శఠగోపనం |
శఠగోపనంతో ఫలితమేమిటి | Shatagopam
దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు.
- శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను తలుసుకోవాలి.
- అంటే మీ కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
- శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.