స్వామి అయ్యప్ప |
అయ్యప్ప చరితం - 7 వ అధ్యాయం
భూలోకంలో మహిష రూపంలో మహిషిని ఆనందపరుస్తున్న సుందరదత్తుడు భూతనాధుని ఆవిర్భావం జరగగానే మోక్షాన్ని పొందాడు. అతని మరణంతో మహిషిలో తిరిగి క్రోధావేశాలు కట్టలు త్రెంచుకుని పొంగివచ్చాయి. గుహలోనుండి వెలికివచ్చి పాతాళంలోని రాక్షసులను కూడకట్టుకుని దేవతలమీద యుద్ధం ప్రకటించి స్వర్గాన్ని స్వాధీనపరచుకుని ముల్లోకాలలో తిరిగి రాక్షస పాలన నెలకొల్పింది.
దేవతలు దీన వదనాలతో కైలాసానికి వచ్చారు. కళావిహీనులై కనిపిస్తున్న వాళ్లకు వూరట కలిగించాయి పరమేశ్వరుని వాక్కులు. ‘‘ఇంద్రాది దేవతలారా ! మీ కష్టాలు త్వరలోనే తీరగలవు ! భూతనాధుడు భూలోకానికి వెళ్లి ఆ మహిషిని వధించే సమయం ఆసన్నమైంది’’. మేఘ గంభీర స్వరంతో పరమేశ్వరుడిచ్చిన అభయానికి కలతదేరారు దేవతలు. ‘‘ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాము స్వామీ ! భూతనాధుడు వెంటనే బయలుదేరి భూలోకాన్ని చేరి మహిషిని ఎదుర్కొని హతం కావిస్తాడని అనుకుంటున్నాము. మా అంచనా సరైనదేనా స్వామీ?’’ అంటూ ప్రశ్నించాడు ఇంద్రుడు ఆతురత నిండిన స్వరంతో ! ‘‘అంతటి తొందరపాటు తగదు ఇంద్రా ! మహిషి అంతం కావడానికి మరికొంత కాలం వేచి వుండక తప్పదు ! ఆమె పొందిన వరానుసారం హరిహర పుత్రుడు భూలోకంలో పన్నెండు సంవత్సరాలు రాజవంశంలో పెరగవలసి వుందన్న విషయం మరవవద్దు!’’ అని గంభీరంగా గర్తుచేశాడు పరమేశ్వరుడు.
‘‘క్షమించండి స్వామీ ! నా తొందరపాటుతనాన్ని మన్నించండి!’’ అంటూ చేతుల జోడించి నమస్కరించాడు ఇంద్రుడు. ‘‘పితృదేవులకు ప్రణామాలు’’ అంటూ అప్పుడే పత్నులతో సహా వచ్చి నమస్కరించాడు భూతనాధుడు ! అతనివైపు ప్రసన్నంగా చూసి ‘‘పుత్రా ! రాక్షస సంహారం కావించడానికి నీవు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైంది!’’* అన్నాడు పరమేశ్వరుడు. ఇంద్రుడు భక్తిపూర్వకంగా భూతనాథునికి నమస్కరించాడు ! పరిపరి విధాలుగా స్తుతించాడు , భూతనాధుని స్తుతి.
పంచ బాణకోటి కోమలాకృతే కృపానిధే
పంచగవ్య పాయసాన్న పావకాది మోదకా
పంచభూత సంచయ ప్రపంచ భూతపాలకా!
పూర్ణ పుష్కళ సమేత భూతనాథ పాహిమాం!
(కోటి మన్మథుల సౌందర్యం కలవాడివి ! దయానిధివి ! పాయసం , పానకాలు ఇష్టపడే స్వామి ! పంచభూతాత్మకం అయిన ప్రపంచాన్ని పాలించేవాడవు ! పూర్ణ , పుష్కళ అనే దేవేరులతో కూడిన భూతనాధా ! మమ్మల్ని కాపాడు)
‘‘వీర బాహు వర్ణనీయ వీర్య శౌర్య వారిధే
వారిజాసనాది దేవవంద్య సుందరాకృతే
వారణేంద్ర వాజి సింహ వాహ భక్త సేవధే
పూర్ణ పుష్కళ సమేత భూతనాధ!
