Mahabarata |
శ్రీ మహాభారతంలో శ్లోకములు
మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి".
మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!
- ఆదిపర్వం - 9984 శ్లోకములు,
- సభాపర్వం - 4311 శ్లోకములు,
- అరణ్య పర్వం - 13664 శ్లోకములు,
- విరాటపర్వం - 3500 శ్లోకములు,
- ఉద్యోగ పర్వం - 6998 శ్లోకములు,
- భీష్మ పర్వం - 5884 శ్లోకములు,
- ద్రోణ పర్వం - 10919 శ్లోకములు,
- కర్ణ పర్వం - 4900 శ్లోకములు,
- శల్య పర్వం - 3220 శ్లోకములు,
- సౌప్తిక పర్వం - 2870 శ్లోకములు,
- స్త్రీ పర్వం - 1775 శ్లోకములు,
- శాంతి పర్వం - 14525 శ్లోకములు,
- అనుశాసనిక పర్వం - 12000 శ్లోకములు,
- అశ్వమేధ పర్వం - 4420 శ్లోకములు,
- ఆశ్రమవాస పర్వం - 1106 శ్లోకములు,
- మౌసల పర్వం - 300 శ్లోకములు,
- మహా ప్రస్థాన పర్వం - 120 శ్లోకములు,
- స్వర్గారోహణ పర్వం - 200 శ్లోకములు,
అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి.