేస్తుంటాం. ఆ తప్పులను పోగొడ్టుకునేందుకు భగవంతుని ముందు మోకరిల్లి నమస్కరించుతుంటాం. ఎవరైనా, ఏదైనా తప్పు చేసినవుడు అతనితో “పాప పరిహారార్థం దేవుని ముందు ప్రణమిల్లమ'ని మనం చెబుతుంటాం. ఇలా నమస్కార పద్ధతిలో తప్పులను సరిదిద్ధుకోవదం కనిపిస్తుంటుంది.
ఈ సందర్భంగా కొంతమందికి అసలు నమస్కారాన్ని ఎలా చేయాలన్న సందేహం కలుగుతుంటుంది. సాధారణంగా మన సంప్రదాయాల్లో సాష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారాన్ని చూస్తుంటాం. పంచాంగ నమస్కారంలో మన శరీరంలోని ఐదు భాగాలు భూమిని తాకుతాయి. స-ఆష్టాంగ - అంటే శిరస్సు, మొండెము, రెండు భుజములు, రెండు కాళ్ళు, రెండు చేతులను నేలకు ఆనించి నమస్కరించే పద్ధతి. స్త్రీలకు మాత్రం పంచ-అంగ నమస్కారం ఉద్దేశించబడింది.
స్త్రీలు రెండు భుజములు, మొండెము వదిలి మిగతా అయిదు అవయములతో (శిరస్సు, రెండు కాళ్ళు, రెండు చేతులు) నేలను తాకుతూ నమస్కరించాలి. స్త్రీలకు మ్యాతమే ఎందుకు ఇలాంటి నియమం అని ప్రశ్న్శించుకున్నప్పుడు, ఇందువెనుక మన హిందూ ధర్మం స్త్రీ మూర్తి కిచ్చిన గౌరవ ప్రపత్తులను చూసి ఒడలు వులకరిస్తుంటుంది. స్త్రీలకు వంచాంగ నమస్కారం ఉద్దేశించబడింది. మాతృత్వానికి మన సంప్రదాయంలో అంతటి మర్యాద.
తైత్తరీయోపనిషత్ 'పరమాత్మను నమస్కారముగా ప్రార్ధించు. కోరికలన్నీ నీకు నమస్కారం చేస్తాయి” అని పేర్కొంటోంది. నిజం చెప్పాలంటే కేవలం ఒక్క నమస్కారం ద్వారా కోరికలను ఈడేర్చుకోవాలనుకోవడం కూడ అవివేకమే. ఎందుకంటే అసలు తనంతట తానే సర్వశుభాలను కలిగించే ప్రయత్నం నమస్కారం. అభిషేకానికి ఉపయోగించే ర్యుదస్తూక్షంతో 'నమక' అనే వాకములున్నాయి. ఈ అనువాకములతో శివుడు అనేక పేర్లతో అనేకసార్లు 'నమో నమః” అని ప్రార్థించబడతాడు. శివుని పంచాక్షరి, నారాయణుని అస్టాక్షరి మంత్రాలు రెండూ నమః” శబ్ధంతో మొదలవుతాయి. అందుకే పరమేశ్వరుడిని నమస్కార ప్రియునిగా అభివర్ణిస్తుంటారు.