శ్రీ అరుణాచలేశ్వర |
అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహమే అనుగ్రహం.
ప్రపంచములోనే కాకుండా నక్షత్రములు, ఖండాలు మొదలగు అన్నీ లోకములయందును ఉన్న ఒక్కొక్క వస్తువు పంచభూతాల ద్వారా రూపొందించబడినవే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనబడు పంచభూత తత్వాలచే వివిధ నిష్పత్తులతో రూపొందించబడిన రచనలే ప్రపంచములో ఉన్న ఒక్కొక్క వస్తువునకు మూలాధారముగ నున్నవి. పంచ భూతాలను సృష్టించిన భగవంతుడే కాంచీపురం (భూమి), తిరుఆనైక్కా (నీరు), తిరుఅణ్ణామలై (అగ్ని), కాళహస్తి (వాయువు), చిదంబరం (ఆకాశము) వంటి ఐదు పుణ్య స్థలములయందును పంచభూత లింగాలుగా ఆవిర్భవించి కటాక్షించుచున్నాడు.
శ్రీ అణ్ణామలై స్వామి వారి ఆవిర్బావం
పంచభూతాలలో ముందుగా ఆవిర్భవించినది అగ్ని. ఆదిలో పరమశివుడు అగ్నిగోళముగా తిరుఅణ్ణామలై పుణ్యస్థలియందునే ఆవిర్భవించెను. తదనంతరము కాంచీపురమునందు శ్రీ ఏకాంబరేశ్వర లింగ రూపమున వెలసెను. ఇతర పంచభూత లింగ మూర్తులందలి చతుర్లింగములు లింగ రూపమునే ధరించియుండగ, తిరుఅణ్ణామలైయందు మాత్రము సదాశివుడు అగ్నిగోళముగా ప్రకాశించుచున్నాడు.
తిరుఅణ్ణామలై అగ్నిగోళ రూపముగా, జ్యోతి స్వరూపముగా ప్రకాశించుట వలన సాధారణ కనులతో దర్శించుట సాధ్యము కాక సమస్త జీవరాసులును శ్రమ పడుట గమనించిన సిధ్ధ పురుషులు, మహర్షులు, “ప్రభూ ! ఇతర నాల్గు పంచభూతములనూ లింగ రూపమున దర్శించి ఆనందించుచున్నట్లుగ, తిరుఅణ్ణామలైయందలి కూడా తమరి అగ్నిగోళ రూపమును సాధారణ జీవుడునూ చూడగల్గు రూపములో దర్శనమివ్వ గలరు !” యని వేడుకొనుచూ కోట్ల యుగములు ఘోర తపస్సు చేపట్టిదిరి.
అడిగిన తడవే వరములను ప్రసాదించునటువంటి శ్రీపరమేశ్వరుడు, “నేను కృత, త్రేత, ద్వాపర, కలియుగములయందు ఒక్కొక్క యుగములోనూ ఆయా యుగ నియమానుసారాల కనుగుణముగ ఒక్కొక్క రూపములో తిరు అణ్ణామలైలో దర్శనమిచ్చెదను.” యని వరమిచ్చెను. ఆయన వరము ప్రకారము కృత యుగమునందు నిప్పు కొండ, త్రేతా యుగమునందు మాణిక్యపు కొండ మరియు ద్వాపర యుగమునందు పసిడి కొండగా దర్శనమిచ్చిన తిరుఅణ్ణామలై కలియుగములో రాతి కొండ రూపములో దర్శనమిచ్చుచున్నది. యావత్భూలోకములో తిరుఅణ్ణామలైయే అతి పెద్ద శివలింగము.
సర్వమును తిరుఅణ్ణామలైలోన ఇమిడినవే
దేవుడే పర్వత రూపముగల్గి దర్శనమిచ్చినాడనిన తిరుఅణ్ణామలై అంతర్ బాహ్యములందు వ్యాపించి యుండునది భగవంతుని అనుగ్రహ జ్యోతియేకదా ! మనకు మామూలు మానవ కంటితో కనుబడు 2600 అడుగుల ఎత్తే తిరువణ్ణామలై ఎత్తా ? కానే కాదు.
ఈ పర్వతములోపల అనంత కోటి బ్రంహాండాలు, పలు విధములైన గోళాలు, వేలాదివేల గ్రహాలు, నక్షత్ర మండలాలు వేర్వేరు విధమైన లోకాలును ఇమిడియున్నాయి. ఈ ప్రపంచానికే కాదు, అపరిమితమైన లోకములన్నింటికీ కూడా దివ్య నిధి ఈ తిరుఅణ్ణామలై !
సాధారణ రాతి కొండ లాగ మన కనులకు కనిపించిననూ, తిరుఅణ్ణామలై లోపల దాగి ఉన్న ఆధ్యాత్మిక నిధులు ఎన్నో, ఎన్నెన్నో ! ఉదాహరణకు, తిరుఅణ్ణామలై యొక్క కొండ శిఖరమునందు “ఊర్ధ్వ మూల మరం [స్థానిక మూల వృక్షం]” అనబడు మర్రి చెట్టు కలదు. దీని వ్రేళ్ళ భాగము వంగి పైకిచూచుచు ఆకాశమున వ్రేళ్ళూని యుండును. ఈ వృక్షము క్రింద, శ్రీ దక్షిణా మూర్తి మానవ శరీరము ధరించి నేటికినీ యోగానంద ధ్యానావస్థలో తిరుఅరుణగిరియోగిగా దర్శనం ఇచ్చుచున్నాడు. కానీ ఎవరూ సులభంగా వెళ్ళి దర్శించుట వీలు కాదు.
శ్రీ రమణ మహర్షికే ఆ మర్రి చెట్టు యొక్క ఒకే ఒక్క ఆకును మాత్రమే దర్శించే భాగ్యము కలిగెను అనగ మన పరిస్థితి ఏమిటన్నది కాస్త ఆలోచించి చూడండి ! విధి ప్రకారముగ తపస్సు చేసినవారు మర్రి చెట్టు ఉన్న కొండ శిఖర భాగములో శ్రీ ఆది పరాశక్తియొక్క ఒక అంశమైన శ్రీ ఆయుర్ దేవియొక్క జ్యోతి స్వరూప దర్శనము పొందవచ్చు. భూలోకములో మరెక్కడనూ ఈ అంబికయొక్క జ్యోతి దర్శనం లభించుట అంత సులభము కాదు. ఈ శిలా జ్యోతి రూపాన్ని శనకాది మునులు నలుగురున్ను ప్రతి దినము విచ్చేసి పూజించి వెళుతున్నారు. శ్రీ సూర్య భగవానుడుకూడ ప్రతి దినము శ్రీ ఆయుర్దేవిని మ్రొక్కి వెళుతున్నారు.
అందరూ భక్తితో " అరుణాచల శివ " అని స్మరించండి ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు ...అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