సీతారామ |
రామ నామము | Rama Namam
రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శ్రీ మదఖిల రహస్య మంత్రము విశేష నామము రామనామము. దారినొంటిగా నడుచు వారికి తోడునిడే రామనామము. నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరి కొలచిన వారి నెల్లను కొంగు బంగారు రామనామము. ఆలుబిడ్డల సౌఖ్యము కన్నా అధికముగా శ్రీరామనామము. నీవు నేనని భేదమన్నయు లేక యున్నది రామనామము. అండ పిండ బ్రహ్మాండముల కారంభమైనది రామనామము. గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము. బ్రహ్మ సత్య జగన్నిత్య భావమే శ్రీరామనామము. భక్తితో భజియించు వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము రామనామము. ఆంజనేయుడి వంటి భక్తుల ఆశయముగా రామనామము. యుద్ధ మహోగ్ర రాక్షస యాగ ధ్వంసమే రామనామము. రాకపోకడే యన్నది లేకయున్నది రామనామము.
ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామనామము. దాసులను రక్షించు దయగల ధర్మనామము రామనామము. నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించినది రామనామము. దాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే శ్రీరామనామము. పుట్ట తానై పాము తానై బుస కొట్టెను శ్రీరామనామము. అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము. జప తపంబులకర్షమైనది జగతిలో శ్రీరామనామము. జ్ఞాన భూముల నేడు గడిచిన మౌనదేశమే రామనామము. దట్టమైన గాడాంధకారమును రూపుమాపును రామనామము. పంచభూతాదితితమగా పరమాత్మము రామనామము. నిజ స్వరూప బోధకంబు తారకము శ్రీరామనామము. అల కుచేలుని చేతి అటుకులను ఆరగించునది రామనామము. ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది రామనామము. జానకి హృదయమందున నిత్య జపము రామనామము. చావు పుట్టుక లేని పదమై వెలుగుచున్నది రామనామము. మూడు నదులను దాటువారికి మోక్ష లక్ష్మియె రామనామము. దూరదృష్టిని లేనివారికి దుర్లభము శ్రీరామ నామము. భక్తితో ప్రహ్హాదుడడిగిన వరమొసగెను రామనామము. ఎందు చూచిన ఏకమై తానెలగుచున్నది రామనామం. వేద వాక్య ప్రమాణములచే అరుచున్నది రామనామం. శరణు శరణు విభీషణునకు రామనామం. వేద వాక్య ప్రమాణములచే అరుచున్నది రామనామం. శరణు శరణు విభీషణునకు శరణమొసంగిన రామనామం. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశమే రామనామము.
రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము
రమ్యమైనది రామనామము. శాంతితో ప్రార్ధించువారికి సాఖ్యమైనది రామనామము. బ్రహ్మ విష్ణు
మహేశ్వరులకు ఇష్టమైనది రామనామము. తల్లి వలె రక్షించు జనులను ఎల్ల కాము రామనామము. మంగళం రామకీర్తన శుభకరంబగు రామనామము. పరమ పదంను జేరి కొలుచు దారి చూపుము రామనామము. పాహికృష్ణ ద్రౌపది పలికినది శ్రీరామ నామం. ఇష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామ నామము. జన్మ మృత్యు రహస్యమెరిగి జపించునది శ్రీరామ నామం.
సత్య రజము తమో గుణము ప్రీతమైనది రామనామము. కామ క్రోదాధి మోహములను కాల్చునది శ్రీరామ నామము. ఆశ విడిచిన తృప్తలకు ఆనందమొసగును రామనామము. ప్రణవమను ఓంకార నాద బ్రహ్మమే శ్రీరామ నామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడును రామనామము. సర్వ మతములలోన ఇమిడిన తత్వసారము రామనామము. జీవితమున నిత్యజపముగ చేయవలె శ్రీరామ నామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. పాలమీగడ పంచదారల పక్వమే శ్రీరామ నామము. ఎందరో మహానుభావుల డెందమాయెను రామనామము. సిద్ధ మూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామ నామము. వెంట తిరిగెడి వారి కెల్లను కంటి పాపయే రామనామము.
శ్రీరామ నామ మహత్యం
- రామ నామము తారక మంత్రం. భవ భందాల నుండి విముక్తి కలిగించి సంసార సాగరాన్ని దాటించగల ఏకైక మంత్రం.
