Moksha |
మోక్షం సిద్ధించాలంటే.?
భక్తి, జ్ఞానం ఒక్కటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం. మనం భ్లక్తి దగ్గరే ఆగిపోతున్నాం. మన కోరికలున తీరిస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహించాడని సంబరపడతాం. తీరకుంటే ఖర్మ అనుకుని బాధపడతాం. భక్తి భావం నిజంగా చాలా గొప్పదే. మనలో భ్లక్షిభావం కలిగిందీ అంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నట్లే, కేవలం భగవంతుడిని కొలవడానికే ఆ భక్తి పరిమితం కాకూడదు. భగవదారాధన భక్షి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్న విశిష్టత తెలుసుకోలేము. దైవం ఏం చెప్పిందో గ్రహించలేము. భక్తి ముక్తిదాయకమైనది అయితే దానికి మైనున్న మెళ్లో జ్ఞానం. ఆత్మజ్ఞానం సాధించిన మనిషి బుషి అవుతాడు.
ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కాదు. మనగురించి మనం తెలునుకోవడమే మనలోని శక్తుల్ని సాధన మార్గం వైఫు మళ్ళించుకోవటమే. ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపలానణ్యాలను మాత్రమే కాక ఆయన చుట్టూ అలముకున్న దివ్యత్వాన్ని గ్రహించాలి. ఆ దివ్యత్వంలో ఉపదేశాలు, ప్రబోధాలు కూడా భాగమై ఉంటాయి. వాటిని గ్రహించాలి. ఆ ఉపదేశాలలో ఆచరణయోగ్యమైన వాటిని ఆచరించాలి. ఆ ప్రబోధాలలోని నీతిని గ్రహించాలి. తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే మోక్షదాయకమవుతుంది.
అలాకాకుండా జ్ఞానాన్ని మరుగున పరుచుకుని అజ్ఞానంతో (బతికితే మోక్షం సిద్ధించదు. తిరిగి నీచమైన జన్మ ఎత్తవలసి ఉంటుంది. పావ వుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే ఏ ఆత్మ అయినా మనిషిరూపంలో జన్మిస్తుంది. ఆ జన్మలో మోక్షసాధనకు కావలసిన మార్గాన్ని ఎంచుకోవడం మానవుని వివేచన మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు సృష్టించిన జీవజూలమేదీ భగవంతుని శక్తిని గ్తుర్లించలేకపోయాయి. భగవంతుని గ్గుర్డించిన వాడు మానవుడు ఒక్కడే, అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అని అంటారు. మనిషి తనకున్న
జ్ఞానంతో వివేకంతో మెలగి భగవంతుని కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు పరవళం చెంది, ఆ భక్తునికి వశుడవుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి సరైన గురువును ఎంచుకోనాలి. ఆ గురువు చూపిన మార్గంలో నడవాలి. గురువు చెప్పిన నీతిసూత్రాలు ఆచరించాలి. ఈ అచరణలో మీమాంసలు పనికిరావు. భగవంతుని మీద ఎటువంటి భక్తి శ్రద్ధలు చూవుతామో, ఆధ్యాత్మిక గురువు మీద అదే భక్తిని ప్రదర్శించాలి. అప్పుడే భగవదానుగ్రహం సులభతరమవుతుంది. మోక్షం సిద్ధిస్తుంది.