పాహిమామం’’
(వీరత్వంతో నిండిన బాహువులతో వీర్య శౌర్యాలు మూర్తీభవించిన సముద్రానివి! ఓ భూతనాధా! దేవతలందరికీ వందనీయుడవు! గజ , అశ్వ , సింహాలు వాహనాలుగా కలిగినవాడవు ! భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చేవాడవు ! పూర్ణా , పుష్కళ దేవేరులతో కూడిన స్వామీ ! మమ్మల్ని కాపాడు)
‘‘సామగానలోల శాంతశీల ధర్మ పాలకా
సోమ సుందరాస్య సాధు పూజనీయ పాదుకా
సామ దాన భేద దండ శాస్త్ర నీతి భూతకా
పూర్ణ పుష్కళా సమేత భూతనాధ పాహిమాం!
(సామగాన ప్రియుడవు ! శాంతి స్వభావుడవు ! చంద్రునిలా సుందర రూపం గలవాడవు ! నీ పాదాలను సాధుజనం పూజిస్తారు. చతురోపాయాలు - సామ , దాన , భేద , దండోపాయాలు తెలిసిన ధర్మశాస్తవు ! పూర్ణ , పుష్కళా సమేతుడవైన భూతనాధా! మమ్మల్ని కాపాడు!)
అంటూ ఇంద్రుడు చేసిన స్తుతులకు మెచ్చి అభయం ప్రసాదించాడు భూతనాథుడు. ‘‘ఇంద్రాది దేవతలారా! త్వరలోనే స్వర్గ భోగాలు మీకు లభించగలవు! నిశ్చితంగా ఉండండి’’ అన్నాడు. భూతనాథునికి , పరమేశ్వరునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని బయలుదేరారు దేవతలు ! వారు వెళ్ళాక తనను చూడవచ్చిన బ్రహ్మ , విష్ణువులవైపు చిరునవ్వుతో చూస్తూ ‘‘భూతనాథుడు భూలోకానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది’’ అన్నాడు పరమేశ్శరుడు.
అందరినీ కలియజూశాడు సూతమహర్షి !
‘‘మహర్షి ! గణపతి , కుమారస్వాములకు ఇద్దరిద్దరు పత్నులున్నట్లుగానే భూతనాధునికి ఇద్దరు పత్నులున్నట్లు తెలిపారు గదా ! భూతనాథుడే భూలోకానికి వచ్చి అయ్యప్పస్వామిగా అవతరిస్తాడని అనుకుంటున్నాము ! ఆ స్వామి ఎందుకు వివాహం చేసుకోలేదు ? ఆ సంగతులు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ వింటున్న వారిలో కొందరు మునులు అడిగాడు ! ‘‘మీరనుకుంటున్నట్లు భూతనాధుడే భూలోకంలో అయ్యప్పగా పూజింపబడతాడు ! మునులారా ! పురుషుని చేరే ప్రకృతిలో రెండు భాగాలు విలీనమై ఉంటాయి. వాటిని పరాప్రకృతి , అపరాప్రకృతి అంటారు . భక్తులకోసం ఈ రెండు భగవంతునికి పత్నులై భక్తుల కోరికలు సంపూర్ణంగా నెరవేర్చి వారి సుఖజీవనానికి కావలసిన ధన , ధాన్య భోగాలను పుష్కళంగా అనుగ్రహిస్తారు ! పూర్ణ , పుష్కళములు అయిన పరా , అపరా ప్రకృతులను తనలోనే విలీనం కావించుకుని భూతనాధుడు భూలోకంలో అవతరించడం జరిగింది. చిత్ర విచిత్రమైన సంఘటనలతో పన్నెండు సంవత్సరాలపాటు భూమిపై ఆ స్వామి కావించిన లీలల గూర్చి చెబుతాను ! సావధానులై వినండి !