- ప్రణవనాదమైన ఓంకారం తర్వాత అంత మహత్వపూర్ణమైనది. ప్రతి మంత్రానికి రామనామంతో సారూప్యం చూపిస్తాడు. మనురిషి స్యవనుడు తన స్యవన స్మృతితో రామనామము సకల వేదాలు, శాస్త్రాలు ఇతిహాసాల సారంగా పేర్కొన్నాడు.
- యోగసాధనలో 'రా' మూలాధారం అనగా కుండలి శక్తి ఉద్భవించే బిందు కేంద్రం. 'మ' సహస్రం అనగా గమ్యస్థానం. కనుక రామనామము సరియైన ధ్వనితో ప్రకారంగా పలికితే నాగశక్తి కపాలస్టానాన్ని చేధిస్తుంది. ప్రతి జీవి నిర్యాన సమయంలో కాశీనాధుడైన విశ్వనాథుడు ఆ జీవి కుడి చెవిలో రామనామ మంత్రాన్ని ఉచ్చరిస్తాడని కాశీ స్థల పురాణంలో చెప్పబడింది.
- విష్ణు సహస్రనామంలో మహాదేవుడు పార్వతి దేవిని సర్వ కాలాల యందును విష్ణు నామ స్మరణం చేయమని చెప్పినట్టు ఉంది. రామ నామానికి అంతటి మహత్యం ఉంది.
- అంతే కాదు రామ అను మంత్రంలో "ఠా అను అక్షరాన్ని పలికినపుడు నోరు తెరుచుకుంటుంది.
- ఆ క్షణంలో మనలో ఉన్న పాపాలన్ని బయటకు రాగా, 'మి అని పలికినపుడు వెంటనే నోరు మూసుకుంటుంది. అప్పుడు బయటకు వచ్చిన పాపాలు లోపలికి రాకుండా ఇంకా దూరంగా వెళ్ళిపోవును.
ఓసారి ఉచ్చరించి చూడండి.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శ్రీరామ
'రా' అనే అక్షరం అష్టాక్షరి మంత్రం అయిన “ఓం నమోనారాయణాయి” నుంచి 'మ' అనే అక్షరం పంచాక్షరి మంత్రం అయిన “ఓం నమశివాయ' నుంది వచ్చాయి. ఈ రెండు అక్షరాలని ఎందుకు తీసుకొన్నారు. ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.
'రా' తీసివేస్తే 'ఓం నమో నారాయణాయ' కాస్తా 'ఓం నమో నాయణాయ' అవుతుంది. అసలు విరుద్ధమైన అక్షరం వస్తుంది. నారాయణకు నమస్మారం బదులు 'నడక' లేక 'కదలికి' లేని వాడిని అనగా ఆ చైతన్యంకి కపాల నమస్కారం అవుతుంది.
ఇక 'మ' తీసివేస్తే 'ఓం నమశ్శివాయ' కాస్తా 'ఓం నశ్శివాయి' అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్తం. నశ్శివాయ అనగా శివం కానిది అర్ధం వస్తుంది. అందుకే ఈ రెండింటిని కలపడం ద్వారా వచ్చిన 'రామ నామం” అత్యంత శక్తి వంతం అని అంటారు. రామ నామం 1000 నామాలకు సమానం.
అదే శివుడు పార్వతి దేవికి చెప్పెను.
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్ తుల్యం
రామ నామ వరాననే.
శనీశ్వరుని జయించిన రామ నామం :
పూర్వం ఒకసారి హనుమంతుడుని కవ్టాల పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. అపుడు హనుమంతుడు రామ నామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడిని విషయం చెప్పగా తాను రామ నామం జపంలో ఉన్నాని అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంత సేపు నిరీక్షించినా రామ నామ జపం పూర్తవలేదు. దీంతో రామనామం జపించే వాళ్ళ దరి చేరడం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు శనీశ్వరుడు. కాబట్టి రామనామాన్ని జపిస్తే శని బాధలుందవు.
శ్రీరాముని యొక్క శ్రీరామ నామం జపించడం కాని - శ్రీరామకోటి రాయడం కాని ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. మన పురాణాలులో ఆదికావ్యంగా చెప్పబడిన వాల్మీకి మహర్షి యొక్క “శ్రీ రామాయణం” లో చెప్పబడింది.
