Daan |
దానములు - ఫలితాలు
సాధారణ రోజులలో చెసే దానములకంటే అమావాస్య రోజు చేసే దానం వంద రెట్లు ఫలితమిస్తుంది. గ్రహణ సమయాల్లో చేసే దానములకు ఫలితం మరింత అధికం. దక్షిణాయణ కాలంలో ఇచ్చే దానములకు కోటి రెట్లు, ఉత్తరాయణ పుణ్య కాలములో ఇచ్చే దానమునకు అంతకు వందరెట్లు ఉంటుంది.
భోజనము చేయుటకు దిక్కులు
- తూర్పు : ఆయుర్ వృద్ధి
- పడమర : సంపద వృద్ధి
- ఉత్తర : చేయరాదు
- దక్షిణ : కీర్తి, ప్రతిష్టలు
ప్రయాణానికి అనుకూల దినములు
- తూర్పు : మంగళవారము
- పడమర : బుధ, గురు
- ఉత్తర : ఆది, శుక్ర
- దక్షిణ : సోమ, శని
స్నాన ఫలములు
- తెల్లవారుజామున 4-5 గంటలు మధ్య చేయు స్నానం ఋషి స్నానం
- 5-6 గంటల మధ్య చేయు స్నానం దైవ స్నానం
- 6-7 గంటల మధ్య చేయు స్నానం మానవ స్నానం
- 7 గంటలు తరువాత చేయు స్నానం రాక్షస స్నానం
- చన్నీటి స్నానం శిరస్సు తడుపుకొని ప్రారంభించావలెను
- వేడి నీటి స్నానం పాదము తడుపుకొని ప్రారంభించావలెను
- స్నాన సమయమున మౌనముగా నుండనిచో తేజస్సు హరించును
- స్నానానంతరము ముందుగా ముఖము, తరువాత వక్షము, పిదప శిరస్సు మిగాతాభాగాములు తుడుచుకొనవలెను.