Bhakti |
భగవంతుడిపై భక్తి
ప్రేమతో, భక్తితో పిలిస్తే పలకని, తలిస్తే తరింపచేయని దైవం ఉంటారా? భక్తుల ప్రార్గనలోని వేడికోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా?
- ద్రౌపదిని వస్త్రాపహరణం నుండి కాపాడింది ప్రార్ధనే !
- గజేందుడికి (ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే !
- మార్కండేయుడిని యమగండం నుండి తప్పించింది ప్రారనే !
ప్రార్గన అంటే భక్తుడు భగవంతునితో జరిపే సంభాషణ. భగవంతుడు అందరివాడు. అందరిలోనూ ఉన్నాడు. ప్రార్ధన స్వభావం విదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు. అందుకే మనం చేసే ప్రతి
ప్రార్గనకూ ఫలం ఉంటుంది.
కీర్తి ప్రతిష్ట గౌరవం, ఐశ్వర్యం, ఆరోగ్యం వీదడగినా భగవంతుడు మనము కోరినవన్నీప్రసాదిస్తాడు. మనం కోరుకునేవీ అవే! మనం చేసే ప్రార్ధనలో దేవుడు కావాలని చేసే ప్రార్గన ఒక్కటీ ఉండదు. జ్ఞానాన్ని ప్రసాదించమని ఒక్కరూ భగవంతుడిని కోరుకోరు.
ఒకసారి కుంతీదేవితో శ్రీకృష్ణుడు “అత్తా ఏదైనా వరం కోరుకో!” అని అడిగాడట. “నాపై నీకు దయ ఉంటే ఎడతెగకుండా కష్టాలు ప్రసాదించు” అని కోరుకున్నదట కుంతీదేవి. “అదేమిటి? ఎవరైనా భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కోరుకుంటారు నువ్వేమో కష్టాలు కోరుకుంటున్నావు?” అని అన్నాడట శ్రీకృష్ణుడు. కష్టాలలో ఉన్నప్పుడే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది. సుఖాలకు మరిగితే ఇక నీ అవసరమే ఉండదు. నాకు భగవంతుని సాంగత్యమే కావాలి. అందుకు భగవంతుడిని ఎప్పుడూ ధ్యానించాలి. అది కావాలంటే కష్టాలు ఉండాలి. కాబట్టి నాకు కష్టాలనో ఇవ్వు” అని కోరుకున్నది కుంతీదేవి.