రామ నామం యొక్క గొప్పదనం శ్రీ రామాయణంలో అడుగడుగున చెప్పబడుతుంది. అసలు శ్రీరాముని కంటే ముందు రామ సాయం ఆవిర్భవించింది. అంత గొప్పది శ్రీరామ నామం. ఈ నామాన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు జాతి, కుల, మత బీధాలు లేకుండా జపించవచ్చు, రాయవచ్చు, స్మరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి ఆది దేవుడు అయిన శివ పరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తారు. అంత గొప్పది రామ నామం.
శ్రీరామ నామం విలువ
హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికెను. '“గురు దేవా! శ్రీరామ చంద్రా! జగత్ప్రభూ ” మీరు చాలా గొప్ప వారు కాని ఈ లోకంలో మీ కంటే గొప్పది ఇంకొకటుంది.
అప్పుడు వెంటనే శ్రీరాముడు అదేమిటో మాకు చెప్తారా! అని అడిగాడు. అదే మీ నామం అన్నాడు ఆంజనేయుడు. ఆ మాటను ఇప్పుడు బుజువు చేస్తావా అని అడిగాడు శ్రీరాముడు. తప్పక చెప్తాను వినండి. మీ వల్ల అయోధ్య వాసులు తరించారు. మీ నామం వలన ముల్లోక వాసులు తరించి పోతున్నారు అని చెప్పేశాడు ఆంజనేయుడు. ఆంజనేయునిలో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మిగుల సంతోషించాడు. శ్రీరామ చంద్రుడి యొక్కమానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్య వాసులు పుణ్యం కట్టుకొన్నారు, ఆనంద పడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి, తరించి, ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు భవ సాగరాన్ని దాటిపోతున్నారు.
రామ నామం విలువ రామ నామం యొక్క మాధుర్యాన్ని చవి చూసి శ్రీరామచంద్రుని తమ హృదయమందు ధ్యానించి ఆంజనేయుడి వలె ఎందరో మునులు, బుషులు, తపస్సులు, సాధకులు, ముముక్షువులు మోక్షం పొంది ధన్యులైనారు.
ఇటీవి కాలంలో తులసీదాసు, సమర్ధ రామదాసు, కబీరుదాసు, భద్రాచల రామదాసు, త్యాగరాజు, గాంధీజీ మున్నగు భక్తులెందరో రామనామమును జపియించి పరమానంద భరితులైనారు.
రామ నామ విశిష్టత
శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనుక ఆంతర్యం. “రామి ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరమౌతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే రామ నామం గొప్పదని చాలా కథలు మనకు చెబుతున్నాయి.
అసలు రాముడితో పుట్టిన రామనామం ఎందుకు గొప్పది అయింది. రామనామంను తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుండి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుందనే వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయ పడుతుంది. కాబట్టి అత్యంత శక్తి వంతమైన రామ నామాన్ని జపిస్తూ ఉండాలి. వాలి అపహరణ నుండి సుగ్రీవుడు తన భార్యను ఎలా రక్షించుకున్నాడు. భగవనానమ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా ప్రతి దేవుడి నామ స్మరణలో అద్భుతమైన శక్తి మహిళ ఉంటుంది.
మన హిందువులకు ఉన్న ఏడు కోట్ల మహా మంత్రాలలో 2 అక్షరాల “రామ” మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కల్గిన రామ నామం విళిష్టత రామనామం గొప్పదనం రామ నామం శక్తి సామర్భాలని తెలుసుకొందాం.
రామనామం పుట్టుక
తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం రెండు మహీ మంత్రాల నుంచి పుట్టింది. “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రంలో 'రా' అనే అక్షరం జీవాక్షరం. అలాగే “ఓం నమశ్శివాయ” అనే పంచాక్షరీ మంత్రంలో 'మ” అనేది జీవాక్షరం. ఈ రెండు అక్షరాల ద్వారా రామ మంత్రం పుట్టింది. శివకేశవ మంత్రంగా రామ నామం పిలువబడుతుంది.
రాముడి కంటే రామనామం గొప్పది
లంకపై దండెత్తడానికి రాళ్ళతో సముద్రంపై వానర సేన వారధిని నిర్మించిన సంగతి అందరికి తెలుసు. అయితే రాయిపై “రామి అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది. తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరేసాడు. కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. రాముడు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతున్ని అడిగాడు. అప్పుడు హనుమంతుడు రామ అనే మంత్రం రాసిన రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపై రామ నామం లేదు కదా అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు.
ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనది అని
భావించడం మొదలు పెట్టారు.
రామ నామం అర్ధం
రామ అనే మంత్రంలో 'ర.అ.మ' అనే అక్షరాలున్నాయి.
