Gurusishyas |
కొన్ని సారోక్తులు
శిష్యుడు: భూమిని సృష్టించటానికి పూర్వం ఎవరున్నారు
గురువు: పంచభూతములు - ఈశ్వరుడు
శిష్యుడు: భూమిని జీవరాశిని ఎవరు సృష్టించారు?
గురువు: ఈశ్వరుడు
శిష్యుడు: సృష్టిని ఎవరు వృద్ధిపరుస్తారు?
గురువు: బ్రహ్మ
శిష్యుడు: బ్రహ్మ ఎవరు?
గురువు: ఈశ్వరుని శక్తి.
శిష్యుడు: సృష్టిని పాలించేది ఎవరు?
గురువు: విష్ణువులేదా నారాయణుడు
శిష్యుడు: విష్ణువు ఎవరు?
గురువు: ఈశ్వరుని శక్తి
శిష్యుడు: సృష్టిని లయము లేదా ధ్వంసము చేసేది ఎవరు?
గురువు: మహేశ్వరుడు- అంటే మహాదేవుడు
శిష్యుడు: మహాదేవుడెవరు?
గురువు: ఈశ్వరుని శక్తి
శిష్యుడు: బ్రహ్మణి ఎవరు?
గురువు:బ్రహ్మ యొక్క శక్తి
శిష్యుడు: లక్ష్మీ ఎవరు?
గురువు: విష్ణువు యొక్క శక్తి
శిష్యుడు: దుర్గ ఎవరు?
గురువు: మహాదేవునిశక్తి
శిష్యుడు సంసార సాగరాన్ని తరింపజేసేది ఎవరు?
గురువు: ఈశ్వరుడు
శిష్యుడు: బంధనమంటే ఏమిటి?
గురువు: విషయానురక్తి
శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి?
గురువు: విషయముపట్ల విరక్తి చెంది ఈశ్వరునిలో లీనం కావటం
శిష్యుడు : ఘోరమైన నరకం ఏది?
గురువు: మనశరీరము
శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది?
గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమియే స్వర్గము
శిష్యుడు: సంసార బంధనం ఎట్లా తొలగిపోతుంది?
గురువు: ఆత్మజ్ఞానమువలన
శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది
గురువు: తత్త్వజ్ఞానమువలన
శిష్యుడు: నరకమునకు కారణమేది?
శిష్యుడు: స్వర్గప్రాప్తికి కారణమేమిటి?
గురువు: అహింస
శిష్యుడు: మనిషికి శత్రువు ఎవరు?
గురువు: అతని ఇంద్రియములే.
శిష్యుడు: మనిషికి మిత్రుడు ఎవరు?
గురువు: వశీకృతములైన ఇంద్రియాలు
శిష్యుడు: దరిద్రుడు ఎవరు
గురువు: చాలా లోభి అయినవాడు
శిష్యుడు: ఐశ్వర్యవంతుడు ఎవరు?
గురువు: ఎప్పుడూ సంతుష్టుడుగా ఉండేవాడు.
శిష్యుడు: జీవన్మృతుడు ఎవరు?
గురువు: ప్రయత్నమే చెయ్యని పురుషుడు
శిష్యుడు: మాయ అంటే ఏమిటి?
గురువు: అతి ప్రేమ
శిష్యుడు: మహా అంధుడెవరు?
గురువు: కామాతురుడు
శిష్యుడు: మృత్యువంటే ఏది?
గురువు: అపకీర్తియే మృత్యువు. మనుష్యుడు అమరుడు.
శిష్యుడు: చిరకాలముండే రోగమేది?
గురువు: సంసారము
శిష్యుడు: ఆ రోగమునకు మందేమిటి?
గురువు: నిర్లిప్తుడై ఉండటమే
శిష్యుడు: ప్రధాన తీర్థమేది?
గురువు: పవిత్రమైన మనస్సు
శిష్యుడు: త్యాజ్యమేది?
గురువు: అర్థము - దురాశ
శిష్యుడు: వినదగినదేది?
గురువు: గురుసన్నిధిలో వేదాంతబోధ
శిష్యుడు: బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఉపాయమేమిటి?
గురువు: సత్సాంగత్యము
శిష్యుడు: సాధువు ఎవరు?
గురువు: మోహము, అనురాగములు లేనివాడు
శిష్యుడు: జీవునికి జ్వరమేది?
గురువు: చింత
శిష్యుడు: మూర్ఖుడెవరు?
గురువు: అవివేకియైనావడు
శిష్యుడు: నాస్తికుడెవరు?
గురువు: ఈశ్వరుని అస్తిత్వమును ఒప్పుకోనివాడు.
శిష్యుడు: పండితుడెవరు?
గురువు: జ్ఞాని
శిష్యుడు:్ధ ర్మికుడెవరు?
గురువు: యథార్థ పండితుడు
శిష్యుడు: చేయవలసిన పని ఏమిటి?
గురువు:్భ గవంతుని పట్ల భక్తి
శిష్యుడు: విద్య అంటే ఏమిటి?
గురువు: బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది
శిష్యుడు: లాభమంటే ఏమిటి?
గురువు: బ్రహ్మజ్ఞాన ప్రాప్తి
శిష్యుడు: జగద్విజేత ఎవరు?
గురువు: మనస్సును జయించినవాడు
శిష్యుడు: విషయమంటే ఏది?
గురువు: విషయము
శిష్యుడు: దుఃఖితుడు ఎవరు?
గురువు: వియానురక్తి కలవాడు
శిష్యుడు: సుఖవంతుడు ఎవరు?
గురువు: ఏరకమైన చింతలేనివాడు
శిష్యుడు:్ధ న్యుడెవరు?
గురువు: పరోపకారి
శిష్యుడు: పూజనీయుడెవరు?
గురువు: తత్త్వజ్ఞానియైన వ్యక్తి
శిష్యుడు: కర్తవ్యం ఏమిటి?
గురువు: మోహము - పాపము
శిష్యుడు: బుద్ధిమంతుడెవరు?
గురువు: స్ర్తికి వశుడు కానివాడు
శిష్యుడు: ఉత్తమ వ్రతమేది?
గురువు: సత్పాత్రదానము
శిష్యుడు: సంకెల ఏది?
గురువు: స్ర్తిలోలత్వము
శిష్యుడు: లోకులకు తెలియనిది ఏది?
గురువు: స్ర్తి వయస్సు, స్ర్తి చరిత్ర
శిష్యుడు: ఎవరు పశువు?
గురువు: మూర్ఖుడు
శిష్యుడు: ఎవరితో సాంగత్యం చెయ్యకూడదు?
గురువు: మూర్ఖునితో, పాపితో, దుర్మార్గునితో నీచునితో
- ఇంకాఉంది