‘‘విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం!!’’
అంటూ కళ్లు మూసుకుని ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి !
రెండవ అధ్యాయం
భూలోకంలో మణికంఠునిగా భూతనాథుని అవతరణం ! హరిహర స్తుతి: రాజశేఖరుని వృత్తాంతం ‘‘అభ్రంకశంబైన యాలబోతు నీతండు ద్రుంచినాడీతండు పెంచినాడు ! సాధుసమ్మతంబుగ సారుజంబు నీతండు గాచినాడీతండు ద్రోచినాడు! బర్హిర్ ముఖార్ధమై పర్వతేశునీతండు దాల్చినాడీతండు వ్రాల్చినాడు ! ఫణి పరంపర తోడి పన్నగేంద్రుడు నీతండు మెట్టినాడీతండు సుట్టినాడు ! నేడు నాడును , నాడును నేడు జూడ జెప్పంగ జెప్పంగ జూడగలిగెననుచు గొనియాడు సంయమి జనులకొదవె రజతగిరి మీద హరిహారారాధనంబు పూజా కార్యక్రమం ముగించి లేచారు రాజశేఖరుడు , ఆయన పత్ని ! పాండ్య వంశస్థుడు , పందల రాజ్యాన్ని పాలిస్తున్న ఆ రాజును సంతానం లేని కొరత ఎంతగానో బాధిస్తున్నది ! ‘‘రాకుమారుడు స్వస్థుడైనాడు ! ఇక మనకే చింతా లేకుండా చూస్తాడు !’’ వాళ్ళలో వాళ్లనుకుంటుంటే చిరునవ్వు నవ్వి ‘‘అవును ! ఇక ఏ చింతా దరిచేరదు. మీ ప్రియతమ నాయకుడిని’’ అంటూ అందరిని ఆశీర్వదించి బయలుదేరుతున్న వృద్ధుడికి పళ్ళెరం నిండా బంగారు నాణాలు పోసి బహూకరించబోయాడు రాజు ! ‘‘మహారాజా ! వాటిని మీ ప్రజలకే దానం చేయండి ?’’ అని వడివడిగా నడుస్తూ వెళ్లిపోయాడు వృద్ధుడు !
విషయం తెలిసిన మంత్రి , సేనాపతులలో పరివర్తన కలగకపోగా మణికంఠునిపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైనాయి. అతనిని తుదముట్టించడానికి మరో పథకం ఆలోచించసాగారు!
మంత్రి దురాలోచన
మణికంఠుడు ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకునేవాడు ! పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే ఎంతో పరిణతి చెందిన వ్యక్తిత్వంతో ప్రజాక్షేమం కోసం అతను తీసుకునే నిర్ణయాలు , జరిపే కార్యక్రమాలు దక్షతగల పాలకునిగా గుర్తింపు కలిగించాయి ! ఒక రోజు నిండు సభలో.. ‘‘మణికంఠుడు లేత వయస్సులోనే మాకంటే ముందుచూపుతో ప్రజారంజకమైన కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందటం తండ్రిగా నాకెంతో ఆనందం కలిగిస్తున్నది ! ఇక ఆలస్యం చేయకుండా అతనికి పరిపాలనా బాధ్యత అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలను కుంటున్నాను ! శుభముహూర్తం నిర్ణయించి త్వరలోనే పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిపించాలని సంకల్పించాను ! నా నిర్ణయం అందరికీ ఆనందం కలిగిస్తుందని నమ్ముతున్నాను’’ అంటూ ప్రకటించాడు రాజశేఖరుడు సభాసదుల సమక్షంలో ! అందరూ హర్షాధ్వానాలతో సమ్మతిని తెలియజేశారు.