'ర' అంటే 'అగ్ని'
'అ' అంటే 'సూర్యుడు'
'మ' అంటే 'చంద్రుడు' అని అర్థం. రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని వివరిస్తుంది.
రామనామ మంత్రం :
శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 18 అక్షరాల నామ మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన విశేష పుణ్యం లభిస్తుంది. సమర్ధ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నామ జపం వలన మంచి ఫలితం వస్తుంది.
భగవన్నామాన్ని ఉచ్చరించగలిగిన స్థితి ఒక్క మనుప్య ప్రాణికి ఉంది. నామానికి, నామికి బేధం లేదు. నామం, నామి పరస్పరం కలిసి ఉంటాయి. దారం పట్టుకొంటే ఎంత దూరమున్నా గాలిపటం దగ్గరకు వచ్చినట్లు నామాన్ని ఆశ్రయిస్తే నామి తక్షణమే హృదయ కుహరంలోకి వచ్చి చేరుతారు. నామి శ్రీరామచంద్ర ప్రభువు. కాబట్టి రామనామాన్ని ఆధారపరచుకొని రాముని యొక్క అనుభూతికి ఎందరో తమ హృదయ సీమల్లో పొందుతున్నారు. హనుమంతుని హృదయ సీమల్లోని వ్యాక్యాల్లో ఇట్టి మహోన్నత భావాలు ఇమిడి ఉన్నాయి. కనుకనే అద్భుత భావ పూరితములైన వారి వాక్యాలను వినగానే శ్రీరామచంద్రుడు పరమ ఆనందం పొందాడు.
జీవుడా! నీవు రామ నామాన్ని ఆశ్రయించు తద్వారా రాముని హృదయ కుహరంలోకి ఆహ్వానించు. రామ రసాన్ని రామ నామంని ఆస్వాదించి రామ అనుభూతిచే ఆత్మ రాముని దర్శించుకుంటే నీవు పునీతుడవుతావు. దశరథ రాముని ద్వారా ఆత్మా రాముని అనుభవం తప్పక నీకు కలుగుతుంది.
రామ నామాన్నిగురించిన చక్కని ఒక కథ
త్రేతాయుగంలో శ్రీరాముల వారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతరం శ్రీరామ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడ హనుమ ఉంటాడు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు హనుమ. ఐతే సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామం జపిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని కోపం వచ్చి ఆగ్రహంతో తన తోకతో ఆ భక్తుని వీపుపై ఒక దెబ్బ గట్టిగా వేశాడు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని గట్టిగా శబ్దంతో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అలాంటి సమయంలో ఇటువంటి వాడి చుట్టినా నేను రామనామం కోసం తిరిగింది? అని అక్కణ్ణుంచి హనుమ రాజ ప్రసాదానికి చేరుకొన్నాడు.
రాజ ప్రసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాలేదు. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారం లోనికి తీసుకల్లి పడుకోబెట్టారు. ఎవ్వరినీ లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ లక్షణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంస తూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుకుని ఉన్నారు. వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల బెషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకి వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాముల వారికి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు. లోనికి వచ్చి చూసిన హనుమ ఆరగహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగాడు. అప్పుడూ నొప్పితో ఉన్న శ్రీరాముల వారు నువ్వే కదా హనుమ ఆ భక్తుని తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అని అనగా హనుమ జరిగిన అనర్దూన్ని తెలుసుకొని క్షమించమని రామ పాదాలను ఆశ్రయించి నమస్కరించి స్వామీ! మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని నితిశయ భక్తికి మెచ్చి అతనిని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చి అమ్మవారు వ్రాస్తున్న బెషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించి తరువాత రామ గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నుపూస పూత పూయగా రాముల వారి నొప్పి తగ్గిపోయింది.
ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. ఏ రామనామం భక్తులు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధ పడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్ట గలిగేది కూడా రామభక్తుల నోటి యందుందడే రామనామమే అని చెల్బ ఆశీర్వదించి పంపాడు.
కనుక ఇటువంటి రామనామాన్ని మనం కూడా స్మరిద్దాం. మరిన్ని పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకోవాలంటే, TELUGU BHAARATH అనే YOUTUBE Link ని క్లిక్ చేయండి.
రచన: జక్కుల రమెష్ - 9515544174, పాలకుర్తి మహేష్ - 9573084705: తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా